Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. National
  3. Kisan Diwas 2024: ఈ పథకాల వినియోగంతో రైతే రాజు
ADVERTISEMENT 

Kisan Diwas 2024: ఈ పథకాల వినియోగంతో రైతే రాజు

National Sakshi User Sakshi Sakshi Time Dec 23, 2024 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
kisan-main.jpg

భారతదేశంలో ప్రతి ఏటా డిసెంబర్ 23న జాతీయ రైతు దినోత్సవం(కిసాన్‌ దివస్‌)గా జరుపుకుంటారు. దేశ  ఐదవ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ జన్మదినాన్ని పురస్కరించుకుని రైతు దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా రైతులకు ఉపకరించేలా ప్రభుత్వం అందిస్తున్న కేంద్రప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1.  ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం- కిసాన్‌) 
రైతుల ఆర్థిక అవసరాలను తీర్చడానికి ఈ పథకాన్ని 2019లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం కింద ఏడాదికి రూ ఆరు వేలు ఆర్థిక సహాయంగా దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు అందిస్తారు. ఈ మొత్తం ఆయా రైతుల బ్యాంకు ఖాతాలకు నేరుగా జమ అవుతుంది.

2. ప్రధాన్ మంత్రి కిసాన్ మన్‌ధన్‌ యోజన (పీఎం-కేఎంవై) 
ఈ పథకం లక్ష్యం  రైతు కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడం. 18 నుండి 40 సంవత్సరాల వయస్సు గల రైతులు ప్రతీనెలా రూ. 55 నుంచి రూ. 200 వరకూ ఈ పథకంలో చెల్లిస్తే, వారికి 60  ఏళ్లు వచ్చాక ప్రతీనెలా రూ. 3,000 పెన్షన్ రూపంలో పొందవచ్చు.

3. ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై) 
ఈ పథకం కింద, రైతులు నారు వేయడం లేదా విత్తనం నాటడం నుండి పంట కోసే వరకు పంటల రక్షణ కోసం బీమాను అందిస్తారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే ఆర్థిక నష్టాలను భర్తీ చేయడానికి ఇది రైతులకు సహాయపడుతుంది.

4. జాతీయ తేనెటీగల పెంపకం, తేనె మిషన్ (ఎన్‌బీహెచ్‌ఎం) 
తేనెటీగల పెంపకానికున్న ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని, శాస్త్రీయంగా తేనెటీగల పెంపకానికి ప్రోత్సాహం అందించడమే ఈ పథకం లక్ష్యం. ‘తీపి విప్లవం’ లక్ష్యాన్ని సాధించే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రారంభించారు. తేనెటీగల పెంపకందారులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.

5. నమో డ్రోన్ దీదీ
ప్రభుత్వం ఇటీవలే నమో డ్రోన్ దీదీ పథకాన్ని ప్రారంభించింది. దీని కింద మహిళా స్వయం సహాయక బృందాలకు (ఎస్‌హెచ్‌జీ) డ్రోన్‌లను అందజేస్తున్నారు. గ్రామాల్లో నివసించే మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే ఈ పథకం లక్ష్యం.

6. కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ (కేసీసీ)
ప్రభుత్వం ఈ పథకం కింద రైతులకు వారి వ్యవసాయ అవసరాల కోసం తక్కువ వడ్డీ రేట్లకు రుణాలను అందిస్తుంది. అలాగే రెండు శాతం వడ్డీ రాయితీని అందిస్తుంది.

ఇది కూడా చదవండి: తీర్థయాత్రా స్థలంగా సంభాల్‌.. యూపీ సర్కార్‌ ప్లాన్‌
 

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
kisan
Diwas
government scheme
benifits
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బ్రెయిన్‌కు బూస్ట్‌.. ఇక ఆందోళనకు చెక్‌!

బ్రెయిన్‌కు బూస్ట్‌.. ఇక ఆందోళనకు చెక్‌!

భారీ సబ్సిడీ స్కీమ్‌.. గాడిదలు పెంచితే రూ.50 లక్షలు!

భారీ సబ్సిడీ స్కీమ్‌.. గాడిదలు పెంచితే రూ.50 లక్షలు!

AI Summit 2026: ప్రపంచానికి దిక్సూచిగా భారత్‌

AI Summit 2026: ప్రపంచానికి దిక్సూచిగా భారత్‌

ట్రంప్‌తో ఒప్పందం.. వైట్‌ హౌస్‌ కీలక ప్రకటన

ట్రంప్‌తో ఒప్పందం.. వైట్‌ హౌస్‌ కీలక ప్రకటన

ఆనియన్‌ క్వీన్‌

ఆనియన్‌ క్వీన్‌

పత్తి అమ్మాలా..? స్లాట్‌ బుకింగ్‌ తప్పనిసరి!

పత్తి అమ్మాలా..? స్లాట్‌ బుకింగ్‌ తప్పనిసరి!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.