Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. National
  3. శబరిమల అప్‌డేట్‌.. 2,92,555 మంది అయ్యప్ప భక్తులు..
ADVERTISEMENT 

శబరిమల అప్‌డేట్‌.. 2,92,555 మంది అయ్యప్ప భక్తులు..

National Sakshi User Sakshi Sakshi Time Jan 3, 2026 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Sabarimala.jpg

మకరవిలక్కు: కేరళలోని శబరిమలలో అయ్యప్ప భక్తుల రద్దీ కొనసాగుతోంది. నిన్న సాయంత్రం(శుక్రవారం) వరకు 2,92,555 మంది అయ్యప్ప భక్తులు శబరిమల దర్శనం చేసుకున్నారు.  జనవరి 14వ తేదీన మకరజ్యోతి దర్శనం ఉన్న నేపథ్యంలో భారీ సంఖ్యలో అ‍య్యప్ప భక్తులు శబరికి చేరుకునే అవకాశం ఉంది.

శబరిమలలో అయ్యప్ప స్వామి దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఎటుచూసినా భక్తజనులతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. స్వామి అయ్యప్ప నామస్మరణతో శబరిమల ఆలయం భక్తి వాతావరణంతో నిండిపోయింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు శబరిమలకు తరలి వెళ్తున్నారు.

ఇక, డిసెంబర్ 30న మకరవిలక్కు తెరిచినప్పుడు 57,256 మంది భక్తులు అయ్యప్పను దర్శనం చేసుకున్నారు. అలాగే, జనవరి ఒకటో తేదీ సాయంత్రం  ఆరు గంటల నుండి జనవరి రెండో తేదీ సాయంత్రం ఏడు గంటల వరకు 75,267 మంది భక్తులు ఆలయ దర్శనం చేసుకున్నారు. మొత్తంగా మకరవిలక్కు మహోత్సవ సందర్భంగా డిసెంబర్ 30న నుంచి నిన్న సాయంత్రం వరకు 2,92,555 మంది అయ్యప్ప భక్తులు ఆలయానికి విచ్చేశారు.

మకరజ్యోతి దర్శనం.. 
ఇదిలా ఉండగా.. శబరిమలలో మకర జ్యోతి దర్శనం జనవరి 14, 2026 సాయంత్రం సుమారు 6:30 PM నుండి 6:55 PM (IST) మధ్య జరుగుతుందని అంచనా. ఈ సమయంలో భక్తులు పొన్నంబలమేడు వద్ద ఆకాశంలో కనిపించే దివ్యమైన జ్యోతిని దర్శిస్తారు. ఈ జ్యోతి అయ్యప్ప స్వామి ఆశీస్సులను సూచిస్తుందని భక్తులు విశ్వసిస్తారు.

ఆధ్యాత్మిక ప్రాముఖ్యత
మకర జ్యోతి శబరిమల యాత్రలో అత్యంత ముఖ్యమైన ఆధ్యాత్మిక ఘట్టం. ఈ జ్యోతి అయ్యప్ప స్వామి దివ్య సాన్నిధ్యాం తోపాటు ఆధ్యాత్మిక శక్తిని, శాంతిని ప్రసాదిస్తుందని భక్తుల నమ్మకం. మకర సంక్రాంతి రోజున సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడం వల్ల ఈ సమయం ప్రత్యేక ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. ఈ సందర్భంగా భక్తులు కఠినమైన వ్రత దీక్షను పాటిస్తూ, 41 రోజుల పాటు నియమ నిష్టలతో అయ్యప్ప స్వామిని ఆరాధిస్తారు.

ప్రధాన ఆకర్షణగా స్వామి తిరువాభరణ ఊరేగింపు..
మకర జ్యోతి రోజున పందళం మహారాజుల మహల్ నుంచి మూడు పెట్టెల్లో పవిత్ర తిరువాభరణాలు శబరిమలకి తీసుకువస్తారు. ఆ రోజు సాయంత్రం అయ్యప్ప స్వామికి తిరువాభరణ అలంకారం చేస్తారు. అనతరం దీపారాధన నిర్వహిస్తారు. ఇక ఈ రోజు పొన్నంబలమేడులో మకర జ్యోతి మూడు సార్లు దర్శనం ఇస్తుంది.

మకర జ్యోతి దర్శనం కనబడే ప్రదేశాలు

  • సన్నిధానం

  • పాండితావళం

  • మాలికాపురం ప్రాంతం – అట్టతోడు

  • నీలిమల

  • పుల్మేడు

  • శరణ్ గుత్తి

  • మరకూట్టం

భక్తులకు సూచనలు..
మకర జ్యోతి దర్శనం కోసం వెళ్లే భక్తులు ముందుగానే ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆలయ అధికారులు భక్తుల సౌకర్యం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. అలాగే భక్తులు రద్దీని దృష్టిలో ఉంచుకుని, అధికారుల సూచనలను పాటించాలి. చివరగా ఈ మకర జ్యోతి దర్శనం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందం తోపాటు అయ్యప్ప స్వామి దివ్య ఆశీస్సులను పొందే గొప్ప అవకాశాన్ని కల్పిస్తుంది.

కొత్త ఏడాదిలో ఈ పవిత్ర క్షణాన్ని దర్శించేందుకు భక్తులంతా సిద్ధంగా ఉండాలి. కాగా, భక్తులకు జనవరి 19, 2026 రాత్రి 9 గంటల వరకు దర్శనానికి అవకాశం ఉంటుంది. జనవరి 20, 2026 శబరిమల ఆలయాన్ని తిరిగి మూసివేస్తామని దేవస్వం బోర్డు పేర్కొంది.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
sabarimala
Sabarimala Ayyappa
Sabarimala Ayyappa Temple
devotees rush
kerala
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

వయనాడ్ లో వర్ష బీభత్సం.. కొండచరియలు విరిగి ఐదుగురు మృతి

వయనాడ్ లో వర్ష బీభత్సం.. కొండచరియలు విరిగి ఐదుగురు మృతి

ట్రాఫిక్‌లో ఆగిన గుండె.. కదిలొచ్చిన దేవతలు

ట్రాఫిక్‌లో ఆగిన గుండె.. కదిలొచ్చిన దేవతలు

లక్‌ అంటే వీరిదే : కారు నుజ్జు నుజ్జు, షాకింగ్‌ సీసీటీవీ విజువల్స్‌

లక్‌ అంటే వీరిదే : కారు నుజ్జు నుజ్జు, షాకింగ్‌ సీసీటీవీ విజువల్స్‌

కేరళలో అనుమానిత ఎబోలా, ఇప్పటికి ఎన్ని కేసులు అంటే

కేరళలో అనుమానిత ఎబోలా, ఇప్పటికి ఎన్ని కేసులు అంటే

మహా శివమ్‌: చెంగల్‌ శివ పార్వతి క్షేత్రం

మహా శివమ్‌: చెంగల్‌ శివ పార్వతి క్షేత్రం

 ఆ హక్కులు మావే.. కేరళ ముఖ్యమంత్రి

ఆ హక్కులు మావే.. కేరళ ముఖ్యమంత్రి

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.