Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. National
  3. విజయ్ ‘మైనారిటీ’ వ్యూహం.. స్టాలిన్ సర్కార్‌ వణుకు
ADVERTISEMENT 

విజయ్ ‘మైనారిటీ’ వ్యూహం.. స్టాలిన్ సర్కార్‌ వణుకు

National Sakshi User Sakshi Sakshi Time Dec 22, 2025 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
vijay.jpg

తమిళనాడు రాజకీయాల్లో ఆ పార్టీ పేరు మార్మోగుతోంది.. అదే ‘తమిళగ వెట్రి కజగం’ (టీవీకే). దశాబ్దాలుగా డీఎంకే (డీఎంకే)కి కంచుకోటగా ఉన్న మైనారిటీ ఓటు బ్యాంకును లక్ష్యంగా చేసుకుని టీవీకే అధినేత, నటుడు విజయ్ వేస్తున్న అడుగులు ఇప్పుడు అధికార పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. 2026 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా విజయ్ రచిస్తున్న ‘మైనారిటీ’ వ్యూహం, స్టాలిన్ సర్కార్‌ను కలవరపెడుతోంది. తమిళనాడులో మైనారిటీ ఓట్లు ఎప్పుడూ నిర్ణయాత్మక శక్తిగా ఉంటూ వస్తున్నాయి. ముఖ్యంగా ముస్లిం, క్రైస్తవ ఓటర్లు డీఎంకే వెన్నంటే ఉంటూ, ఆ పార్టీ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే ఇప్పుడు విజయ్ రూపంలో ఒక బలమైన ప్రత్యామ్నాయం రావడంతో ఈ ఓటు బ్యాంకులో చీలిక వస్తుందనే ఆందోళన డీఎంకే క్యాంపులో మొదలైంది.

మారిన సమీకరణలు
తమిళ సినీ రంగంలో అగ్రనటునిగా వెలుగొందుతున్న విజయ్, ఇప్పుడు రాజకీయాల్లోనూ తన సత్తా చాటాలని  ఉవ్విళ్లూరుతున్నారు. క్రైస్తవ మత నేపథ్యం ఉండటం విజయ్‌కు ఒక అదనపు బలంగా మారుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సాంప్రదాయకంగా డీఎంకే వెన్నంటి ఉండే క్రైస్తవ, ముస్లిం ఓటర్లలో ఒక వర్గం విజయ్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉండటంతో, అధికార పార్టీలో కలవరం మొదలైంది. యువతలో ఉన్న క్రేజ్‌కు తోడు మైనారిటీల మద్దతు కూడా తోడైతే విజయ్ బలమైన శక్తిగా ఎదుగుతారని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

చెన్నై నుంచి తిరునల్వేలికి..
డీఎంకే పార్టీ తన వార్షిక క్రిస్మస్ వేడుకలను సాధారణంగా రాజధాని చెన్నైలో వైభవంగా నిర్వహిస్తుంటుంది. అయితే ఈసారి అనూహ్యంగా ఆ వేదికను దక్షిణ తమిళనాడులోని తిరునల్వేలికి మార్చింది. ఈ మార్పు వెనుక బలమైన రాజకీయ కారణం ఉంది. దక్షిణ జిల్లాల్లో క్రైస్తవ జనాభా ప్రభావం చాలా ఎక్కువ. విజయ్ ప్రభావం ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఉండే అవకాశం ఉందని భావిస్తున్న డీఎంకే, ముందస్తుగా మైనారిటీలను ఆకట్టుకునేందుకు నెల్లైను వేదికగా ఎంచుకుని తన బలాన్ని ప్రదర్శించింది.

నేతలతో స్టాలిన్ ఆత్మీయ భేటీ
తిరునల్వేలిలో జరిగిన 'క్రిస్తువ నల్లెన్న ఇయక్కం' సమ్మేళనం కేవలం పండుగ వేడుకలా కాకుండా ఒక రాజకీయ సభలా సాగింది. ఈ కార్యక్రమంలో వివిధ చర్చిల ఆర్చ్ బిషప్‌లు, సీనియర్ సువార్తికులు పాల్గొని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు తమ మద్దతు ప్రకటించారు. రాష్ట్రంలో మైనారిటీల సంక్షేమం కోసం డీఎంకే ప్రభుత్వం చేస్తున్న కృషిని వారు కొనియాడారు. చర్చి పెద్దల సమక్షంలో స్టాలిన్ ప్రార్థనలు చేయడం ద్వారా మైనారిటీ సమాజంతో తనకున్న అనుబంధాన్ని మరోమారు గుర్తుచేశారు.

ముఖ్యమంత్రి వరాల జల్లు
సభలో ముఖ్యమంత్రి స్టాలిన్ క్రైస్తవ వర్గాల దీర్ఘకాలిక డిమాండ్లపై సానుకూల నిర్ణయాలు ప్రకటించారు. ముఖ్యంగా ప్రభుత్వ సహాయక విద్యాసంస్థల నియామక ప్రక్రియలో విశ్వవిద్యాలయ నామినీ పాత్రను తొలగించడం ద్వారా ఆయా సంస్థలకు స్వయంప్రతిపత్తి కల్పించారు. పురాతన చర్చిల పునరుద్ధరణకు గ్రాంట్లు పెంపు, తీర్థయాత్రలకు సబ్సిడీలు, స్మశానవాటికలకు భూమి కేటాయింపు వంటి వరాలను ప్రకటించడం ద్వారా మైనారిటీ ఓటర్ల నమ్మకాన్ని చూరగొనే ప్రయత్నం చేశారు.

లోలోపల అసంతృప్తి సెగలు
పైన పటారం లోన లోటారం అన్నట్లుగా, డీఎంకే ప్రభుత్వపై మైనారిటీ వర్గాల్లో కొంత అసంతృప్తి కూడా గూడుకట్టుకుని ఉంది. ఎయిడెడ్ విద్యాసంస్థల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడంలో ప్రభుత్వం జాప్యం చేస్తోందని చర్చి యాజమాన్యాలు ఆరోపిస్తున్నాయి. అలాగే విద్యా వ్యవస్థలో పెరుగుతున్న రాజకీయ జోక్యం పట్ల కూడా విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విజయ్ తన రాజకీయ ప్రసంగాల్లో ఇలాంటి సున్నితమైన అంశాలను ప్రస్తావిస్తే, డీఎంకేకు గట్టి దెబ్బ తగిలే అవకాశం ఉంది.

బీజేపీపై విమర్శలు
మరోవైపు బీజేపీని లక్ష్యంగా చేసుకుని స్టాలిన్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. దేశంలో మైనారిటీలకు రక్షణ లేదని, రాజ్యాంగంలోని లౌకికవాద స్ఫూర్తిని బీజేపీ దెబ్బతీస్తోందని ఆయన విమర్శించారు. ఒకే మతం, ఒకే భాష పేరుతో వైవిధ్యాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీకి పరోక్షంగా మద్దతు ఇస్తున్న ఏఐఏడీఎంకేను కూడా మైనారిటీ వ్యతిరేక పార్టీగా చిత్రించే ప్రయత్నం చేశారు. మైనారిటీల రక్షణ కేవలం డీఎంకేతోనే సాధ్యమనే భరోసా ఇచ్చారు.

ప్రతిపక్షాల ఎదురుదాడి
స్టాలిన్ విమర్శలపై బీజేపీ సీనియర్ నాయకురాలు తమిళిసై సౌందరరాజన్ తీవ్రంగా స్పందించారు. కేవలం ఓట్ల రాజకీయాల కోసం ముఖ్యమంత్రి సమాజంలో విభజన తెస్తున్నారని, మతాల మధ్య విషం చిమ్ముతున్నారని ఆమె ధ్వజమెత్తారు. డీఎంకే వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే బీజేపీపై ఆరోపణలు చేస్తున్నారని ఆమె విమర్శించారు.  ఇదంతా చూస్తుంటే.. మైనారిటీ ఓట్ల కోసం జరుగుతున్న ఈ రాజకీయ యుద్ధం మరింత ముదిరేలా కనిపిస్తోంది.

విజయ్ క్రిస్మస్ ప్లాన్
ఈ రాజకీయ పోరులో విజయ్ అడుగులు చాలా ఆసక్తికరంగా మారాయి. త్వరలో విజయ్‌ కూడా  క్రిస్మస్ వేడుకలను నిర్వహించబోతున్నారని సమాచారం. ఒక నటుడిగా కాకుండా ఒక రాజకీయ నేతగా ఆయన ఇచ్చే సందేశం మైనారిటీలను ఎంతవరకు ప్రభావితం చేస్తుందనేది కీలకంగా మారింది. ఒకవేళ విజయ్ మైనారిటీ ఓట్లను చీల్చగలిగితే, అది 2026లో డీఎంకే విజయ అవకాశాలపై ప్రభావం చూపుతుంది. మొత్తానికి తమిళనాడులో ఇప్పుడు ‘మైనారిటీ ఓటు’ గెలుపు గుర్రాన్ని నిర్ణయించే కీలక అస్త్రంగా మారింది.

ఇది కూడా చదవండి: రష్యా సైన్యంలో భారత విద్యార్థి బందీ.. డ్రగ్స్ కేసుతో బ్లాక్‌మెయిల్

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Tamil Nadu
Vijay
TVK Vijay
Christmas
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

సీఎం విజయ్‌ని అన్ ఫాలో చేసిన త్రిష

సీఎం విజయ్‌ని అన్ ఫాలో చేసిన త్రిష

సీఎంగా తొలిప్రసంగం.. అదరగొట్టిన విజయ్‌

సీఎంగా తొలిప్రసంగం.. అదరగొట్టిన విజయ్‌

విజయ్ బర్త్ డే స్పెషల్.. తెరపై 'దళపతి' ఇప్పుడేమో 'ముఖ్యమంత్రి' (ఫొటోలు)

విజయ్ బర్త్ డే స్పెషల్.. తెరపై 'దళపతి' ఇప్పుడేమో 'ముఖ్యమంత్రి' (ఫొటోలు)

అతడు అరవడు.. హంగామా చేయడు.. సునామీలా ప్రభావం చూపిస్తాడు!

అతడు అరవడు.. హంగామా చేయడు.. సునామీలా ప్రభావం చూపిస్తాడు!

అమ్మోనియం గ్యాస్‌ లీక్‌.. ఏడుగురు మహిళలు మృతి

అమ్మోనియం గ్యాస్‌ లీక్‌.. ఏడుగురు మహిళలు మృతి

సీఎం విజయ్ పుట్టినరోజు.. ప్రభుత్వం బంపర్‌ ఆఫర్‌

సీఎం విజయ్ పుట్టినరోజు.. ప్రభుత్వం బంపర్‌ ఆఫర్‌

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.