న్యూఢిల్లీ: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. సుమారు రూ. 35 కోట్ల విలువైన 5 కిలోల హెరాయిన్‌ను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఎవరి కంట పడకుండా హెరాయిన్‌ను లగేజ్ బ్యాగ్‌లో దాచి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు నిందితులు. స్కానింగ్ మిషన్‌లో లగేజ్ బ్యాగ్ పెట్టకుండా తప్పించుకునేందుకు యత్నించారు. అయితే కస్టమ్స్ అధికారులు చాకచక్యంగా స్మగర్లను పట్టుకోవడంతో డ్రగ్స్ సీజ్ చేశారు.
ADVERTISEMENT
ADVERTISEMENT