Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. National
  3. మహిళలు క్షమించరు!
ADVERTISEMENT 

మహిళలు క్షమించరు!

National Sakshi User Sakshi Sakshi Time May 26, 2026 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
modi.jpg

మహిళా బిల్లును అడ్డుకున్న పాపం విపక్షాలదే.. కాంగ్రెస్‌ సహా ప్రతిపక్షాలపై మోదీ నిప్పులు

నారీశక్తి ఆకాంక్షలను కర్కశంగా నలిపేశాయి 

భ్రూణహత్యతో పాపం మూటగట్టుకున్నాయి 

దీన్ని దేశ మహిళలు ఎప్పటికీ మర్చిపోలేరు 

వాటికి మర్చిపోలేని గుణపాఠం నేర్పుతారు 

బిల్లు వీగిపోయినందుకు ఎంతగానో దుఃఖించా 

మహిళలందరికీ క్షమాపణలు చెబుతున్నా జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రధాని 

రిజర్వేషన్ల అమలుకు పోరాడతానని వెల్లడి

 

న్యూఢిల్లీ: నారీ శక్తికి చట్టసభల్లో సముచిత ప్రాతినిధ్యం దక్కాలన్న పవిత్రమైన ఆశయంతో తెచ్చిన మహిళా రిజర్వేషన్ల సవరణ బిల్లును ఓడించిన పాపం పూర్తిగా విపక్షాలదేనంటూ ప్రధాని నరేంద్ర మోదీ దుయ్యబట్టారు. వాటి ముసుగు తొలగి అసలు రంగు బయట పడిందన్నారు. ‘‘మా ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధితో ప్రయత్నించినా బిల్లుకు పార్లమెంటు ఆమోదం పొందలేకపోయాం. ఇందుకు దేశ మహిళలందరితో పాటు నేను కూడా ఎంతగానో దుఃఖిస్తున్నా. వారికి మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నా’’అని పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని 2029 నుంచే అమల్లోకి తెచ్చేందుకు ఉద్దేశించిన రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు శుక్రవారం లోక్‌సభలో వీగిపోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని శనివారం రాత్రి జాతినుద్దేశించి 30 నిమిషాల పాటు ప్రసంగించారు. ‘‘కాంగ్రెస్, డీఎంకే, తృణమూల్‌ కాంగ్రెస్, సమాజ్‌వాదీ తదితర విపక్షాలు దేశ మహిళల చిరకాల ఆకాంక్షను అత్యంత కర్కశంగా నలిపేశాయి. బిల్లును ఓడించడం ద్వారా భ్రూణ హత్యకు పాల్పడ్డాయి. పైగా అందుకు నిండు సభలోనే సంబరాలు చేసుకున్నాయి. బల్లలను చరుస్తూ హర్షాతిరేకాలు వెలిబుచ్చాయి. మహిళల ఆత్మగౌరవాన్ని అత్యంత దారుణంగా గాయపరిచాయి’’అంటూ తూర్పారబట్టారు. మహిళల ఆకాంక్షలను ఆ పార్టీలు కాలరాసిన తీరును దేశ పౌరులంతా గమనిస్తూనే ఉన్నారన్నారు. ‘‘విపక్షాల పాపానికి ఎన్నటికీ నిష్కృతి లేదు. అందుకు తగిన శిక్ష అనుభవించక తప్పదు. 

మహిళా శక్తిని విపక్షాలు తేలిగ్గా తీసుకుంటున్నాయి. కానీ భారత మహిళ దేన్నయినా మర్చిపోతుందేమో గానీ తన ఆత్మగౌరవాన్ని కించపరిస్తే మాత్రం సహించబోదు. రిజర్వేషన్ల బిల్లుకు కాంగ్రెస్, డీఎంకే, తృణమూల్, సమాజ్‌వాదీ తదితర పార్టీలు తలపెట్టిన ద్రోహాన్ని మహిళలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. అవి ఎన్నటికీ మర్చిపోలేని రీతిలో గట్టి గుణపాఠం చెప్పి తీరతారు’’అని మోదీ స్పష్టం చేశారు. మహిళా సాధికారతకు పట్టం కట్టేందుకు జరుగుతున్న కృషి విపక్షాల స్వార్థ రాజకీయాల కారణంగా నిలిచిపోయే పరిస్థితి నెలకొందంటూ ఆవేదన వెలిబుచ్చారు. ‘‘లోక్‌సభలో మాకు సంఖ్యా బలం లేకపోయింది. అయినా నిరాశ పడబోం. మహిళలకు చట్టసభల్లో సముచిత ప్రాతినిధ్యం కల్పించేందుకు, రిజర్వేషన్ల చట్టం సత్వర అమలుకు బీజేపీ, ఎన్డీఏ కూటమి చిత్తశుద్ధితో పోరాడుతూనే ఉంటాయి. ఆ మార్గంలో నెలకొన్న ప్రతి అడ్డంకినీ తొలగించి తీరతాం’’అని ప్రకటించారు. ‘‘పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ల బిల్లు ఆమోదానికి అవసరమైన 66 శాతం ఓట్లను మేం సాధించలేకపోవచ్చు. కానీ దేశ మహిళల ఆశీర్వాదాలు మాత్రం 100 శాతం మాతోనే ఉన్నాయి’’అని ప్రధాని పేర్కొన్నారు. 

పునాదులు కదులుతాయని భయం! 
కుటుంబాల చెప్పుచేతుల్లో నడిచే కాంగ్రెస్, డీఎంకే, సమాజ్‌వాదీ వంటి పార్టీలు మహిళల ఎదుగుదలను సహించలేవని మోదీ ఆరోపించారు. ‘‘మహిళలను ఎదగనిస్తే తమ స్వార్థ రాజకీయ పునాదులు పూర్తిగా కదిలిపోతాయని వాటి భయం. అధికారం ఎప్పటికీ తమ కుటుంబానికే పరిమితం కావాలని కోరుకుంటాయి. తమ కుటుంబంలోని మహిళలు తప్ప దేశ మహిళల రాజకీయ ఎదుగుదల సహించలేవు’’అంటూ ఎద్దేవా చేశారు. జనాభాలో సగభాగమైన మహిళలకు చట్టసభల్లో కూడా సముచిత ప్రాధాన్యం దక్కడం తక్షణావసరమని ఆయన పునరుద్ఘాటించారు. మహిళా రిజర్వేషన్ల అంశం 40 ఏళ్లుగా పెండింగ్‌లోనే ఉందని గుర్తు చేశారు. ‘‘అందుకే మహిళల సమున్నత ఆకాంక్షలకు రెక్కలు తొడిగే ఉదాత్త లక్ష్యంతోనే సవరణ బిల్లు తెచ్చాం. ఆ క్రమంలో ఎవరికీ ఎలాంటి అన్యాయమూ జరగకుండా జాగ్రత్త పడ్డాం. ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమర... ఇలా ప్రాంతాలవారీగా సమతుల్యతతో దెబ్బతినకుండా నిజాయతీతో కృషి చేశాం. 

లోక్‌సభలో ప్రతి రాష్ట్రానికీ ప్రస్తుతమున్న ప్రాతినిధ్యం సంఖ్యాపరంగానే గాక నైష్పత్తికంగా కూడా యథాతథంగా కొనసాగేలా చూశాం. ఇదే విషయాన్ని విపక్షాలన్నింటికీ పదేపదే చెప్పాం. అయినా దేశ హితం, మహిళా సాధికారత కంటే స్వార్థానికే అవి పెద్దపీట వేశాయి. బిల్లును ఓడించడం ద్వారా రాజ్యాంగాన్ని కూడా అవమానించాయి. రాజ్యాంగం ముందు, దేశ మహిళా శక్తి ముందు నేరస్తులుగా నిలబడ్డాయి’’అంటూ మండిపడ్డారు. ‘‘లోక్‌సభ స్థానాల పెరుగుదలతో తమిళనాడు, పశ్చమబెంగాల్‌ గొంతుకను పార్లమెంటులో మరింతగా విన్పించే సువర్ణావకాశం అక్కడి అధికార పార్టీలు డీఎంకే, తృణమూల్‌ కాంగ్రెస్‌కు వచ్చింది. దాన్ని అవి కాలదన్నాయి’’అంటూ ప్రధాని ఆవేదన వెలిబుచ్చారు. ‘‘21వ శతాబ్దపు మహిళలు దేశంలో జరుగుతున్న ప్రతి పరిణామాన్నీ నిశితంగా గమనిస్తున్నారు. విపక్షాల అసలు ఉద్దేశాలను వారు అర్థం చేసుకుంటున్నారు’’అంటూ హెచ్చరించారు. 

పరాన్నజీవిలా కాంగ్రెస్‌! 
కాంగ్రెస్‌పై ప్రధాని తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. దేశ ప్రగతికి సంబంధించిన అన్ని అంశాల్లోనూ ఆ పార్టీది ఆది నుంచీ ప్రతికూల భావజాలమేనంటూ దుయ్యబట్టారు. దేశ వెనకబాటుకు, అది ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకూ కాంగ్రెసే ఏకైక కారణమని ఆరోపించారు. ‘‘సంస్కరణలకు కాంగ్రెస్‌ నిత్య వ్యతిరేకి. ఆ పేరు వింటేనే ఉలిక్కిపడుతుంది. జాతి నిర్మాణానికి, మెరుగుదలకు ఉద్దేశించి ప్రతి ప్రయత్నాన్నీ అడ్డుకుంటూ వచ్చిన చరిత్ర కాంగ్రెస్‌ది. దశాబ్దాలుగా ప్రతి సంస్కరణనూ వ్యతిరేకించడమే పనిగా పెట్టుకుంది. జన్‌ధన్‌ యోజన మొదలుకుని ఆధార్, డిజిటల్‌ చెల్లింపులు, జీఎస్టీ దాకా ఇందుకు తార్కాణాలెన్నో. ఆర్థికంగా వెనకబడ్డ వర్గాలకు రిజర్వేషన్లను, ఆర్టికల్‌ 370, త్రిపుల్‌ తలాక్‌ రద్దునూ కాంగ్రెస్‌ గుడ్డిగా వ్యతిరేకించింది’’అంటూ ఆక్షేపించారు. ‘‘దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ నానాటికీ బలహీనపడుతోంది. 

ప్రజాదరణ, సొంత బలం కోల్పోయి ప్రాంతీయ పార్టీలపై ఆధారపడి పరాన్నజీవిలా మనుగడ సాగిస్తోంది. కానీ ఆ పార్టీలు ఎట్టి పరిస్థితుల్లోనూ బలోపేతం కావొద్దని కోరుకుంటోంది’’అంటూ ఎద్దేవా చేశారు. ‘‘మహిళా రిజర్వేషన్ల బిల్లును కూడా 40 ఏళ్లుగా కాంగ్రెస్‌ గుడ్డి వ్యతిరేకిస్తోంది. సవరణ బిల్లుకు మద్దతిచ్చి ఆ తప్పిదాలను సరిచేసుకుంటుందని, కొత్త చరిత్ర లిఖిస్తుందని ఆశించా. కానీ ఆ చరిత్రాత్మక అవకాశాన్ని కాంగ్రెస్‌ పోగొట్టుకుంది. ఆ పార్టీ నమ్ముకున్నది విభజన రాజకీయాలను మాత్రమే. అందుకే ఉత్తరాది, దక్షిణాది విభజన అంటూ డీలిమిటేషన్‌పై అవాస్తవాలను ప్రచారం చేసింది’’అని విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రతికూల భావజాలానికి దేశ మహిళలు తగిన రీతిలో బదులిచ్చి తీరతారని హెచ్చరించారు.   

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Narendra Modi
Constitutional amendment
NDA government
women reservation bill
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఇక ఎన్డీఏ వేదిక 'మంగళ్ మిలన్’!

ఇక ఎన్డీఏ వేదిక 'మంగళ్ మిలన్’!

అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభం.. మోదీ ఐదు సంకల్పాలు ఇవే..

అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభం.. మోదీ ఐదు సంకల్పాలు ఇవే..

అగ్నిప్రమాదంపై ప్రధాని విచారం.. ఎక్స్‌గ్రేషియా ప్రకటన

అగ్నిప్రమాదంపై ప్రధాని విచారం.. ఎక్స్‌గ్రేషియా ప్రకటన

మీరు గొప్పనేత ఎప్పుడౌతారో ఏమో!

మీరు గొప్పనేత ఎప్పుడౌతారో ఏమో!

అజేయంగా మన సముద్ర శక్తి

అజేయంగా మన సముద్ర శక్తి

యోగాతో ప్రపంచ శాంతి 

యోగాతో ప్రపంచ శాంతి 

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.