Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. National
  3. వానాకాలం కదా.. మరి స్పెషల్‌ అలవెన్స్‌ ఉందా?
ADVERTISEMENT 

వానాకాలం కదా.. మరి స్పెషల్‌ అలవెన్స్‌ ఉందా?

National Sakshi User Sakshi Sakshi Time Aug 13, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
hr.jpg

ఉద్యోగి అంటే ఒక సంస్థలో గంటలకొద్దీ పని చేసే రోబో కాదు. మనస్ఫూర్తిగా తన బుర్రకు పని చెప్పి ఆ సంస్థకు తన సేవలు అందించడం. అందుకే కంపెనీల్లో చాలావరకు జీతం ఇచ్చి చేతులు దులుపుకోవడం లేదు. ఉద్యోగిని సంతృప్తి పరిచేందుకు కూపన్లని, బోనస్‌లని, అలవెన్సులని ఎక్సెట్రా.. ఎక్సెట్రా అందిస్తుంటాయి.

సాధారణంగా ఇంటర్వ్యూలలో జీతం ఎక్కువ ఇవ్వమనో లేకుంటే వాళ్ల వాళ్ల అవసరాలను హెచ్‌ఆర్‌లకు తెలియజేస్తుంటారు. అయితే.. ఓ ఉద్యోగాభ్యర్థి ‘లెక్క’ మాత్రం నెట్టింట తీవ్ర చర్చనీయాంశమైంది. కంపెనీలు కొత్త పాలసీ తీసుకురావాలన్న చర్చ డిమాండ్‌కు దారి తీసింది. 

ఢిల్లీ కంపెనీ హెచ్‌ఆర్‌ ఒకరు.. తాజాగా ఓ వ్యక్తిని ఇంటర్వ్యూ చేశారు. అయితే తనకు ఇవ్వబోయే ప్యాకేజీకి వానకాలంలో కాస్త అదనంగా జీతం చేర్చాలని ఆ హెచ్‌ఆర్‌ను కోరాడతను. అందుకు కారణం ఏంటి? అని హెచ్‌ఆర్‌ అడగ్గా.. వానాకాలంలో తన ఆఫీస్‌ ప్రయాణాలకు అయ్యే ఖర్చును కంపెనీనే భరించాలన్నాడు. ‘‘సాధారణ రోజుల్లో నాకు అయ్యే ఖర్చు కంటే వానాకాలంలో కాస్త ఎక్కువే. కాబట్టి కంపెనీ రెయిన్‌ అలవెన్స్‌ చెల్లించాలి’’ అని కోరాడతను. అయితే మునుపెన్నడూ వినని ఆ ప్రస్తావనతో హెచ్‌ఆర్‌ కాస్త అయోమయానికి గురైనా వెంటనే తేరుకుని.. అలాంటి పాలసీ తమ కంపెనీలో లేదని బదులిచ్చారు.

.. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్‌, బెంగళూరులాంటి మహానగరాల్లో వర్షాలు పడేటప్పుడు ట్రాఫిక్‌ చిక్కులు షరామామూలేనని, అలాంటి సమయంలో క్యాబ్‌ తరహా సేవల ఖర్చు తడిసి మోపెడు అవుతుందని.. అలాంటప్పుడు రెయిన్‌ అలవెన్స్‌ కోరడం ఎంతవరకు సబబని ఆ హెచ్‌ఆర్‌ ఆ ఉద్యోగ అభ్యర్థిని ప్రశ్నించారు. దీంతో ఆ వ్యక్తి సాధారణ రోజుల్లో తనకు అయ్యే ఖర్చును.. వానాకాలంలో ఆఫీస్‌ ప్రయాణాలకు అయ్యే ఖర్చను లెక్కేసి మరీ హెచ్‌ఆర్‌కు వివరించారు. అదే సమయంలో.. అలాంటి చెల్లింపులు(రెయిన్‌ అలవెన్స్‌) వీలులేని పక్షంలో వర్క్‌ఫ్రమ్‌ హోం వెసులుబాటు కల్పించాలని, అదీ కుదరకుంటే ఆలస్యంగా వచ్చేందుకైనా అనుమతించాలని కోరాడతను. 

ఆ వ్యక్తి సెలక్ట్‌ అయ్యాడో లేదో తెలియదుగానీ.. ఈ ఇంటర్వ్యూ వివరాలను ఆ హెచ్‌ఆర్‌ రెడ్డిట్‌లో పంచుకున్నారు. దీంతో ఆ ఉద్యోగ అభ్యర్థికి మద్దతుగా చాలామంది పోస్టులు పెడుతున్నారు. అంతెందుకు ఆ హెచ్‌ఆర్‌ కూడా ఆ వ్యక్తి కోరింది సబబుగానే ఉందంటే ఆ పోస్టులో ప్రస్తావించడం గమనార్హం. 

‘‘ఇంటర్వ్యూలో విచిత్రంగా అనిపించిన అతని కోరిక.. ఇప్పుడు సబబుగానే అనిపిస్తోంది’’ అంటూ పోస్ట్‌ చేశారా హెచ్‌ఆర్‌. అంతేకాదు.. తాను కూడా ఆఫీస్‌కు క్యాబ్‌లలోనే వెళ్తానని, వానకాలంలో అతను చెప్పినట్లు పోల్చుకుంటే అధిక ఖర్చులే ఉంటున్నాయని.. అతను కోరింది విచిత్రమైనదేం కాదని ఆ పోస్టులో ఆ హెచ్‌ఆర్‌ పేర్కొన్నారు. వానాకాలం కావడం, ప్రయాణాల్లో ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ పోస్ట్‌ ఇప్పుడు తెగ వైరల్‌ అవుతోంది.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Interview
Rain season
allowance
Social Media
viral
reddit
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

‘భాయ్‌కి ఏమైంది?..’ సల్మాన్‌ ఖాన్‌ ఆసక్తికర ట్వీట్‌

‘భాయ్‌కి ఏమైంది?..’ సల్మాన్‌ ఖాన్‌ ఆసక్తికర ట్వీట్‌

శివాలయంలో అపచారం... దేవుడి దీపంతో

శివాలయంలో అపచారం... దేవుడి దీపంతో

ట్రాఫిక్‌లో ఆగిన గుండె.. కదిలొచ్చిన దేవతలు

ట్రాఫిక్‌లో ఆగిన గుండె.. కదిలొచ్చిన దేవతలు

షాక్‌ అనాలా?.. అద్భుతం అనాలా??.. 'ఇది నా పేపర్‌ కాదు' అనుకుంది!

షాక్‌ అనాలా?.. అద్భుతం అనాలా??.. 'ఇది నా పేపర్‌ కాదు' అనుకుంది!

37 ఏళ్ల ఎదురుచూపు.. విధి ఆడిన వింత నాటకం!

37 ఏళ్ల ఎదురుచూపు.. విధి ఆడిన వింత నాటకం!

అమ్మా.. నా మనసు విరిగిపోయింది!

అమ్మా.. నా మనసు విరిగిపోయింది!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.