Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. National
  3. శతాబ్దాల నాటి గాయాలు మానాయి
ADVERTISEMENT 

శతాబ్దాల నాటి గాయాలు మానాయి

National Sakshi User Sakshi Sakshi Time Nov 26, 2025 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
MODI.jpg

ధ్వజారోహణ తర్వాత ప్రధాని మోదీ ఉద్ఘాటన

అయోధ్య: ఐదు వందల సంవత్సరాల రామమందిర సాధనా సమరంలో భారతీయులకు తగిలిన గాయాలు నేడు ఆలయ నిర్మాణంతో మానిపోయాయని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. మంగళవారం భవ్యరామ మందిర ప్రధాన శిఖరంపై ధర్మ ధ్వజాన్ని ఆవిష్కరించిన సందర్భంగా శ్రీరామ జన్మభూమి ఆలయ కాంప్లెక్స్‌లో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో వేలాది మంది భక్తులనుద్దేశిస్తూ ప్రధాని ప్రసంగించారు. జైశ్రీరాం నినాదంతో తన ప్రసంగాన్ని ఆరంభించారు ‘‘ నేడు భారత్‌సహా యావత్‌ ప్రపంచం రామస్మరణ చేస్తోంది. ఆలయ నిర్మాణం సంపూర్ణమవడంతో భారతీయుల శతాబ్దాల నాటి గాయాలు నేటితో మానిపోయాయి. భక్తుల వందల ఏళ్ల బాధాగ్ని చల్లారింది. ఇప్పుడు ప్రతి ఒక్క రామభక్తుడి మదిలో అనిర్వచనీయ ఆనందం ఉప్పొంగుతోంది.

ధ్వజారోహణం నిజంగా అపూర్వం, అనిర్వచనీయ ఆధ్యాత్మిక ఘటన. కాషాయ జెండాలో సూర్యవంశ కీర్తి దాగిఉంది. కోవిద వృక్షం రామరాజ్య వైభవాన్ని చాటుతోంది. ఇది కేవలం మతసంబంధ జెండా కాదు. భారతీయ నాగరికతా జెండా. ఇది భారతీయ సాంస్కృతిక పునరుజ్జీవనోద్యమ జెండా అసత్యాలపై సత్యం విజయం శాశ్వతమని సగర్వంగా అంతెత్తున నిలిచి చాటిచెప్పే జెండా ఇది. ఆలయ నిర్మాణానికి అవిశ్రాంత కృషిచేసి తమ వంతు సాయమందించిన ప్రతి ఒక్క రామభక్తునికి నా మనస్ఫూరక కృతజ్ఞతలు. ఆనాడు శ్రీరాముడు అయోధ్యను యువరాజుగా వదిలివెళ్లాడు. తిరిగొచ్చేటప్పుడు మర్యాద పురుషోత్తమునిగా ఎదిగి వచ్చాడు.

వశిష్టుడు వంటి రుషుల జ్ఞానసంపద, గురువుల మార్గనిర్దేశనం, నిశదరాజు వంటి స్నేహితుల సాంగత్యం, శబరి అవ్యాజమైన భక్తి, హనుమంతుని అచంచల భక్తి ఇలా అందరూ ఆ దశరథ తనయుడిని సర్వగుణసంపన్నుడిగా తీర్చిదిద్దారు. భారత్‌ అభివృద్ధి చెందిన భారత్‌గా ఎదగాలంటే సమాజంలోనూ ఇలాంటి సమష్టి కృషి అవసరం. ప్రస్తుత తరాలకే కాదు భావితరాల అవసరాలు తీర్చేలా భారత్‌ పునర్‌నిర్మాణం జరగాలి. ఈరోజు గురించి మాత్రమే ఆలోచిస్తే భవిష్యత్‌ తరాలకు అన్యాయం చేసినట్లే.  2047నాటికి అభివృద్ధి చెందిన భారత్‌గా ఎదిగే క్రమంలో రాముడు సైతం మనకు అండగా నిలబడ్డాడని అనిపిస్తోంది. రాముడు కేవలం ఒక వ్యక్తి కాదు. క్రమశిక్షణ, దార్శనికత, విలువలు మూర్తీభవించిన శక్తి’’ అని మోదీ అన్నారు.

మార్పు తరుణం ఆసన్నమైంది...
‘‘ఆధునిక నాగరిక సమాజంలో భారత్‌ ఇకపై తనదైన గుర్తింపును సాధించాల్సిన తరుణం ఆసన్నమైంది. బానస మనస్తత్వాన్ని భారత్‌ వదిలించుకోవాలి. 190 ఏళ్ల క్రితం మనలో మెకాలే ఒక బానిస మనస్తత్వ విషబీజాలను విజయవంతంగా నాటి విస్తృతపరిచాడు. భారతీయ సమాజ విలువల్ని కూకటివేళ్లతో పెకలించే కుట్ర అది. మనం బ్రిటిషర్ల నుంచి స్వాతంత్య్రమైతే సాధించాంగానీ బానిసత్వపు ఆలోచనల నుంచి స్వాతంత్య్రం సాధించలేకపోయాం. ఇకనైనా వచ్చే పదేళ్లలోపు ఈ మానసిక బానిసత్వపు బంధనాలను తెంచుకుందాం.

విదేశాల తరహాలో ప్రజాస్వామ్యం కోసం భారత్‌ పోరాడిందన్న వలసపాలకుల వాదనల్లో నిజం లేదు. ప్రజాస్వామ్యం అనేది వేల సంవత్సరాల క్రితమే భారతీయ డీఎన్‌ఏలో నిక్షిప్తమై ఉంది. తమిళనాడులోని 1,000 సంవత్సరాల క్రితంనాటి ఉత్తర మేరూర్‌ గ్రామ శాసనంలో ప్రజాస్వామ్య ప్రస్తావన ఉంది. వలసపాలకులు మన జాతీయ గుర్తులను సైతం ప్రభావితంచేశారు. పరాయి పాలనకు చరమగీతం పాడుతూ ఇటీవలే నేవీ చిహ్నాన్ని సైతం రీడిజైన్‌ చేశాం. ఇది డిజైన్‌ మార్పు మాత్రమేకాదు ఆలోచనా మార్పు’’ అని మోదీ అన్నారు.

అభివృద్ధి ధర్మాన్ని ప్రబోధిస్తోంది...
‘‘త్రేతాయుగంలోనే అయోధ్య మానవాళికి నైతిక విలువల్ని ప్రసాదించింది. ఇప్పుడు 21వ శతాబ్దంలో అంతర్జాతీయ విమానాశ్రయం, అధునాతన రైల్వేస్టేషన్, అనుసంధానతతో అదే అయోధ్య మనకు అభివృద్ధి ధర్మాన్ని ప్రబోధిస్తోంది. నేడు అయోధ్య ప్రాచీనత, ఆధునికతల కలబోతగా కొత్త కళను సంతరించుకుంది. భవిష్యత్తులోనూ పురాతన, నూతనత్వాల సంగమ స్థిలిగా భాసిల్లుతుంది. ఇక్కడి సరయూ జలాల్లో అమృతంతోపాటు అభివృద్ది కలిసి ప్రవహిస్తాయి. ప్రాణప్రతిష్ట పనులు ఆరంభమైన నాటి నుంచి ఇప్పటిదాకా అయోధ్యను 45 కోట్లమంది దేశ, విదేశీ భక్తులు సందర్శించారు. ఇది ఆర్థిక రూపాంతరీకరణకు నిదర్శనం’’ అని మోదీ అన్నారు.

వాళ్ల ఆత్మలకు శాంతి: భాగవత్‌
అయోధ్య రామాలయం కోసం తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టిన వాళ్ల ఆత్మలు ఇప్పుడు శాంతిస్తాయని ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ వ్యాఖ్యానించారు. ‘‘అవిశ్రాంత పోరాటం, అలుపెరగని కృషి, లెక్కలేని త్యాగాలకు నేడు సార్థకత చేకూరింది. ఈ రోజు మనకెంతో ప్రత్యేకం. అశోక్‌ సింఘాల్, మహంత్‌ రామచంద్ర దాస్, దాల్మియా, వేలాది మంది రుషులు, లక్షలాది కుటుంబాలు, విద్యార్థులు, ఎంతో మంది భక్తుల త్యాగాలకు ఫలితం లభించింది. ఈ మధుర ఘట్టాన్ని చూడాలని పరితపించిన వాళ్ల కల నెరవేరింది. జెండాను మాత్రమే కాదు మరెన్నో ప్రాథమిక విలువలను మరింత ఎత్తులో నిలబెట్టాం. వ్యక్తులు, కుటుంబం మొదలు దేశం, ప్రపంచం దాకా ఈ విలువలే అందరికీ దిశానిర్దేశంచేస్తాయి. అందరి సంక్షేమాన్ని కాంక్షించడమే ధర్మం. కాషాయ రంగు ధర్మానికి గుర్తు. అందుకే ఇది ధర్మధ్వజం అయింది’’ అని అన్నారు.

కొత్త అధ్యాయానికి ఆరంభం: యోగి
‘‘ధర్మధ్వజారోహణతో ధర్మమనేది కాంతి ఇకపై నేల నలుచెరుగులా వ్యాపించనుంది. ఇది కొత్తఅధ్యాయానికి అంకురార్పణ’’ అని ఉత్తర ప్రదేశ్‌ సీఎం యోగి అన్నారు. 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Ram mandir in Ayodhya
temple construction
Narendra Modi
Ayodhya
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఇక ఎన్డీఏ వేదిక 'మంగళ్ మిలన్’!

ఇక ఎన్డీఏ వేదిక 'మంగళ్ మిలన్’!

అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభం.. మోదీ ఐదు సంకల్పాలు ఇవే..

అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభం.. మోదీ ఐదు సంకల్పాలు ఇవే..

అగ్నిప్రమాదంపై ప్రధాని విచారం.. ఎక్స్‌గ్రేషియా ప్రకటన

అగ్నిప్రమాదంపై ప్రధాని విచారం.. ఎక్స్‌గ్రేషియా ప్రకటన

మీరు గొప్పనేత ఎప్పుడౌతారో ఏమో!

మీరు గొప్పనేత ఎప్పుడౌతారో ఏమో!

అజేయంగా మన సముద్ర శక్తి

అజేయంగా మన సముద్ర శక్తి

యోగాతో ప్రపంచ శాంతి 

యోగాతో ప్రపంచ శాంతి 

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.