Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. National
  3. కర్ణాటక తీర్పు
ADVERTISEMENT 

కర్ణాటక తీర్పు

National Sakshi User Sakshi Sakshi Time May 13, 2023 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
karnataka-results.jpg

సాక్షి, బెంగళూరు: ఉత్కంఠకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది. మొత్తం 2,615 మంది అభ్యర్థుల తలరాత ఏమిటో తేలిపోనుంది. రాజకీయ పార్టీలు ఎప్పుడెప్పుడా అని ఎ దురు చూస్తున్న కర్ణాటక శాసనసభ ఎన్నికల ఫలితాలు శనివారం వెలువడనున్నా యి. ఓట్ల లెక్కింపునకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఉదయం 8 గంటలకు ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల(ఈవీఎం) తెరపై ఎన్నికల ఫలితం కనిపించడం ప్రారంభం కానుంది.

కౌంటింగ్‌ కోసం రాష్ట్రవ్యాప్తంగా 36 కేంద్రాలు ఏర్పాటు చేశారు. తుది ఫలితాలపై మధ్యాహ్నం కల్లా ఒక స్పష్టమైన చిత్రం ఆవిష్కృతం అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. బుధవారం జరిగిన ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 73.19 శాతం పోలింగ్‌ నమోదైన సంగతి తెలిసిందే.  



ప్రధాన పార్టీల నడుమ హోరాహోరీ  

ఈ ఎన్నికల్లో అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్‌ మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేశాయి. కొన్ని సర్వేలు బీజేపీ మళ్లీ గెలుస్తుందని తెలియజేశాయి. స్వల్ప మెజార్టీతో కాంగ్రెస్‌ నెగ్గే అవకాశం ఉన్నట్లు మరికొన్ని సర్వేల్లో వెల్లడయ్యింది. జేడీ(ఎస్‌) కింగ్‌మేకర్‌ మారే అవకాశాలు కొట్టిపారేయలేమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కర్ణాటకలో గత 38 ఏళ్లుగా అధికార పార్టీ వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన దాఖలాలు లేవు.

ఆ ఆనవాయితీని బద్ధలు కొట్టాలన్న లక్ష్యంతో అధికార బీజేపీ శ్రమించింది. మరోవైపు ఈ ఎన్నికలపై కాంగ్రెస్‌కు భారీ ఆశలే ఉన్నాయి. వీటిలో గెలిస్తే పార్టీల్లో కొత్త ఉత్సాహం వస్తుందని, వచ్చే ఏడాది జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో తామే అతిపెద్ద పార్టీగా అవతరిస్తామని కాంగ్రెస్‌ లెక్కలు వేసుకుంటోంది. తీర్పు ఎవరికి అనుకూలంగా ఉండనుందన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ప్రభుత్వం మాదే: బొమ్మై

ఎన్నికల్లో తమకే సంపూర్ణ మెజార్టీ లభిస్తుందని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై ధీమా వ్యక్తం చేశారు.సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటయ్యే ప్రసక్తే లేదన్నారు. పార్టీ సహచర  నాయకులతో కలిసి మాజీ సీఎం బీఎస్‌ యడియూరప్పను శుక్రవారం ఆయన నివాసంలో కలుసుకున్నారు. 

అనంతరం విలేకరులతో మాట్లాడుతూ తమ పార్టీ సొంతంగా పోలింగ్‌ బూత్‌ స్థాయిలో ఓటింగ్‌ సరళిని పరిశీలించిందని మేజిక్‌ ఫిగర్‌ దాటుతామన్న విశ్వాసం తమకి ఉందన్నారు. హంగ్‌ అసెంబ్లీ వస్తే బీజేపీ వైఖరి ఎలా ఉంటుందన్న ప్రశ్నకు ఊహాగానాలను తాను విశ్వసించనని చెప్పారు. తమకి మెజార్టీ ఖాయమని స్పష్టం చేశారు. ఈ సారి ఎన్నికల్లో అత్యధికంగా 73.19% పోలింగ్‌ నమోదైంది. ఎగ్జిట్‌ పోల్స్‌లో అత్యధిక సంస్థలు కాంగ్రెస్‌కే స్వల్ప మొగ్గు వస్తుందని వెల్లడించాయి.   



సంప్రదింపులు.. బేరసారాలు  

కర్ణాటకలో అధికారం చేజిక్కించుకునేందుకు ఇప్పటికే పార్టీలు తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. నేతలు వరుసగా సమావేశాలు, చర్చలు జరుపుతున్నారు. గెలుపోటముల లెక్కలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 224 సీట్లను గాను 113 సీట్లు సాధించాలి. కనీసం సాధారణ మెజార్టీ సాధిస్తామని బీజేపీ, కాంగ్రెస్‌ ధీమాగా చెబుతున్నాయి. మ్యాజిక్‌ ఫిగర్‌కు చేరువగా వచ్చి ఆగిపోతే హంగ్‌ పరిస్థితులు రానున్నాయి. అందుకే కచ్చితంగా గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థులపై పార్టీలు కన్నేశాయి. స్వతంత్ర అభ్యర్థులపైనా దృష్టి పెట్టాయి.

వారితో సంప్రదింపులు, బేరసారాలు జరుపుతున్నట్లు తెలిసింది. హంగ్‌ ఏర్పడితే చేపట్టాల్సిన కార్యాచరణపై కాంగ్రెస్‌ పెద్దలు చర్చించారు. ఇక బీజేపీ నేతలు కూడా సమాలోచనాల్లో మునిగిపోయారు. శుక్రవారం ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై మాజీ సీఎం యడియూరప్ప నివాసానికి వెళ్లి మాట్లాడారు. జేడీ(ఎస్‌)లో ఇంకా ఎలాంటి సమావేశాలు నిర్వహించలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో అందరి చూపు ఆ పార్టీ పైనే ఉంది. జేడీ(ఎస్‌) నేత, మాజీ సీఎం కుమారస్వామి సింగపూర్‌ పర్యటనకు వెళ్లారు. రాష్ట్రంలో హంగ్‌ వస్తే తమ ఎమ్మెల్యేలను రిసార్టులకు తరలించేందుకు పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ఎమ్మెల్యేగా నెగ్గినవారంతా శనివారం సాయంత్రంలోగా బెంగళూరుకు చేరుకోవాలని ప్రధాన పార్టీల నుంచి ఆదేశాలు వెళ్లినట్లు తెలిసింది.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Karnataka Assembly Election 2023
assembly election results
counting of votes
security arrangements
Congress Party
Exit polls
JDS
King maker
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

NEET ఎగ్జామ్‌ మిస్‌.. విద్యార్థుల కన్నీళ్లు.. తప్పెవరిది?

NEET ఎగ్జామ్‌ మిస్‌.. విద్యార్థుల కన్నీళ్లు.. తప్పెవరిది?

కాంగ్రెస్‌లో మళ్లీ ‘థరూర్‌’ మంటలు

కాంగ్రెస్‌లో మళ్లీ ‘థరూర్‌’ మంటలు

‘యూజ్‌లెస్‌ ఫెలోస్‌.. మీ సంగతి తేలుస్తా’

‘యూజ్‌లెస్‌ ఫెలోస్‌.. మీ సంగతి తేలుస్తా’

అమర్‌నాథ్‌ యాత్రకు ‘ఆపరేషన్‌ శివ’ 

అమర్‌నాథ్‌ యాత్రకు ‘ఆపరేషన్‌ శివ’ 

‘రేవంత్‌ పాలనలో మహిళలకు రక్షణ కరువైంది’

‘రేవంత్‌ పాలనలో మహిళలకు రక్షణ కరువైంది’

2024లో శరద్‌ పవార్‌ ఏమన్నారో ఇప్పుడదే..

2024లో శరద్‌ పవార్‌ ఏమన్నారో ఇప్పుడదే..

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.