Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. National
  3. ముంబైలో 17 మంది పిల్లల కిడ్నాప్‌.. రక్షించిన పోలీసులు
ADVERTISEMENT 

ముంబైలో 17 మంది పిల్లల కిడ్నాప్‌.. రక్షించిన పోలీసులు

National Sakshi User Sakshi Sakshi Time Oct 31, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
STUDIO123.jpg

ఆడిషన్స్‌ పేరిట పిలిచి 17 మంది టీనేజర్లను బంధించిన స్టూడియో ఉద్యోగి

పోలీసులు అతి తెలివి చూపిస్తే స్టూడియో తగలబెడతానని బెదిరింపులు 

మొత్తం 19 మందిని రక్షించిన పోలీసులు 

పోలీసుల ఎదురు కాల్పుల్లో కిడ్నాపర్‌ మృతి

ముంబై: దేశ వాణిజ్య రాజధాని ముంబైలో గురువారం కిడ్నాప్‌ కలకలం సృష్టించింది. వెబ్‌సిరీస్‌ రూపొందించేందుకు ఆడిషన్స్‌ పేరిట ఓ వ్యక్తి ఎనిమిది నుంచి 14 ఏళ్ల వయసు పిల్లల్ని ఆర్‌ఏ స్టూడియోకి రప్పించి కిడ్నాప్‌ చేశాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు 17 మంది పిల్లల్ని, ఒక వృద్ధుడిని, మరో వ్యక్తిని రక్షించారు. పోలీసులపై కాల్పులు జరిపిన కిడ్నాపర్‌ రోహిత్‌ ఆర్య (50) ఎదురు కాల్పుల్లో మృతిచెందాడు. ఆ స్టూడియోలో పనిచేసే కిడ్నాపర్‌ మానసిక పరిస్థితి సరిగా లేదని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటన వివరాలను సంయుక్త పోలీస్‌ కమిషనర్‌ సత్యనారాయణన్‌ మీడియాకు వెల్లడించారు. ఆయన తెలిపిన మేరకు..

అసలేం జరిగింది?
ముంబైలో పొవాయ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని మహావీర్‌ క్లాసిక్‌ బిల్డింగ్‌ మొదటి అంతస్తులో ఆర్‌ఏ స్టూడియో ఉంది. ఇందులో పనిచేసే రోహిత్‌ ఆర్య రెండు రోజులుగా ఒక వెబ్‌సిరీస్‌ కోసం ఆడిషన్స్‌ నిర్వహిస్తున్నాడు. గురువారం దాదాపు 100 మంది వచ్చారు. వీరిలో 17 మందిని ఆపేసి ఒక గదిలో బంధించాడు. దీంతో భయపడిన పిల్లలు కేకలు వేయడంతో రహదారిపై వెళుతున్న ప్రజలు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు.. అగ్నిమాపక సిబ్బంది, బాంబు నిర్వీర్య బృందం, క్విక్‌ రెస్పాన్స్‌ బృందాలతో కలిసి స్టూడియోకు వచ్చారు. ఆలోపే ఆర్య ఒకటిన్నర నిమిషం నిడివితో ఒక వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌చేశాడు. 

‘ఆత్మహత్య చేసుకోవడానికి ముందు నా ప్లాన్‌ అమలుచేద్దామనుకున్నా. అందుకే పిల్లల్ని కిడ్నాప్‌ చేశా. నేను కొందరిని ప్రశ్నించి వాళ్ల సమాధానాలు వినాలనుకుంటున్నా. పోలీసులు ఏమైనా తెలివితేటలు ప్రదర్శిస్తే.. తర్వాత ఈ పిల్లలకు ఏదైనా హాని జరిగితే దానికి నేను బాధ్యుడిని కాదు. పోలీసులు అతి తెలివి చూపిస్తే ఈ స్టూడియో మొత్తాన్ని తగలబెడతా..’ అని ఆ వీడియోలో చెప్పాడు. 

ఆర్యను శాంతిపజేసేందుకు ప్రయత్నించినా సాధ్యం కాకపోవడంతో పోలీసులు స్టూడియో లోపలికి వెళ్లేందుకు మార్గం వెతికారు. అగ్నిమాపక సిబ్బంది నిచ్చెన సాయంతో మొదటి అంతస్తు కిటికీ వద్దకు చేరుకున్నారు. తర్వాత ఎనిమిదిమంది కమెండోలు బాత్‌రూమ్‌ ద్వారా స్టూడియో లోపలికి ప్రవేశించారు. పోలీసుల రాకను గమనించిన ఆర్య తన చేతిలో ఉన్న లైటర్‌ చూపిస్తూ పిల్లల వద్ద ఉన్న రసాయన డబ్బాలను తగులబెడతానని బెదిరిస్తూనే ఎయిర్‌గన్‌తో పోలీసులపై కాల్పులు మొదలెట్టాడు. 

⇒ పోలీసులు ఎదురుకాల్పులు జరపటంతో ఆర్యకు బుల్లెట్ల గాయాలయ్యాయి. అతడిని పోలీసులు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మరణించాడని వైద్యులు తెలిపారని జోన్‌–10 పోలీస్‌ డిప్యూటీ కమిషనర్‌ దత్తు నలవాడే చెప్పారు. బందీలందరినీ రక్షించాక స్టూడియోలో పోలీసులు ఒక ఎయిర్‌గన్, పలు రసాయన కంటైనర్లను స్వాధీనం చేసుకున్నారు. రసాయనాలతో అతడు విధ్వంసం సృష్టించాలని కుట్రపన్ని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్‌ను కమెండోలు కేవలం 35 నిమిషాల్లో విజయవంతంగా ముగించారు.

ఎవరీ కిడ్నాపర్‌ ?
నాగ్‌పూర్‌కు చెందిన ఆర్య సొంతంగా యూట్యూబ్‌ చానల్‌ నడుపుతున్నాడు. ప్రస్తుతం ముంబైలోని చెంబూర్‌లో ఉంటూ ఈ స్టూడియోలో పనిచేస్తున్న అతడు 12 ఏళ్ల కిందట ‘లెట్స్‌ చేంజ్‌’ కార్యక్రమం మొదలెట్టాడు. పాఠశాల చిన్నారులను శుభ్రతకు అంబాసిడర్‌లుగా మార్చడం ఈ కార్యక్రమం ఉద్దేశం. నాటి విద్యాశాఖ మంత్రి దీపక్‌ కేసార్కర్‌ హయాంలో ఆర్య ఈ కాంట్రాక్టు సంపాదించాడు. 

ప్రాజెక్టుకు సంబంధించి ప్రభుత్వం నుంచి అతడికి రూ.2 కోట్లు రావాల్సి ఉంది. బకాయిలు చెల్లించాలంటూ గతేడాది జనవరిలో రెండుసార్లు నిరాహారదీక్ష చేశాడు. మంత్రి నివాసం ఎదుట కూడా ధర్నా చేశాడు. దీంతో అతడికి మంత్రి రూ.7 లక్షలు, రూ.8 లక్షల చెక్కులు ఇచ్చారు. ఆ చెక్కులు చెల్లలేదు. మోసపోయానని గ్రహించిన ఆర్య ఆగ్రహంతో ఈ దుస్సాహసం చేసుంటాడని భావిస్తున్నారు.  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
mumbai police
children
hostage
Kidnap
Police
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఈ పోలీసుల సేవ చూస్తే.. ఒక్క సెల్యూట్‌తో సరిపోదు!

ఈ పోలీసుల సేవ చూస్తే.. ఒక్క సెల్యూట్‌తో సరిపోదు!

ప్రియుడి మోజులో పడి కన్నకొడుకునే చంపేసిన తల్లి!

ప్రియుడి మోజులో పడి కన్నకొడుకునే చంపేసిన తల్లి!

 హైదరాబాద్‌లో భారీ వర్షం.. పోలీసుల కీలక సూచన

హైదరాబాద్‌లో భారీ వర్షం.. పోలీసుల కీలక సూచన

మంచిని పెంచే ‘సరిగమల ఖాకీ’

మంచిని పెంచే ‘సరిగమల ఖాకీ’

క్రాంతికుమార్‌ది ప్రభుత్వ హత్యే

క్రాంతికుమార్‌ది ప్రభుత్వ హత్యే

‘మా నాన్నెవరో తెలుసా?’

‘మా నాన్నెవరో తెలుసా?’

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.