Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. National
  3. పని చేసేవారు ఒకరు.. లాభపడేవారు మరొకరు
ADVERTISEMENT 

పని చేసేవారు ఒకరు.. లాభపడేవారు మరొకరు

National Sakshi User Sakshi Sakshi Time Nov 19, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
dkshivakumar.jpg
నవంబర్‌ 20.. కర్ణాటక రాజకీయాల్లో కీలక దినంగా మారనుందా?. కాంగ్రెస్‌ ప్రభుత్వం సగం ఏడాది పూర్తి చేసుకుంటున్న తరుణంలో.. నాయకత్వ మార్పు ఉంటుందా? లేదా? అనే చర్చ జోరుగా నడుస్తోంది. ఈ దరిమిలా డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ ఏమైనా సంచలన ప్రకటన చేస్తారా? అని రాజకీయ వర్గాలు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నాయి. 
 
నాయకత్వ మార్పు ప్రచారంపై డీకే శివకుమార్‌ ఎప్పటికప్పుడు తీవ్ర అసహనం‍ వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. తాను కరడుగట్టిన.. నిబద్ధత కలిగిన కాంగ్రెస్‌ కార్యకర్తనని చెబుతూనే.. కష్టపడి వాళ్లకు, త్యాగాలు చేసేవాళ్లకు ఆశలు ఉండడం సహజమంటూ ప్రకటనలు ఇస్తూ వస్తున్నారాయన. అయితే సీఎం మార్పు సంగతి ఏమోగానీ.. ఈలోపే డీకే శివకుమార్‌ మరో బాంబ్‌ పేల్చారు. టీపీసీసీ చీఫ్‌ పదవి నుంచి తప్పుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. ఇవాళ ఇందిరా గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఆయన ఆసక్తికర వ్యాఖ్యలే చేశారు. 
 
మనుషులు రెండు రకాలు ఉంటారు. ఒకరు పని చేస్తే.. మరొకరు లాభపడుతుంటారు. మొదటి రకంగా ఉండాలంటూ కాంగ్రెస్‌ కార్యకర్తలకు దివంగత ఇందిరా గాంధీ పిలుపు ఇస్తూ ఉండేవారు. పీసీసీ చీఫ్‌గా ఐదున్నరేళ్లు పూర్తి చేసుకున్నా. అలాగని శాశ్వతంగా ఆ పదవిలో కొనసాగలేను. మరొకరికి ఆ అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే కార్యకర్తలకు ఒక నాయకుడిగా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాను అని వ్యాఖ్యానించారాయన. 
 
ఇదిలా ఉంటే.. తాజాగా ఢిల్లీ పర్యటనలో పీసీసీ చీఫ్‌ పదవికి రాజీనామా చేస్తారనే ప్రచారాన్ని డీకే శివకుమార్‌ తోసిపుచ్చారు. అలాంటిదేం ఉండబోదని.. వచ్చే అసెంబ్లీ ఎన్నికలదాకా తానే ఆ పదవిలో ఉంటానని.. పార్టీని గెలిపించుకుని మళ్లీ అధికారంలోకి తీసుకొస్తానని వ్యాఖ్యానించారు. ఆ వెంటనే సిద్ధరామయ్య ఢిల్లీకి వెళ్లి అధిష్టానాన్ని కలిసి వచ్చారు. ఏం జరిగిందో తెలియదుగానీ.. ఇవాళ ఆ పదవి నుంచి తప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నానంటూ డీకే శివకుమార్‌ ప్రకటించడం గమనార్హం. 
 
2026 మార్చికి  శివకుమార్‌ పీసీసీ పదవీకాలం ఆరేళ్లు పూర్తి కానుంది.  అయితే.. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అనుచరులు కొత్త పీసీసీ చీఫ్‌ను చాలాకాలంగా డిమాండ్‌ చేస్తున్నారు. ఈ రేసులో సతీష్‌ జర్కీహోళీ, మంత్రి ఈశ్వర ఖాంద్రే పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. ఈ అంశంపై రేపు(గురువారం) స్పష్టమైన ప్రకటన ఉంటుందని మాజీ ఎంపీ డీకే సురేష్‌ చెబుతున్నారు. ఇంకోపక్క.. డీకే శివకుమార్‌ వర్గీయుడు ఎమ్మెల్యే హచ్‌డీ రంగనాథ్‌ సిద్ధరామయ్య ప్రభుత్వం బాగా పని చేస్తోందని.. అంతా సవ్యంగానే ఉందంటూ వ్యాఖ్యానించడంతో నాయకత్వ మార్పు ఉండకపోవచ్చనే కాంగ్రెస్‌ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. 

2023 మే నెలలో కర్ణాటకలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుదీరింది. ఆ సమయంలో సీఎం సీటు కోసం సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ మధ్య గట్టి పోటీ నెలకొంది. అయితే.. పవర్‌ షేరింగ్‌ ఫార్ములా కింద వీళ్లిద్దరినీ కాంగ్రెస్‌ అధిష్టానం ఒప్పించిందని.. చెరో రెండున్నరేళ్లు సీఎంలుగా ఉంటారనే ప్రచారం నడిచింది(ఇద్దరూ దానిని ఖండించారు కూడా). అదే సమయంలో.. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టాక పీసీసీ చీఫ్‌ పదవి నుంచి తప్పుకునేందుకు డీకే శివకుమార్‌ సిద్ధపడ్డారు. అయితే.. ఖర్గే, రాహుల్‌ గాంధీ వద్దని సూచించడంతో ఆ పదవిలో కొనసాగుతూ వచ్చారు. మరోపక్క లోక్‌సభ  ఎన్నికల దాకా డీకేనే పీసీసీ చీఫ్‌గా కొనసాగుతారని పార్టీ జాతీయ కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ప్రకటించారు. 
ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
DK Shivakumar
karnataka
siddaramaiah
CM post
Congress Party
pcc chief
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

పాలు నచ్చకపోతే తాగొద్దు.. రీల్స్‌ ఎందుకు?

పాలు నచ్చకపోతే తాగొద్దు.. రీల్స్‌ ఎందుకు?

NEET ఎగ్జామ్‌ మిస్‌.. విద్యార్థుల కన్నీళ్లు.. తప్పెవరిది?

NEET ఎగ్జామ్‌ మిస్‌.. విద్యార్థుల కన్నీళ్లు.. తప్పెవరిది?

ప్రకాశ్ రాజ్ కు షాక్.. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ

ప్రకాశ్ రాజ్ కు షాక్.. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ

కాంగ్రెస్‌లో మళ్లీ ‘థరూర్‌’ మంటలు

కాంగ్రెస్‌లో మళ్లీ ‘థరూర్‌’ మంటలు

‘యూజ్‌లెస్‌ ఫెలోస్‌.. మీ సంగతి తేలుస్తా’

‘యూజ్‌లెస్‌ ఫెలోస్‌.. మీ సంగతి తేలుస్తా’

కర్ణాటక రాజకీయాల్లో బిగ్‌ ట్విస్ట్‌..

కర్ణాటక రాజకీయాల్లో బిగ్‌ ట్విస్ట్‌..

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.