ఢిల్లీ: దేశంలో మరో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. అస్సాంలో శనివారం ఉదయం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎఎన్-32 ట్రాన్స్పోర్ట్ విమానం కూలిపోయింది. ల్యాండింగ్ చేస్తుండగా ఈ విమాన ప్రమాదం చోటుచేసుకుంది. విమానం క్రాష్ అయిన తర్వాత మంటలు చెలరేగాయి. జోర్హాట్ ఎయిర్ బేస్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందినట్టు అధికారులు తెలిపారు. మృతుల్లో ముగ్గురు అధికారులు, ఇద్దరు సిబ్బంది ఉన్నారు. ఈ ప్రమాదంలో మరొకరు గాయపడటంతో అతడికి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ప్రమాదంపై భారత వాయుసేన అధికారికంగా స్పందిస్తూ.. దర్యాప్తునకు ఆదేశించామని, పూర్తి వివరాలు సేకరించిన తర్వాత మరిన్ని వివరాలు అందిస్తామని తెలిపింది.
An AN-32 transport aircraft of the Indian Air Force has met with an accident at the Jorhat Air Force station in Assam. More details are awaited: Indian Air Force pic.twitter.com/eeF23GDFEM
— ANI (@ANI) June 13, 2026
