Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. National
  3. మద్రాస్‌ హైకోర్టులో విజయ్‌కు షాక్‌
ADVERTISEMENT 

మద్రాస్‌ హైకోర్టులో విజయ్‌కు షాక్‌

National Sakshi User Sakshi Sakshi Time Feb 6, 2026 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Madras-High-Court.jpg

అగ్రనటుడు, తమిళగ వెట్రి కగళం పార్టీ అధినేత విజయ్‌కు మద్రాస్‌ హైకోర్టులో చుక్కెదురైంది. ఆదాయ పన్నుల శాఖ తనకు గతంలో విధించిన భారీ పెనాల్టీని కొట్టేయాలంటూ ఆయన కోర్టులో రిట్‌ పిటిషన్‌ వేశారు. దీనిని విచారించిన కోర్టు.. ఆ జరిమానా సబబేనని.. ఇందులో న్యాయస్థానాలు ఎలాంటి జోక్యం చేసుకోబోవని చెబుతూ విజయ్‌ పిటిషన్‌ను కోర్టు శుక్రవారం కొట్టేసింది.

గతంలో ఓ సినిమాకు సంబంధించిన రెమ్యునరేషన్‌ను దాచి.. పన్నులు ఎగవేశారని ఆయనపై అభియోగాలు ఉన్నాయి. ఈ నేపథ్యంతో 2019లో ఐటీ శాఖ ఆయనకు రూ.కోటిన్నర జరిమానా విధించింది. అయితే.. ఆ ఆదేశాలను సవాల్‌ చేస్తూ విజయ్‌ మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించారు.

జరిమానా విధించే ప్రక్రియలో అనవసరమైన జాప్యం జరిగిందని.. ఆ కారణంగానే  చట్టపరంగా అనుమతించిన గడువుకు మించి జరిమానా విధించారని విజయ్‌ తరఫు లాయర్‌ వాదించారు. అంతేకాదు.. ఈ ఆలస్యాన్ని పరిగణనలోకి తీసుకుని జరిమానాను రద్దు చేయాలని కోరారు. అయితే.. అసెస్‌మెంట్‌పై జరిగిన అప్పీల్‌ ప్రక్రియల వల్లే ఆలస్యమైందని ఐటీ శాఖ వాదించింది. జరిమానా విధించడం పూర్తిగా ఆదాయపు పన్ను చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా జరిగిందని..  తమ చర్యలో ఎటువంటి చట్టపరమైన లోపం లేదని స్పష్టం చేసింది.

ఇరువైపులా వాదనలు విన్న కోర్టు.. జనవరి 23న వాదనలు పూర్తి కావడంతో తీర్పును రిజర్వ్‌ చేసింది. ఇవాళ విజయ్‌ వేసిన ఆ పిటిషన్‌పై తీర్పు ఇచ్చింది.

ఆదాయపు పన్ను శాఖ విధించిన జరిమానా చట్టబద్ధమని, దానిపై న్యాయస్థానం జోక్యం చేసుకునే అవకాశం లేదని స్పష్టం చేసింది. అయితే, నటుడు విజయ్ ఈ విషయంలో ఇన్‌కమ్‌ ట్యాక్స్ అప్పీలేట్ ట్రిబ్యునల్ (ITAT) ను ఆశ్రయించవచ్చని కోర్టు సూచించింది.

తీర్పుపై టీవీకేగానీ, విజయ్‌గానీ ఇంకా అధికారికంగా స్పందించలేదు. అయితే విజయ్‌ తమిళనాడు ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో ఈ తీర్పు రాజకీయ విమర్శలు తావిచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఈ అంశంపై డీఎంకే గతంలో పలుమార్లు విమర్శలు గుప్పించింది. బ్లాక్‌మనీ తీసుకుని పన్నులు ఎగ్గొట్టే విజయ్‌కు.. అవినీతి అంటూ మాట్లాడే నైతికత లేదంటూ మండిపడింది. అయితే టీవీకే మాత్రం దీనికి కౌంటర్‌ ఇచ్చింది. ఆయన స్వచ్ఛందంగా ఆదాయ వివరాలను వెల్లడించి పన్ను చెల్లించారని అంటోంది.

విజయ్‌ 2015లో పులి అనే చిత్రంలో నటించారు. ఆ చిత్రానికిగానూ ఆయన రూ.15 కోట్ల పారితోషకం అందుకున్నారని.. అయితే అందులో దాదాపు రూ.5 కోట్లు నగదు రూపంలో చెల్లింపు జరిగిందని.. అయితే విజయ్‌ మొదటిసారి సమర్పించిన రిటర్న్స్‌లో విజయ్‌ ఆ ఆదాయానికి సంబంధించిన విషయం ప్రస్తావించలేదని ఐటీ శాఖ ఆరోపించింది. ఈ క్రమంలో.. 2019లో ఆదాయాన్ని దాచి పెట్టి పన్ను ఎగవేసిన అభియోగం కింద కోటిన్నర రూపాయల జరిమానా విధించింది. 

ఇదీ చదవండి: షాకింగ్‌.. ఆ పార్టీ నెత్తిన పాలు పోసే పనిలో విజయ్‌!!

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Vijay
Madras High Court
TVK Vijay
penalty
Income Tax (IT)
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

వివాదాల నేపథ్యంలో.. విజయ్‌ సంచలన నిర్ణయం

వివాదాల నేపథ్యంలో.. విజయ్‌ సంచలన నిర్ణయం

సీఎం విజయ్‌ని అన్ ఫాలో చేసిన త్రిష

సీఎం విజయ్‌ని అన్ ఫాలో చేసిన త్రిష

సీఎంగా తొలిప్రసంగం.. అదరగొట్టిన విజయ్‌

సీఎంగా తొలిప్రసంగం.. అదరగొట్టిన విజయ్‌

విజయ్ బర్త్ డే స్పెషల్.. తెరపై 'దళపతి' ఇప్పుడేమో 'ముఖ్యమంత్రి' (ఫొటోలు)

విజయ్ బర్త్ డే స్పెషల్.. తెరపై 'దళపతి' ఇప్పుడేమో 'ముఖ్యమంత్రి' (ఫొటోలు)

Income Tax: నోటీసుకి బదులివ్వండి..

Income Tax: నోటీసుకి బదులివ్వండి..

అతడు అరవడు.. హంగామా చేయడు.. సునామీలా ప్రభావం చూపిస్తాడు!

అతడు అరవడు.. హంగామా చేయడు.. సునామీలా ప్రభావం చూపిస్తాడు!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.