Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. National
  3. అంతరించిపోతున్న వన్యప్రాణులు
ADVERTISEMENT 

అంతరించిపోతున్న వన్యప్రాణులు

National Sakshi User Sakshi Sakshi Time Oct 18, 2024 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Endangered.jpg

అర్ధ శతాబ్దంలో గణనీయంగా తగ్గుదల  

2022తో పోలిస్తే నాలుగు శాతం ఎక్కువ 

మంచి నీటిలో జీవించే జాతులకే అధిక ముప్పు  

భారత్‌లో అంతరించిపోతున్న రాబందులు 

వరల్డ్‌ వైల్డ్‌లైఫ్‌ ఫౌండేషన్‌కు చెందిన లివింగ్‌ ప్లానెట్‌ ఇండెక్స్‌లో వెల్లడి  

వరల్డ్‌ వైల్డ్‌ లైఫ్‌ ఫౌండేషన్‌ విడుదల చేసిన లివింగ్‌ ప్లానెట్‌ ఇండెక్స్‌–2024లో అర్ధ శతాబ్దంలో భారీ సంఖ్యలో వన్యప్రాణుల జాతులు కనుమరుగైనట్లు పేర్కొంది. అడవుల నరికివేత, జంతువుల అక్రమ రవాణా, మానవ కార్యకలాపాలతో వన్యప్రాణులు అంతరించిపోతున్నాయని వెల్లడించింది.

అడవుల నరికివేత, జంతువుల అక్రమ రవాణా, మానవ కార్యకలాపాలతో వన్యప్రాణులు అంతరించిపోతున్నాయి.  వరల్డ్‌ వైల్డ్‌లైఫ్‌ ఫౌండేషన్‌ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌) విడుదల చేసిన లివింగ్‌ ప్లానెట్‌ ఇండెక్స్‌–2024లో అర్ధ శతాబ్దంలో భారీ సంఖ్యలో వన్యప్రాణుల జాతులు కనుమరుగైనట్టు పేర్కొంది. 1970 నుంచి 2020 మధ్య కాలంలో సగటు జాతుల్లో 73శాతం తగ్గుదలను గుర్తించింది. 

అత్యధికంగా మంచి నీటిలో జీవించే జాతులు ఎక్కువ ప్రమాదానికి (85శాతం) అంతరించిపోయినట్టు స్పష్టం చేసింది. భూ సంబంధ జాతుల్లో 69శాతం, సముద్ర జాతుల్లో 56 శాతంగా ఉంది. ఇలా వన్యప్రాణులు అంతరించపోవడం 022(69శాతం)­తో పోలిస్తే ఈ ఏడాది నాలుగు శాతం పెరగడం గమనార్హం. 

ఈ క్రమంలోనే జూలాజికల్‌ సొసైటీ ఆఫ్‌ లండన్‌ అందించిన లివింగ్‌ ప్లానెట్‌ ఇండెక్స్‌లో 1970–2020 నుంచి 35వేలకుపైగా వన్యప్రాణుల జాతులు, 5,495 జాతుల ఉభయ చరాలు, పక్షులు, చేపలు, క్షీరదాలు, సరీసృపాలు అంతరించిపోయాయి.   – సాక్షి, అమరావతి

అమెజాన్‌ రెయిన్‌ ఫారెస్ట్‌లోనే ఎక్కువ
రెండువేల చెట్లు, 800 జంతుజాతులకు నిలయమైన అమెజాన్‌ రెయిన్‌ఫారెస్ట్‌లో వన్యప్రాణులు అంతరించిపోతున్నాయి. వేట కారణంగా పెద్ద పండ్లను తినే జంతువులను కోల్పోవడంతో, పెద్ద విత్తనాల వ్యాప్తి గణనీయంగా తగ్గిపోయింది. పగడపు దిబ్బల వంటి అత్యంత విలువైన పర్యావరణ వ్యవస్థల్లో కొన్నింటిని కోల్పోవడం ప్రపంచాన్ని ప్రమాదంలోకి నెడుతోందని డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌ ఆందోళన వ్యక్తం చేసింది. 

సముద్ర జీవ వైవిధ్యం, తీర ప్రాంత రక్షణలకు పగడపు దిబ్బ­లు అవసరమని అభిప్రాయపడింది. గ్రీన్‌ ల్యాండ్, వెస్ట్‌ అంటార్కిటిక్‌లో మంచు పలకలు కరగడంతో పెద్ద ఎత్తున మీథేన్, కార్బన్‌ ఉద్గారాలు పెరిగేందుకు కారణమవుతోందని తెలిపింది.

భారత్‌లో రాబందులు 
భారతదేశంలో మూడు రాబందు జాతులు అంతరించపోవడం నివేదిక ప్రమాదంగా భావిస్తోంది. గడిచిన రెండు దశాబ్దాల్లోనే వైట్‌–రంప్డ్‌ వల్చర్‌ (తెల్ల రాబందు) 67శాతం, ఇండియన్‌ రాబందు 48శాతం,­ స్లెండర్‌–బిల్డ్‌ రాబందు (హిమాలయన్‌ రాబందు) 89 శాతం అంతరించినట్టు నివేదిక పేర్కొంది. వీటిని రక్షించడానికి, పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడానికి పరిరక్షణ చర్యలు చేపట్టాలని హెచ్చరిస్తోంది. దేశంలో వన్యప్రాణులు అంతరించిపోతున్నా, కొన్ని ప్రాంతాల్లోని జీవజాతులను రక్షించడం, పునరుద్ధరించడంలో ప్రభుత్వ కార్యక్రమాలు చురుగ్గా ఉన్నట్టు నివేదిక చెబుతోంది.

అడవి పులులకు నిలయంగా భారత్‌ 
భారత్‌ ప్రపంచ వ్యాప్తంగా అడవి పులుల అత్యధిక జనాభాకు నిలయంగా ఉంది. ఆల్‌–ఇండియా టైగర్‌ ఎస్టిమేషన్‌ 2022 అంచనా ప్రకారం 3,682 పులులు ఉన్నట్టు తే ల్చింది. అలాగే మొట్టమొదటి మంచు చిరుత జనాభా అంచనానూ ప్రారంభించింది. ప్రస్తుతం దేశంలో 718 మంచు చిరుతలను గుర్తించింది.  

ఆహార భద్రత ముప్పు 
జీవవైవిధ్య నష్టం, వాతావరణ సవాళ్ల కారణంగా 73.5 కోట్ల మంది ప్రజలు ప్రతి రాత్రి ఆకలితో పడుకుంటున్నారు. 90 శాతా­నికి పైగా పంట రకాలు కనుమరుగయ్యాయి. కేవలం 10 పంటలు (బార్లీ, సరుగుడు, మొక్కజొన్న, ఆయిల్‌ పామ్, వరి, జొన్న, సోయాబీన్, చెరకు, గోధుమలు, రాప్‌సీడ్‌) ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 83శాతం ఆహారాన్ని అందిస్తున్నాయి. 

మత్స్య సంపద నుంచి సంవత్సరానికి సుమారు 9 కోట్ల టన్నుల సీఫుడ్‌ అందుతోంది. ఇది 300 కోట్ల మందికి పైగా ప్రజలకు అవసరం. అయితే 37.7శాతం అధికంగా చేపలు పట్టడం వల్ల చేపల జనాభా క్షీణత, పగడపు దిబ్బలు దెబ్బతింటున్నాయి.  

ప్రపంచవ్యాప్తంగా 1970–2020 వరకు వివిధ దేశాల్లో అంతరించిన వన్యప్రాణులు, ఉభయచరాలు, పక్షులు, చేపలు, క్షీరదాల జాబితా..
» లాటిన్‌ అమెరికా, కరేబియన్‌ దీవుల్లో95%
» ఆఫ్రికాలో 76%
» ఆసియా–పసిఫిక్‌ ప్రాంతంలో60%
» యూరప్‌లో మధ్యస్తంగా మధ్య ఆసియాలో 35%
» ఉత్తర అమెరికాలో39%

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
India
vultures
Wild Life
Report
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

జపాన్‌తో కాలానుగుణ ఒప్పందాలు

జపాన్‌తో కాలానుగుణ ఒప్పందాలు

జోరు కొనసాగించాలని... 

జోరు కొనసాగించాలని... 

భారత్‌తో అమెరికా రూ.4,560 కోట్ల డీల్‌ 

భారత్‌తో అమెరికా రూ.4,560 కోట్ల డీల్‌ 

నేతలు జంప్.. ఇది ఫిరాయింపుల తుపాన్‌.. ఏం జరుగుతోంది?

నేతలు జంప్.. ఇది ఫిరాయింపుల తుపాన్‌.. ఏం జరుగుతోంది?

భారత్‌కు సొంత ‘డీప్‌సీక్‌’ ఉండాలి

భారత్‌కు సొంత ‘డీప్‌సీక్‌’ ఉండాలి

సౌత్ ఆఫ్రికాకు ఇండియా కార్లు!

సౌత్ ఆఫ్రికాకు ఇండియా కార్లు!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.