Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. National
  3. దిగ్విజయాల నుంచి దిగంతాలకు
ADVERTISEMENT 

దిగ్విజయాల నుంచి దిగంతాలకు

National Sakshi User Sakshi Sakshi Time Jun 13, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
RUPANI-1.jpg

సక్సెస్‌ఫుల్‌ సీఎంను కోల్పోయిన గుజరాత్‌ 

రూపానీ మరణంపై రాష్ట్రవ్యాప్తంగా వెల్లువెత్తిన సంతాపాలు

న్యూఢిల్లీ: అహ్మదాబాద్‌లో గురువారం జరిగిన ఘోర విమాన ప్రమాదంలో సాధారణ ప్రయాణికులతోపాటు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్‌ నేత విజయ్‌ రూపానీ సైతం ప్రాణాలు కోల్పోయిన వార్త తెలిసి గుజరాత్‌ ప్రజలు హుతాశులయ్యారు. పలు సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలుచేసి ప్రజారంజకంగా పాలించిన విజయ్‌ రూపానీ లేరన్న వార్త గుజరాత్‌ వాసులను కలిచివేసింది.  

విద్యార్థి దశ నుంచే ఆర్‌ఎస్‌ఎస్‌పై మక్కువ 
ప్రస్తుతం మయన్మార్‌గా పిలుచుకుంటున్న నాటి బర్మాలోని యాంగూర్‌ నగరంలో 1956 ఆగస్ట్‌ రెండో తేదీన విజయ్‌ కుమార్‌ రూపానీ జన్మించారు. నాటి బర్మాలో రాజకీయ అస్థిరత కారణంగా రూపానీ తల్లిదండ్రులు మాయబెన్, రామ్‌నిక్‌లాల్‌ రూపానీలు 1960లో గుజరాత్‌కు వలసవచ్చింది. చిన్నప్పటి నుంచే హిందూత్వంపై మక్కువతో టీనేజీలో ఉన్నప్పుడే ఆర్‌ఎస్‌ఎస్‌ ‘శాఖ’లో చేరారు. ఇందులోభాగంగా తొలుత ఏబీవీపీలో విద్యార్థి కార్యకర్తగా చేరారు. 1971లో జనసంఘ్‌లో చేరారు. 

భారతీయ జనతాపార్టీ ఆవిర్భావం నాటి నుంచి పార్టీకు పూర్తిగా అంకితమయ్యారు. 1976లో ఎమర్జెన్సీ కాలంలో భుజ్, భావనగర్‌ జైళ్లలో 11 నెలలపాటు కారాగార శిక్ష అనుభవించారు. 1978 నుంచి 1981 వరకు ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారక్‌గానూ పనిచేశారు. 1987లో రాజ్‌కోట్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో కార్పోరేటర్‌గా గెలిచారు. 1996 నుంచి 1997 దాకా రాజ్‌కోట్‌ మేయర్‌గా సేవలందించారు. 1998లో బీజేపీ గుజరాత్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. కేశూభాయ్‌పటేల్‌ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో మేనిఫెస్టో కమిటీకి ఛైర్మన్‌గా ఉన్నారు. 

2006లో గుజరాత్‌ రాష్ట్ర టూరిజం కార్పొరేషన్‌కు ఛైర్మన్‌గా సేవలందించారు. 2006 నుంచి 2012 ఏడాదిదాకా గుజరాత్‌ నుంచి రాజ్యసభ సభ్యునిగా కొనసాగారు. బీజేపీ గుజరాత్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నాలుగు పర్యాయాలు పనిచేసిన రికార్డ్‌ ఈయన సొంతం. నరేంద్ర మోదీ ముఖ్యమంత్రిగా ఉన్నకాలంలో రాష్ట్ర మున్సిపల్‌ ఫైనాన్స్‌ బోర్డ్‌కు రూపానీ ఛైర్మన్‌ సేవలందించారు. 2014లో విజుభాయ్‌ వాలా రాజ్‌కోట్‌ పశి్చమ శాసనసభ నియోజకవర్గానికి రాజీనామాచేయడంతో అక్కడ ఉపఎన్నిక చేపట్టారు. 


బీజేపీ మద్దతుతో ఆనాడు రూపానీ భారీ మెజార్టీతో విజయం సాధించారు. 2014 నవంబర్‌లో నాటి మహిళా ముఖ్యమంత్రి ఆనందిబెన్‌ పటేల్‌ తొలిసారిగా కేబినెట్‌ను విస్తరించినప్పుడు మొట్టమొదటిసారిగా రూపానీని మంత్రిపదవి వరించింది. రవాణా, నీటి పారుదల, ఉపాధి కారి్మక శాఖల మంత్రిగా పనిచేశారు. 2016 ఫిబ్రవరిలో గుజరాత్‌ రాష్ట్ర బీజేపీ అధ్యక్షునిగా రూపానీ ఎన్నికయ్యారు. 2021లో భారత్‌లో అత్యంత ప్రభావశీలురైన తొలి 100 మంది వ్యక్తుల జాబితాలో రూపానీ స్థానం సంపాదించుకున్నారు.

ముఖ్యమంత్రిగా.. 2017లో గుజరాత్‌ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. అప్పటిదాకా సీఎంగా కొనసాగిన ఆనందిబెన్‌ పదవి నుంచి తప్పుకున్నారు. దీంతో పార్టీకోసం దశాబ్దాలుగా అవిశ్రాంతంగా పనిచేస్తున్న రూపానీకి సీఎం పదవి కట్టబెట్టాలని పార్టీ అగ్రనాయకత్వం నిర్ణయించింది. రాజ్‌కోట్‌ వెస్ట్‌లో కాంగ్రెస్‌ నేత ఇంద్రాణిరాజ్యగురును మట్టికరిపించి ఎమ్మెల్యేగా గెలిచిన రూపానీని పార్టీ శాసనసభాపక్ష నేతగా, ముఖ్యమంత్రిగా బీజేపీ ప్రకటించింది. ప్రజల సమస్యలను వీలైనంత ఎక్కువగా పరిష్కరించేందుకు కృషిచేసి సమర్థవంతమైన సీఎంగా పేరుతెచ్చుకున్నారు.

లక్కీనంబర్‌ 1206 నాడే...
1206. ఇది తన లక్కీ నంబర్‌ అని విజయ్‌ రూపానీ బాగా నమ్ముతారు. అందుకే తొలినాళ్లలో వాడిన మోటార్‌సైకిళ్ల నుంచి ఆయన కార్ల దాకా అన్నింటికీ ఇదే నంబర్‌ ఉంటుంది. చివరికి విమాన ప్రమాదంలో రూపానీ దుర్మరణం పాలైన తేదీ కూడా 12.06 (జూన్‌ 12) కావడం విధి వైచిత్రేనంటూ ఆయన అభిమానులు వాపోతున్నారు.   

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
ahmedabad
former chief minister
Gujarat
vijay rupani
plane crash
passed away
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

వ్యవసాయానికి మించిన కథ..! 40 ఏళ్ల వయసులో ట్రాక్టర్‌ డ్రైవింగ్‌ ..

వ్యవసాయానికి మించిన కథ..! 40 ఏళ్ల వయసులో ట్రాక్టర్‌ డ్రైవింగ్‌ ..

అమెరికాలో తెలంగాణా విద్యార్థి అరుణ్‌ సాయి రెడ్డి హఠాన్మరణం

అమెరికాలో తెలంగాణా విద్యార్థి అరుణ్‌ సాయి రెడ్డి హఠాన్మరణం

‘మోగ్లీ గర్ల్‌’ పూజ ఇక లేదు

‘మోగ్లీ గర్ల్‌’ పూజ ఇక లేదు

జాతీయ స్థాయి బాడీబిల్డర్ : జిమ్‌ చేసి వచ్చి అంతే కుప్పకూలిపోయాడు!

జాతీయ స్థాయి బాడీబిల్డర్ : జిమ్‌ చేసి వచ్చి అంతే కుప్పకూలిపోయాడు!

పారిశ్రామికవేత్తగా గృహిణి..! ఏడాదికి రూ. 1.85 కోట్లు..

పారిశ్రామికవేత్తగా గృహిణి..! ఏడాదికి రూ. 1.85 కోట్లు..

మిస్సోరి విమాన ప్రమాదం : మృతుల్లో తెలుగు టెకీ సాయి కార్తీక వర్మ

మిస్సోరి విమాన ప్రమాదం : మృతుల్లో తెలుగు టెకీ సాయి కార్తీక వర్మ

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.