ముంబై: ఇండిగో విమానంలో తలెత్తిన ల్యాండింగ్ గేర్ లివర్ సమస్య కొద్దిసేపు అందరినీ కంగారు పెట్టింది. ఈ ఉదంతం శుక్రవారం ముంబై విమానాశ్రయంలో జరిగింది. 210 మందికి పైగా ప్రయాణికులతో కూడిన ఏ321 తరహా విమానం రన్‌వేపై దిగే సమయంలో ల్యాండిగ్ గేర్‌కు సంబంధించిన ఆటోమేటిక్ మోడ్ మొరాయించింది.
దాంతో కాసేపు గందరగోళం తలెత్తింది. కొద్దిసేపటి ప్రయత్నం అనంతరం విమానం సురక్షితంగా దిగింది. ఆ వెంటనే నిపుణులు రంగంలోకి దిగి సమస్యను సరిదిద్దారు. కొద్దిపాటి ఆలస్యంతో విమానం యథావిధిగా కార్యకలాపాలు సాగించినట్టు ఇండిగో పేర్కొంది. తలెత్తింది చిన్న సాంకేతిక లోపం మాత్రమేనని చెప్పుకొచి్చంది.
సురక్షితంగా ల్యాండింగ్
ADVERTISEMENT
ADVERTISEMENT