ఆగ్రా: తాజ్‌మహల్ సందర్శించడానికి వెళ్లిన ఒకతను తన వెంట పెంపుడు కుక్కను కూడా తీసుకెళ్లి కారులోనే వదిలి వెళ్లడంతో ఆ వేడికి ఊపిరాడక చనిపోయిన సంఘటన ఆగ్రాలో చోటు చేసుకుంది.
వేసవి సెలవుల్లో హర్యానా నుండి తాజ్‌మహల్‌ని సందర్శించడానికి వెళ్లిన ఒక పెద్దమనిషి కార్లో తనతో పాటు తన పెంపుడు కుక్కను కూడా తీసుకుని వెళ్ళాడు. తాజ్‌మహల్ అందాలను ఆస్వాదించే సమయంలో అడ్డుగా ఈ శునకం ఎందుకు అనుకున్నాడో ఏమో పాపం ఆ మూగ జీవిని కారులోనే బంధించి పార్కింగ్ చేసి వెళ్ళిపోయాడు.
ఆ వ్యక్తి తాజ్‌మహల్ అందాలను తనివితీరా ఆస్వాదించి తిరిగొచ్చి చూసే సరికి కారులో తన పెంపుడు కుక్క విగతజీవిగా కనిపించింది. కారులో బంధించిన ఆ కుక్క గంటల తరబడి పార్కింగ్‌లో ఎండ వేడిమికి తట్టుకోలేక ఊపిరాడక చనిపోయింది. భగభగ మండే ఎండలను మనుషులే తట్టుకోలేకపోతుంటే పాపం ఆ మూగజీవం ఏం భరిస్తుంది? వేసవితాపానికి విలవిలలాడి ప్రాణాలు విడిచింది.
ఈ సంఘటన తాలూకు హృదయవిదారకమైన వీడియోని ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఒకాయన.. పెంపుడు జంతువులను చేరదీయడం చేతకాకపొతే వాటిని పెంచుకునే ప్రయత్నం చేయకండి అని హితవు పలికాడు.
A dog died due to heat and suffocation as his owners left him in their parked car to visit Taj Mahal.
If you can’t treat your pets properly then don’t adopt them.
https://t.co/4ZI7iMj6n1— Rishi Bagree (@rishibagree) July 3, 2023
ఇది కూడా చదవండి: టైటాన్ విషాదం: నా భర్త, బిడ్డ చివరి రోజులు తలచుకుంటే..