Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. National
  3. కేరళలో ఈసారి మా ప్రభుత్వమే
ADVERTISEMENT 

కేరళలో ఈసారి మా ప్రభుత్వమే

National Sakshi User Sakshi Sakshi Time Mar 16, 2026 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Narendra-Modi.jpg

ప్రధాని నరేంద్ర మోదీ ధీమా  

అభివృద్ధి కావాలంటే మార్పునకు పట్టం కట్టాలని పిలుపు  

కేరళ, తమిళనాడులో ప్రధానమంత్రి పర్యటన  

రూ.వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రారంభం, శంకుస్థాపనలు  

కొచ్చి/తిరుచిరాపల్లి:  కేరళలో సీసీఎం నేతృత్వంలోని అధికార ఎల్డీఎఫ్, కాంగ్రెస్‌ నేతృత్వంలోని విపక్ష యూడీఎఫ్‌ కూటములు అవినీతిలో కూరుకుపోయాయని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రెండు కూటములకు గట్టిగా బుద్ధి చెప్పాలని కేరళ ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మార్పునకు పట్టం కట్టాలని కోరారు. ప్రధాని మోదీ బుధవారం కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో పర్యటించారు. తొలుత కేరళలో ‘అఖిల కేరళ ధీవర సభ’ స్వర్ణోత్సవాలకు హాజరయ్యారు. 

అనంతరం కొచ్చిలో ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో భాగంగా రూ.11,000 కోట్ల విలువైన అభివృద్ధి, మౌలిక సదుపాయాలు ప్రాజెక్టులు ప్రారంభించారు, మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, మంత్రులు ఈ కార్యక్రమాన్ని బహిష్కరించడం గమనార్హం. అనంతరం బీజేపీ ర్యాలీలో ప్రజలను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. రాష్ట్రంలో తమ పార్టీ బలం పెరిగిందని చెప్పారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడం తథ్యమని ధీమా వ్యక్తంచేశారు. పశ్చిమాసియా పరిణామాలపై రాజకీయం చేస్తున్నారని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాందీపై మోదీ మండిపడ్డారు. 

పశ్చిమాసియా యుద్ధంపై ప్రజలను రెచ్చగొట్టేలా, బాధ్యతారాహిత్యంగా విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. మన దేశ అభివృద్ధి గురించి కాంగ్రెస్‌ యువరాజుకు ఏమాత్రం తెలియదని ఎద్దేవా చేశారు. మన కంపెనీలు, మన యువత సాధిస్తున్న విజయాలు రాహుల్‌ ఏం తెలుసని ప్రశ్నించారు. శబరిమల బంగారం దొంగతనంలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్‌లకు ప్రమేయం ఉందని ఆరోపించారు. మత రాజకీయాలు చేస్తూ రాష్ట్ర అభివృద్ధి అడ్డుకుంటున్నాయని ధ్వజమెత్తారు. ఆ రెండు కూటములకు బుద్ధి చెప్పాలని, ఈసారి ‘మోదీ గ్యారంటీల’తో ముందుకొస్తున్న బీజేపీకి అవకాశం ఇవ్వాలని కోరారు.  

తమిళనాడు అభివృద్ధికి ప్రణాళికలున్నాయి  
తమిళనాడు రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. ఆయన తమిళనాడులోని తిరుచిరాపల్లిలో రూ.5,650 కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రారంభించారు, మరికొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. రెండు అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు పచ్చజెండా ఊపారు. అనంరతం ఎన్డీఏ ఎన్నిక ప్రచార సభలో ప్రసంగించారు. రాష్ట్రంలో డీఎంకే పాలనలో మహిళలు, చిన్నారులపై నేరాలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తంచేశారు. నేరగాళ్లు యథేచ్ఛగా తిరుగుతున్నారని ఆరోపించారు. 

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే గెలిపిస్తే ప్రజలకు అన్ని విధాలుగా రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. శాంతి భద్రతలు కాపాడుతామన్నారు. నేరగాళ్లను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. తమిళనాడులో అవినీతికి అంతే లేకుండాపోయిందని దుయ్యబట్టారు. నదులన్నీ చివరికి సముద్రంలో కలిసిపోయినట్లు అవినీతి సొమ్ము చివరకు ఒక కుటుంబానికి చేరుతోందని సీఎం స్టాలిన్‌పై నిప్పులు చెరిగారు. డీఎంకే ‘శాస్త్రీయమైన అవినీతి మోడల్‌’ను అమలు చేస్తోందన్నారు. 

తమిళనాడు అభివృద్ధి పట్ల తన వద్ద ప్రణాళికలు ఉన్నాయని చెప్పారు. ఈ ప్రాంతాన్ని రేర్‌ ఎర్త్‌ కారిడార్‌లో ఒక భాగంగా మారుస్తామని ప్రకటించారు. బెంగళూరు–చెన్నై, చెన్నై–హైదరాబాద్‌ బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టులు నిర్మించాలన్న ప్రతిపాదన ఉందని మోదీ తెలిపారు. ‘అభివృద్ధి చెందిన భారత్‌కు అభివృద్ధి చెందిన తమిళనాడు’ అత్యంత కీలకమని స్పష్టంచేశారు. రాష్ట్ర ప్రజల సంక్షేమమే తమ ధ్యేయమని వెల్లడించారు. 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Narendra Modi
Five State Elections 2026
Kerala Assembly election
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఇక ఎన్డీఏ వేదిక 'మంగళ్ మిలన్’!

ఇక ఎన్డీఏ వేదిక 'మంగళ్ మిలన్’!

అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభం.. మోదీ ఐదు సంకల్పాలు ఇవే..

అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభం.. మోదీ ఐదు సంకల్పాలు ఇవే..

అగ్నిప్రమాదంపై ప్రధాని విచారం.. ఎక్స్‌గ్రేషియా ప్రకటన

అగ్నిప్రమాదంపై ప్రధాని విచారం.. ఎక్స్‌గ్రేషియా ప్రకటన

మీరు గొప్పనేత ఎప్పుడౌతారో ఏమో!

మీరు గొప్పనేత ఎప్పుడౌతారో ఏమో!

అజేయంగా మన సముద్ర శక్తి

అజేయంగా మన సముద్ర శక్తి

యోగాతో ప్రపంచ శాంతి 

యోగాతో ప్రపంచ శాంతి 

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.