Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. National
  3. దేశమంతా ‘క్లీన్‌ అండ్‌ గ్రీన్‌’
ADVERTISEMENT

దేశమంతా ‘క్లీన్‌ అండ్‌ గ్రీన్‌’

National Sakshi User Sakshi Sakshi Time Dec 21, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
pr.jpg

పల్లెల్లో స్వతంత్ర పారిశుధ్య పథకాన్ని అమలు చేయాలి

పేద రాష్ట్రాలకు అదనంగా ఆర్ధిక సాయం అందించాలి

ఇందుకోసం క్లీన్‌ విలేజ్‌ ఫండ్‌ ఏర్పాటు చేయాలి

కేంద్రానికి పంచాయతీరాజ్‌ పార్లమెంటరీ కమిటీ సిఫార్సులు

సాక్షి, న్యూఢిల్లీ: గ్రామీణ ప్రాంతాల్లో పారి శుధ్య నిర్వహణ, మొక్కల పెంపకం, సమృధ్ధిగా తాగునీరు, ఆహార భద్రత అందించే లక్ష్యంతో కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ తీసు కొచ్చిన ‘క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ విలేజ్‌’కార్యక్రమాన్ని దేశ వ్యాప్తంగా అమలు చేయాలని పంచాయతీరాజ్‌ శాఖను చూసే పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ సిఫార్సు చేసింది.

 గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్యకర వాతావరణాన్ని సృష్టించడంతో పాటు సామాజిక, ఆర్ధిక వృద్ధికి ఉద్దేశించిన ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా కేంద్రం ఎటువంటి పథకాన్ని అమలు చేయనందున కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ కార్యక్రమాలు అమలవుతున్నా యని తెలిపింది. నిధుల లేమి కారణంగా కొన్ని రాష్ట్రాలు దీనిని పక్కనబెట్టాయంది. ఇటువంటి రాష్ట్రాల కోసం ప్రత్యేక ప్యాకేజీని కేంద్రం అందించాల్సిన అవసరముందని సూచించింది.

నిధులు, శిక్షణ, అవగాహన కీలకం
లోక్‌సభ ఎంపీ సప్తగిరి శంకర్‌ ఉలకా నేతృత్వంలోని స్టాండింగ్‌ కమిటీ ఇటీవలి శీతాకాల సమావేశాల్లో తన 23వ నివేదికను పార్లమెంట్‌కు సమర్పించింది. రాష్ట్రీయ గ్రామ స్వరాజ్‌ అభియాన్‌ కింద ఎన్నికైన ప్రతినిధులు, సంబంధీకులు, పంచాయతీ కార్యకర్తలకు క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ విలేజ్‌పై సవివర ప్రణాళికలను సిద్ధం చేయడానికి కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ శిక్షణ అందించిందని నివేదిక గుర్తు చేసింది. ఈ శిక్షణతో 99వేల పంచాయతీలు ఈ కార్యక్రమంపై అవగాహ న ఏర్పడిందని తెలిపింది. 

గ్రామాల్లో సామా జిక, ఆర్థిక అభివృద్ధిని వేగవంతం చేసే సామర్థ్యం ‘క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ విలేజ్‌‘కు ఉన్నప్ప టికీ అమలులో అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని పేర్కొంది. కేంద్రం ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి నిధులను అందించని కార ణంగా దేశవ్యాప్తంగా అమలు పురోగతి ఏకరీ తిన లేని విషయాన్ని గుర్తించినట్లు పార్లమెంటరీ కమిటీ తెలిపింది. 

క్షేత్రస్థాయిలో తగు శిక్షణ అందిస్తున్నా, అమలు విషయంలో సమస్యలు ఎదురవుతున్నారని, ముఖ్యంగా స్థానికుల ప్రమేయం చాలా తక్కువగా ఉంటోందని గుర్తించింది. గ్రామాల్లో స్వచ్ఛభా రత్‌ మిషన్‌ కొనసాగుతున్నా.. వ్యర్థాల నిర్వ హణ, కంపోస్టింగ్‌ మౌలిక సదుపాయాలు, చిన్న తరహా నీటి సంరక్షణ కార్యక్రమాలు వంటి పర్యావరణ సంబంధిత పనుల అమలుకు పంచాయతీలు ఆర్థిక వనరులతో సన్నద్ధంగా లేవని కమిటీ గుర్తించింది. 

ఈ నేపథ్యంలో పలు తక్షణ చర్యలు చేపట్టాలని కేంద్రానికి సూచించింది. ‘క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ విలేజ్‌’అమలులో సమానత్వాన్ని కొనసాగించేందుకు, పేద రాష్ట్రాలకు అదనపు ఆర్థిక సహాయాన్ని అందించేందుకు వీలుగా తగిన నిధులు, స్పష్టమైన మార్గదర్శకాలతో కేంద్ర పంచాయతీరాజ శాఖ స్వతంత్ర పారిశుధ్య పథకాన్ని ప్రారంభించాలని సిఫార్సు చేసింది. ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని, స్థానికులు చురుకుగా పాల్గొనేలా ప్రేరేపించడానికి ప్రత్యేక అవగాహన, ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని తెలిపింది. 

ఇంటింటి ప్రచారం, వాల్‌ ఆర్ట్, టాయిలెట్ల పరిశుభ్రతపై స్థానిక జానపద మీడియా వినియోగం, గృహాలు, బహిరంగ ప్రదేశాలు, సంస్థలలో చెత్తబుట్టల వాడకం వంటి భారీ కార్యకలాపాలకు వీలుగా పూర్తిస్థాయి ‘క్లీన్‌ విలేజ్‌ ఫండ్‌‘ను ఏర్పాటు చేయాలని సూచించింది. నిర్మించిన మరుగుదొడ్ల వినియోగాన్ని పర్యవేక్షించే చర్యలు చేపడట్టడంతో పాటు పురోగతిని ట్రాక్‌ చేయడానికి, అంతరాలను గుర్తించేందుకు ఈ–గ్రామ్‌స్వరాజ్‌తో పారిశుధ్య డాష్‌బోర్డ్‌ను అనుసంధానించాలని తెలిపింది. వంటింట్లో స్వచ్ఛ ఇంధనం ఉపయోగించేలా ప్రజల్లో మార్పు తెచ్చేందుకు స్వయం సహాయక సంఘాల సేవలను వాడుకోవా లని కమిటీ సిఫార్సు చేసింది.  
 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
rural areas
Sanitation management
tree plantation
Clean and Green
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

2028 వరకు జల్‌జీవన్‌ మిషన్‌

2028 వరకు జల్‌జీవన్‌ మిషన్‌

సామాన్యుడి చేతిలో సమస్తం!

సామాన్యుడి చేతిలో సమస్తం!

చెట్లకు ఊపిరి పోశాడు

చెట్లకు ఊపిరి పోశాడు

చెట్ల అవ్వ వెళ్ళిపోయింది

చెట్ల అవ్వ వెళ్ళిపోయింది

ఐదేళ్లు.. 3.63 లక్షల కిడ్నీ కేసులు

ఐదేళ్లు.. 3.63 లక్షల కిడ్నీ కేసులు

ఈ కష్టాలను తీర్చే దారి లేదా?

ఈ కష్టాలను తీర్చే దారి లేదా?

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.