Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. National
  3. కశ్మీర్‌కు వందేభారత్‌ రికార్డు పరుగు
ADVERTISEMENT 

కశ్మీర్‌కు వందేభారత్‌ రికార్డు పరుగు

National Sakshi User Sakshi Sakshi Time Jan 26, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
250120250824-PTI01_25_2025_.jpg

ట్రయల్‌ రన్‌ విజయవంతం

ఈ ఎక్స్‌ప్రెస్‌కు అనేక ప్రత్యేకతలు

త్వరలోనే ప్రధాని మోదీ పచ్చ జెండా

శ్రీనగర్‌: కశ్మీర్‌ను రైలు మార్గం ద్వారా భారతీయ రైల్వే నెట్‌వర్క్‌తో అనుసంధానించే బృహత్‌ కార్యక్రమం విజయవంతమైంది. శనివారం ప్రఖ్యాత వైష్ణో దేవి ఆలయం నెలకొన్న జమ్మూలోని కాట్రా నుంచి కశ్మీర్‌లోని బుద్గాం వరకు వందే భారత్‌ రైలు ట్రయల్‌ రన్‌ విజయవంతంగా పూర్తయింది. నౌగావ్‌ ప్రాంతంలోని శ్రీనగర్‌ స్టేషన్‌కు ఉదయం 11.30 గంటల సమయంలో ఆరెంజ్‌– గ్రే– కలర్‌ రైలు చేరుకుంది. 

ఆ రైలులో వచ్చిన వారికి జనం పూల దండలతో స్వాగతం పలికారు. ఈ ప్రాంతంలో మంచు, అతిశీతల వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా అత్యాధునిక వసతులతో రూపొందించిన ప్రత్యేక రైలు శుక్రవారం జమ్మూకు చేరుకుంది. ట్రయల్‌ రన్‌లో భాగంగా ప్రపంచంలోనే అత్యంత పొడవైన అంజి ఖాద్‌ వంతెనతోపాటు, ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన చినాబ్‌ వంతెన మీదుగా ఈ రైలు పరుగులు తీసిందని అధికారులు తెలిపారు. 

కొద్ది సమయం తర్వాత రైలు బుద్గాం స్టేషన్‌ నుంచి ముందుకు వెళ్లి ట్రయల్‌ రన్‌ను పూర్తి చేసింది. ఉత్తర రైల్వే చీఫ్‌ ఏరియా మేనేజర్‌(శ్రీనగర్‌) సకీబ్‌ యూసఫ్‌ మాట్లాడుతూ.. ఈ ట్రయల్‌ రన్‌ చారిత్రక ఘట్టంగా అభివరి్ణంచారు. ఇంజినీరింగ్‌ అధికారుల పదేళ్ల శ్రమకు తగిన ప్రతిఫలమన్నారు. రైల్వే సేఫ్టీ కమినర్‌ కూడా ధ్రువీకరించినందున కాట్రా–బారాముల్లా సెక్షన్‌లో నడిచే ఈ రైలును త్వరలోనే ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించే అవకాశముంది. సుమారు 272 కిలోమీటర్ల పొడవైన ఉధంపూర్‌–శ్రీనగర్‌– బారాముల్లా రైల్‌ లింక్‌(యూఎస్‌బీఆర్‌ఎల్‌) ప్రాజెక్టును రైల్వే శాఖ డిసెంబర్‌లో పూర్తి చేసింది.  

వాతావరణానికి తగ్గ ఏర్పాట్లు 
కాట్రా–శ్రీనగర్‌ రైలు మార్గం కోసం జమ్మూకశ్మీర్‌లోని పర్వత ప్రాంతంలోని శీతాకాల పరిస్థితులను తట్టుకునేలా ప్రత్యేకంగా తయారు చేసిన వందే భారత్‌ ఎక్స్‌ ప్రెస్‌ రైలును గతేడాది జూన్‌ 8వ తేదీన అధికారులు ఆవిష్కరించారు. ఇందులో ఇతర వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో ఉండే వసతులతోపాటు అనేక ప్రత్యేకతలున్నాయి. శీతాకాలంలో రైలులోని పైపులు, బయో టాయిలెంట్‌ ట్యాంకుల్లో నీరు గడ్డకట్టకుండా అత్యాధునిక హీటింగ్‌ వ్యవస్థను అమర్చారు.

 వాక్యూమ్‌ సిస్టమ్‌కు వెచ్చని గాలి అందేలా చేశారు. దీనివల్ల ఉష్ణోగ్రతలు మైనస్‌ డిగ్రీలకు పడిపోయినా ఎయిర్‌ బ్రేక్‌ వ్యవస్థ యథా ప్రకారం పనిచేస్తుంది. తీవ్రంగా మంచు కురుస్తున్న సమయంలో సైతం డ్రైవర్‌ ముందున్న వస్తువులను స్పష్టంగా చూడగలిగేలా విండ్‌ షీల్డ్‌పై పేరుకుపోయిన మంచును స్వయంచాలితంగా తొలగించే ఏర్పాటుంది. 

అదనంగా మిగతా వందే భారత్‌ రైళ్లలో ఉండే ఇతర అన్ని వసతులు..ఎయిర్‌ కండిషన్డ్‌ కోచ్‌లు, ఆటోమేటిక్‌ ప్లగ్‌ డోర్లు, మొబైల్‌ చార్జింగ్‌ సాకెట్ల వంటివి ఉన్నాయి. దేశంలోనే మొట్టమొదటి కేబుల్‌ రైలు వంతెన అంజి ఖాద్‌ బ్రిడ్జి, చినాబ్‌ నదిపై కౌరి వద్ద నిర్మించిన ఆర్చ్‌ బ్రిడ్జిల మీదుగా గత నెలలో ఈ రైలును ఆరుసార్లు ప్రయోగాత్మకంగా నడిపారు. 

యూఎస్‌బీఆర్‌ఎల్‌ ప్రాజెక్టులోని భాగమైన అంజి ఖాద్‌ వంతెన ఇంజనీరింగ్‌ ప్రతిభకు తార్కాణంగా నిలిచింది. నది గర్భం నుంచి 331 మీటర్ల ఎత్తులో ఒకే ఒక పైలాన్‌పై నిర్మితమైన వారధి ఇది. పునాది నుంచి దీని ఎత్తు 191 మీటర్లు. దీనిని పూర్తి చేసేందుకు ఇంజనీరింగ్‌ అధికారులకు ఏళ్లు పట్టింది. మొత్తం 473.25 మీటర్ల పొడవైన అంజి ఖాద్‌ వంతెన ప్రపంచంలోనే రెండో అత్యంత ఎత్తైన రైల్వే వంతెనగా రికార్డు నెలకొల్పింది. అంతేకాదు, చినాబ్‌ నదిపైప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే వంతెనను నిర్మించారు. నదీ గర్భం నుంచి 359 మీటర్ల ఎత్తులో ఏర్పాటు చేశారు. ఇది పారిస్‌లోని ఈఫిల్‌ టవర్‌ కంటే కూడా 35 మీటర్ల పొడవెక్కువ.  

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
kashmir
Indian Railway
Vaishno Devi temple
katra
Vande Bharat Express
trial run
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ప్రయాణికులకు అలర్ట్.. అమల్లోకి రైల్వే కొత్త రూల్స్!

ప్రయాణికులకు అలర్ట్.. అమల్లోకి రైల్వే కొత్త రూల్స్!

ట్రైన్ టికెట్ బుక్ చేస్తున్నారా.. ఈ విషయాలు తెలుసా?

ట్రైన్ టికెట్ బుక్ చేస్తున్నారా.. ఈ విషయాలు తెలుసా?

రైలు ఆలస్యమైతే.. ప్రయాణికులకు ఫ్రీ ఫుడ్!

రైలు ఆలస్యమైతే.. ప్రయాణికులకు ఫ్రీ ఫుడ్!

‘వందేభారత్‌’ను ప్యాసింజర్‌ చేశారా?.. ప్రయాణికుల గగ్గోలు!

‘వందేభారత్‌’ను ప్యాసింజర్‌ చేశారా?.. ప్రయాణికుల గగ్గోలు!

రైల్లో న్యూస్ పేపర్ పరచుకుని పడుకున్నా: సోనూసూద్

రైల్లో న్యూస్ పేపర్ పరచుకుని పడుకున్నా: సోనూసూద్

POKలో పాక్ ఆర్మీ అరాచకం..! 30 మంది మృతి..

POKలో పాక్ ఆర్మీ అరాచకం..! 30 మంది మృతి..

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.