Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. National
  3. Land for jobs scam: రూ.600 కోట్ల కుంభకోణం!
ADVERTISEMENT

Land for jobs scam: రూ.600 కోట్ల కుంభకోణం!

National Sakshi User Sakshi Sakshi Time Mar 12, 2023 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
541.jpg

న్యూఢిల్లీ: ఆర్‌జేడీ చీఫ్, బిహార్‌ మాజీ సీఎం లాలూ ప్రసాద్‌ కుటుంబసభ్యుల నివాసాల్లో శుక్రవారం జరిపిన సోదాల్లో దొరికిన నగలు, నగదు, వెల్లడైన పత్రాలను బట్టి నేర విస్తృతి రూ.600 కోట్లకు పైగానే ఉంటుందని ఈడీ తెలిపింది. లాలూ కుటుంబసభ్యుల ఇళ్లలో లెక్కల్లో చూపని రూ.కోటి నగదు, రూ.1.25 కోట్ల విలువైన విదేశీ కరెన్సీ, బంగారం, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని పేర్కొంది.

వీటితోపాటు, లాలూ కుటుంబసభ్యుల పేరిట ఉన్న సేల్‌ డీడ్స్, ఆస్తి పత్రాలు దితరాలను స్వాధీనం చేసుకున్నామని, వీటిని బట్టి నేర విస్తృతి రూ.600 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నట్లు శనివారం వెల్లడించింది. వీటిల్లో రూ.350 కోట్లు స్థిరాస్తులు కాగా, రూ.250 కోట్ల మేర బినామీదార్ల పేరిట లావాదేవీలు ఉన్నాయంది. తేజస్వీ యాదవ్‌ ఆస్తుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించిన ఈడీ.. ఢిల్లీలోని న్యూఫ్రెండ్స్‌ కాలనీలోని ఏబీ ఎక్స్‌పోర్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో ఉన్న డి–1088 నాలుగంతస్తుల భవనం తేజస్వీదేనని తెలిపింది. ఈ కేసులో ఈ కంపెనీని ‘లబ్ధిపొందిన సంస్థ’గా గుర్తించినట్లు వెల్లడించింది.

మార్కెట్‌ విలువ ప్రకారం రూ.150 కోట్లకుపైగా విలువైన ఈ భవనాన్ని తేజస్వీ, ఆయన కుటుంబం కేవలం రూ.4 లక్షలకే పొందినట్లు ఈడీ ఆరోపించింది. ఇలాంటివే మరో నాలుగు ఆస్తులను గుర్తించామని తెలిపింది. రైల్వే జాబ్స్‌ ఫర్‌ లాండ్‌ కుంభకోణంపై తమ దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొంది. ఈ కేసులో మనీలాండరింగ్‌ ఆరోపణల్లో భాగంగా లాలూ కుటుంబీకులు, వారి సంబంధీకులు రియల్‌ ఎస్టేట్‌ వంటి వివిధ రంగాల్లో వేర్వేరు ప్రాంతాల్లో పెట్టిన మరిన్ని పెట్టుబడులను కూడా వెలికితీస్తామని తెలిపింది. లాలూ ముగ్గురు కుమార్తెలు, కుమారుడు బిహార్‌ డిప్యూటీ సీఎం తేజస్వీయాదవ్‌కు చెందిన వేర్వేరు ప్రాంతాల్లో శుక్రవారం ఈడీ అధికారులు సోదాలు జరిపిన విషయం తెలిసిందే.



సీబీఐ విచారణకు తేజస్వీ గైర్హాజరు

ఇదే కేసులో తేజస్వీ యాదవ్‌ శనివారం సీబీఐ విచారణకు హాజరుకాలేదు. వ్యక్తిగత కారణాలు చూపుతూ విచారణకు మరో తేదీని నిర్ణయించాలని ఆయన కోరినట్లు అధికారులు తెలిపారు. సీబీఐ సమన్ల ప్రకారం ఈ నెల 4వ తేదీన జరగాల్సిన విచారణకూ తేజస్వీ డుమ్మా కొట్టారు. తేజస్వీ కోరిన విధంగా విచారణకు మరో తేదీని నిర్ణయించే అవకాశముందని అధికారులు తెలిపారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ ఆర్జేడీ చీఫ్, మాజీ సీఎం లాలూ యాదవ్, ఆయన భార్య మాజీ సీఎం రబ్రీదేవిని సీబీఐ ప్రశ్నించిన విషయం తెలిసిందే.

లాలూ రైల్వే శాఖ మంత్రిగా ఉండగా కొందరు అభ్యర్థులకు ఉద్యోగాలిచ్చినందుకు ప్రతిఫలంగా ఉచితంగా లేక తక్కువ ధరకు భూములను పొందినట్లు సీబీఐ ఆరోపణలు చేస్తోంది. లాలూ కుటుంబం ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తోంది. జేడీయూ అగ్రనేత, బిహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ కూడా తేజస్వీ వాదనను సమర్థించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసం చేస్తున్న ప్రయత్నమే సీబీఐ విచారణ అంటూ విమర్శించారు. అయితే, 2017లో నితీశ్‌..లాలూపై దర్యాప్తు సంస్థలు చేసిన అవినీతి ఆరోపణలను సమర్థిస్తూ మాట్లాడటం విశేషం.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
RJD chief Lalu prasad Yadav
Enforcement Directorate (ED)
Foreign currency
Gold
gold jewellery
big scam
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

నదిలో లక్షల కోట్ల నిధి.. చేతికందేలా ఉన్నా తీసుకోలేని పరిస్థితి!

నదిలో లక్షల కోట్ల నిధి.. చేతికందేలా ఉన్నా తీసుకోలేని పరిస్థితి!

‘బంగారం, వెండి.. పడిపోతున్నాయ్‌’

‘బంగారం, వెండి.. పడిపోతున్నాయ్‌’

త్వరలో 50 వేలకే తులం బంగారం?

త్వరలో 50 వేలకే తులం బంగారం?

బంగారం ధరల్లో ఊహకందని మార్పు!

బంగారం ధరల్లో ఊహకందని మార్పు!

ఆస్తులు విడుదల చేయాల్సిందే ఈడీ జప్తు సరికాదు

ఆస్తులు విడుదల చేయాల్సిందే ఈడీ జప్తు సరికాదు

పసిడి ప్రియులకు శుభవార్త.. భారీగా పతనమైన బంగారం ధర

పసిడి ప్రియులకు శుభవార్త.. భారీగా పతనమైన బంగారం ధర

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.