Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. National
  3. ప్రయాణికులపాలిట పీడకల... డ్రీమ్‌లైనర్‌
ADVERTISEMENT 

ప్రయాణికులపాలిట పీడకల... డ్రీమ్‌లైనర్‌

National Sakshi User Sakshi Sakshi Time Jun 13, 2025 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
deram-lin.jpg

పుష్కరకాలంగా సేవలందిస్తున్నా పుష్కలంగా ఆరోపణలు మోస్తున్న 787 మోడల్‌ విమానం 

విడిభాగాల బిగింపులో ప్రమాణాలు పాటించట్లేరన్న సంస్థ మాజీ సీనియర్‌ ఇంజనీర్‌ 

లోపాలతో గతంలో తయారీని నిలిపేసిన బోయింగ్‌ సంస్థ

విదేశాల్లో మెరుగైన ఉపాధి అవకాశాల కోసం కలలు రెక్కలు కట్టుకుని విమానం ఎక్కే వందలాది మంది ప్రయాణికులు తాజాగా బోయింగ్‌ 787–8 డ్రీమ్‌లైనర్‌ పేరు చెప్పగానే హడలిపోతున్నారు. ఇది మార్గమధ్యంలో కూలిపోయి తమ కలలను కల్లలుచేస్తుందన్న ప్యాసింజర్ల భయాందోళల నడుమ ఈ మోడల్‌ విమానంపై సర్వత్రా చర్చ నెలకొంది. అమెరికా విమానతయారీరంగ దిగ్గజం బోయింగ్‌ 2011లో అత్యంత ప్రతిష్టాత్మకంగా అందుబాటులోకి తెచ్చిన ఈ విమానం ఇప్పుడు అత్యంత అప్రతిష్టను మూటగట్టుకుంటోంది. దీంతో ఈ మోడల్‌ విమానం గత విజయాలు, విశేషాలతోపాటు వివాదాలపర్వాన్ని యావత్‌ ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది. వేర్వేరు చోట్ల తయారుచేసి మరోచోట విడిభాగాలను పటిష్టమైన ప్రామాణాలను పాటించకుండానే బిగిస్తున్నారని, డిజైన్‌ లోపాలున్నాయని ఈ మోడల్‌పై ఎన్నో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మోడల్‌ పుట్టుపూర్వోత్తరాలను ఒకసారి గమనిద్దాం. 

విలాసానికి మారుపేరు.. ఎప్పుడొచ్చింది? 
2011లో విశ్వవిపణిలోకి తొలిసారిగా అడుగుపెట్టినప్పుడు బోయింగ్‌ 787–8 డ్రీమ్‌లైనర్‌ విమానంలోని సదుపాయాలు, సామర్థ్యాన్ని చూసిన వాళ్లంతా ఔరా అనేశారు. ఎక్కువ మంది ప్రయాణికుల సీటింగ్‌ సామర్థ్యంతోపాటు సుదూరాలకు ఇది అవలీలగా వెళ్లగలదు. కొనుగోలుచేసిన, నిర్వహణ సంస్థకు అనువుగా 242 నుంచి గరిష్టంగా 290 వరకు ప్రయాణికులు ఇందులో ప్రయాణించవచ్చు. 

సామర్థ్యం ఎంత? 
ఏకధాటిగా ఎక్కడా ఆగకుండా ఏకంగా 13,530 కిలోమీటర్లు ప్రయాణించగలదు. దీంతో సుదూర నగరాల మధ్య సంధానకర్తగా ఇది మంచి పేరు తెచ్చుకుంది. అత్యంత పటిష్టమైన, అత్యంత తేలికైన మూలకాలతో విమాన నిర్మాణ విడిభాగాలను తయారుచేశారు. దీంతో మిగతా పోటీ సంస్థల మోడళ్లతో పోలిస్తే దీని బరువు తక్కువగా ఉంటుంది. మైలేజీపరంగా తక్కువ ఇంధనంతో పనిచేస్తుంది. 

టెక్నాలజీ ఎలాంటిది? 
కొత్తతరం డిజైన్, అధునాతన ఫ్లై–బై–వైర్‌ కంట్రోలర్లతో పనిచేస్తుంది. ప్రతి ఆదేశాన్ని పైలట్‌ ఇవ్వాల్సిన పనిలేకుండా గాల్లో కదిలే దిశ, ఒంపుకు అనుగుణంగా ఆటోమేటిక్‌గా కంప్యూటరే ఆదేశాలు ఇచ్చే వ్యవస్థ ఇందులో ఉంది. అత్యాధునిక ప్రయాణికుల భద్రతా ఏర్పాట్లు దీనిలో ఉన్నాయి. సింథటిక్‌ విజన్‌ సిస్టమ్‌(ఎస్‌వీఎస్‌) సాయంతో కింద ఉన్న భూభాగాన్ని త్రిమితీయ(3డీ) ఫొటోలు తీసి ల్యాండింగ్, టేకాఫ్‌ సమయాల్లో రన్‌వేపై పక్షులు, ఎయిర్‌పోర్ట్‌ వస్తువులు ఏమైనా ఉన్నాయోలేదో వెంటనే అలర్ట్‌చేస్తుంది. మంచుదుప్పటి కప్పుకున్నా, భీకర వర్షం పడుతున్నా రన్‌వే పరిసరాలను స్పష్టంగా చూపిస్తుంది. 

ఇంకెన్ని ఫీచర్లు ఉన్నాయి? 
ప్రయాణికుల సీటింగ్‌ క్యాబిన్, కాక్‌పిట్, కార్గో సెక్షన్లు అన్నింటిపైనా సమీకృత పర్యవేక్షణ ఉండేలా ఇంటిగ్రేటెడ్‌ మాడ్యులర్‌ ఏవియానిక్స్‌(ఐఎంఏ) విధానంతో విమానం పనిచేస్తుంది. ఆక్సిజన్‌ పీడనం, ఇంధన లీకేజీలు, హఠాత్తుగా ప్రయాణ ఎత్తు తగ్గడం, పిడుగులతో కుదుపులకు లోనవడం వంటి సందర్బాల్లో వెనువెంటనే ఆటోమేషన్‌లో తనంతట తానుగా సర్దుబాటు చేసుకునే వ్యవస్థలు ఇందులో ఉన్నాయి.  
 


మరి లోపాలేంటి? 
తొలిరోజుల్లో నవతరం విమానానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన 787–8 డ్రీమ్‌లైనర్‌ నెమ్మదిగా విమర్శల సుడిగుండంలో పడింది. 2013లో ఈ మోడల్‌ విమానాల్లో లిథియం అయాన్‌ బ్యాటరీలు పేలిపోయాయి. దీంతో అమెరికా ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మిని్రస్టేషన్‌(ఎఫ్‌ఏఏ) వీటి రాకపోకలను స్తంభింపజేసింది. విమానం మధ్యలోని ప్రధాన విడిభాగాన్ని ఇతర భాగాలను అనుసంధానించేటప్పుడు సరైన ప్రమాణాలను పాటించట్లేరని 2019లో తొలిసారిగా ఆరోపణలు వచ్చాయి.

 బిగింపుల మధ్య అతుకులు సరిగా పూడ్చట్లేరని, ఇందుకు కిందిస్థాయి సిబ్బంది నిర్లక్ష్యం కూడా తోడైందని వెల్లడైంది. దీంతో తరలింపు కోసం వాడిన బోల్ట్‌లు ఆ తర్వాత సైతం జాయింట్ల వద్ద అలాగే ఉండిపోయి మొత్తం వ్యవస్థకే సమస్యాత్మకంగా మారుతున్నాయి. సమీక్ష జరిపాకే ఎయిర్‌లైన్స్‌లకు కొత్త విమానాలను డెలివరీ చేయాలని ఎఫ్‌ఏఏ ఆదేశించడంత 2021 జనవరి నుంచి 2022 ఆగస్ట్‌దాకా 787 సిరీస్‌ల డెలివరీ ఆగిపోయింది.

లోపాలను ఎత్తిచూపిన సీనియర్‌ ఉద్యోగులు 
ఏళ్ల తరబడి బోయింగ్‌ సంస్థలో పనిచేసిన సీనియర్‌ ఇంజినీర్లు ఈ మోడల్‌ విమానాల్లో లోపాలు ఉన్నట్లు పలుమార్లు బహిరంగంగా చెప్పారు. బోయింగ్‌ సంస్థలో ఇంజనీర్‌గా 17 ఏళ్లపాటు పనిచేసిన మాజీ ఉద్యోగి సామ్‌ సలేహ్‌పౌర్‌ 2024లో ఎఫ్‌ఏఏకు ఫిర్యాదు కూడా చేశారు. ‘‘విడిభాగాల ఉత్పత్తి దశలో బోయింగ్‌ అడ్డదారులు తొక్కుతోంది. విడిభాగాల బిగింపు సమయంలో అత్యున్నత స్థాయి ప్రమాణాలను పాటించట్లేదు. హడావిడిగా తుది ఆమోద ముద్ర వేసేలా ఇంజనీరింగ్‌ సిబ్బందిపై ఒత్తిడి చేస్తోంది. 

సరైన బిగింపు లేకపోవడం వల్ల విమానం పాతబడేకొద్దీ లోపం అనేది అత్యంత ప్రమాదకరంగా పరిణమిస్తుంది.  అసెంబ్లీ యూనిట్లలో సిబ్బంది అడవిలో టార్జాన్‌ మాదిరిగా ఒక చోట నుంచి మరోచోటుకు వేగంగా మారుతూ పనిని సవ్యంగా చేయట్లేరని సంస్థకు ఎన్నోసార్లు చెప్పినా ఎవరూ పట్టించుకోలేదు. 2020 ఏడాది నుంచి మూడుసార్లు సంస్థ ఉన్నతాధికారులకు ఫిర్యాదుచేస్తే నన్ను ‘నోరు మూస్కో’అన్నారు. ఇన్ని లోపాలతో తయారైన ఈ లోహ విహంగాలు టిక్‌ టిక్‌ శబ్దం చేసే టైంబాంబులే. రక్షణ, భద్రతా సంస్కృతికి బోయింగ్‌ తిలోదకాలిస్తోంది’’అని సలేహ్‌పౌర్‌ ఆరోపించారు.

సమస్యలు ఎత్తిచూపి శాశ్వత నిద్రలోకి.. 
క్వాలిటీ కంట్రోల్‌ ఇంజనీర్‌గా 32 ఏళ్లు బోయింగ్‌లో పనిచేసిన జాన్‌ బార్నెట్‌ సైతం పలు లోపాలను ఎత్తిచూపారు. ‘‘అత్యధిక పని ఒత్తిడి కారణంగా సిబ్బంది.. తయారీ లోపాలున్నాసరే ఆయా భాగాలను బిగించేస్తున్నారు. ఆక్సీజన్‌ వ్యవస్థల్లో ఇలాంటి లోపాలను గుర్తించా. ప్రతి నాలుగింట ఒక ఎమర్జెన్సీ బ్రీతింగ్‌ మాస్‌్కలో లోపం ఉంది. వాడేటప్పుడు ఇవి విఫలమవడం ఖాయం’’అని అన్నాడు. ఈ లోపాలను బయటపెట్టినందుకు ఈయనపై కేసు నమోదైంది. తర్వాత ఈయన ఆత్మహత్యచేసుకున్నారు. విమానాల్లో లోపాల ను క్వాలిటీ ఆడిటర్‌ జాషువా డీన్‌ సైతం బయటపెట్టారు. తర్వాత ఆయన సైతం అనారోగ్య సమస్యలతో చనిపోయారు.    
 – సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
boeing 787 dreamliner
Dreamliner
Ahmedabad Plane Crash
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

అంతుచిక్కని సంఘటన.. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమానం క్రాష్ పై బయటకు రాని నిజాలు

అంతుచిక్కని సంఘటన.. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమానం క్రాష్ పై బయటకు రాని నిజాలు

ఏం జరిగింది? ఎందుకు జరిగింది? ఇంకా రహస్యమేనా?

ఏం జరిగింది? ఎందుకు జరిగింది? ఇంకా రహస్యమేనా?

చక్రం ఊడి కుప్పకూలిన విమానం.. పలువురికి గాయాలు!

చక్రం ఊడి కుప్పకూలిన విమానం.. పలువురికి గాయాలు!

‘వాడి జ్ఙాపకాలే ‍ప్రాణంగా..’.. అహ్మదాబాద్ విషాదానికి ఏడాది

‘వాడి జ్ఙాపకాలే ‍ప్రాణంగా..’.. అహ్మదాబాద్ విషాదానికి ఏడాది

ఎయిరిండియా విమానం దోషి... పైలట్ సుమీత్ సబర్వాల్!

ఎయిరిండియా విమానం దోషి... పైలట్ సుమీత్ సబర్వాల్!

తప్పిన పెను ప్రమాదం

తప్పిన పెను ప్రమాదం

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.