Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. National
  3. సీబీఎస్‌ఈ టెండర్‌లో సంచలన ట్విస్టులు?
ADVERTISEMENT 

సీబీఎస్‌ఈ టెండర్‌లో సంచలన ట్విస్టులు?

National Sakshi User Sakshi Sakshi Time May 30, 2026 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
CBSE_Tender_News.jpg

న్యూఢిల్లీ: దాదాపు 17 లక్షల మంది సీబీఎస్‌ఈ విద్యార్థుల జవాబు పత్రాల స్కానింగ్‌.. డిజిటల్‌ మూల్యాంకన బాధ్యతలు చేపట్టిన సంస్థ ఎంపిక వెనుక అసలు ఏమి జరిగింది? టెండర్‌ నిబంధనలు ఎందుకు పదేపదే మారాయి? ఒకసారి అనర్హత పొందిన సంస్థ చేతికే మళ్లీ ఎలా వెళ్లాయి? ఒక విద్యార్థి చేసిన పరిశోధన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆ వివరాలు విద్యా వర్గాలతో పాటు ప్రభుత్వ వర్గాల్లోనూ ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి.

2025-26 విద్యాసంవత్సరంలో సీబీఎస్‌ఈ తొలిసారిగా భారీ స్థాయిలో ఆన్‌స్క్రీన్‌ మార్కింగ్‌ విధానాన్ని అమలు చేసింది. ఇందుకోసం లక్షలాది జవాబు పత్రాలను స్కాన్‌ చేసి డిజిటల్‌గా మూల్యాంకనం చేసే బాధ్యతను ఒక ప్రైవేట్‌ సంస్థకు అప్పగించింది. అయితే ఈ టెండర్‌ ప్రక్రియపై ఇప్పుడు తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

12వ తరగతి విద్యార్థి సార్థక్‌ చేసిన పరిశోధన ప్రకారం.. ఈ టెండర్‌ను చివరకు దక్కించుకున్న కోయెంప్ట్‌ ఎడ్యూటెక్‌ సంస్థ గతంలో గ్లోబరెనా టెక్నాలజీస్‌ పేరుతో పనిచేసింది. 2019 తెలంగాణ ఇంటర్మీడియట్‌ ఫలితాల వివాదంలో ఈ సంస్థ పేరు తీవ్రంగా వినిపించింది. అనంతరం సంస్థ పేరు మారి కోయెంప్ట్‌గా మారినట్లు సమాచారం.

అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ టెండర్‌ ఒకసారి కాదు, మూడుసార్లు జారీ కావడం. తొలి టెండర్‌ రికార్డులే అందుబాటులో లేకపోవడం, రెండో టెండర్‌లో పాల్గొన్న అన్ని కంపెనీలు సాంకేతిక అర్హతల్లో విఫలమవడం, ఆ తర్వాత మూడో టెండర్‌లో నిబంధనలు మారిన వెంటనే కోయెంప్ట్‌ విజేతగా నిలవడం ఇప్పుడు అనుమానాలకు తావిస్తోంది.

సీబీఎస్‌ఈ టెండర్ వివాదం: కీలక అంశాలు

🔹 17 లక్షల విద్యార్థుల జవాబు పత్రాల మూల్యాంకన టెండర్‌పై వివాదం

🔹 2019 తెలంగాణ ఇంటర్‌ ఫలితాల వివాదంతో వార్తల్లో నిలిచిన గ్లోబరెనా టెక్నాలజీస్‌ (ప్రస్తుత కోయెంప్ట్‌ ఎడుటెక్‌)కు కాంట్రాక్ట్

🔹 టెండర్‌ను మూడుసార్లు జారీ చేసిన సీబీఎస్‌ఈ

🔹 చివరి దశలో నిబంధనల మార్పుల తర్వాత కోయెంప్ట్‌కు టెండర్ దక్కినట్లు ఆరోపణలు

సార్థక్‌ జరిపిన విశ్లేషణ ప్రకారం.. రెండో టెండర్‌ నుంచి మూడో టెండర్‌కు వెళ్లే మధ్యకాలంలో అనేక కీలక నిబంధనలు సవరించబడ్డాయి. గతంలో బ్లాక్‌లిస్ట్‌ అయిన సంస్థలకు అడ్డుకట్ట వేసే షరతులు సడలించడం, సాఫ్ట్‌వేర్‌ నాణ్యత ప్రమాణాలను తగ్గించడం, డేటా సెంటర్‌ యాజమాన్యానికి సంబంధించిన నిబంధనలను తొలగించడం, అనుభవ ప్రమాణాలను మార్చడం వంటి చర్యలు చోటుచేసుకున్నాయని ఆ కుర్రాడు పేర్కొన్నాడు. అంతేకాదు, సిస్టమ్‌ విఫలమైతే సంస్థను భవిష్యత్‌లో బ్లాక్‌లిస్ట్‌ చేసే అధికారాన్ని కూడా చివరి దశలో తొలగించినట్లు ఆరోపించాడు.

జవాబు పత్రాల స్కానింగ్‌లో ఖచ్చితత్వానికి సంబంధించిన తప్పనిసరి ప్రమాణాలను సైతం సడలించారని సార్థక్‌ చెప్పడంతో.. ఈ మార్పులన్నీ ఒకే సంస్థకు అనుకూలంగా జరిగాయా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

టెండర్ రూల్స్‌లో మార్పులు

➡️ గతంలో బ్లాక్‌లిస్ట్ అయిన సంస్థలను అనర్హులుగా ప్రకటించే నిబంధన తొలగింపు

➡️ సాఫ్ట్‌వేర్ నాణ్యత ప్రమాణం CMMI Level-5 నుంచి Level-3కు తగ్గింపు

➡️ సొంత డేటా సెంటర్ తప్పనిసరి నిబంధన రద్దు

➡️ థర్డ్‌పార్టీ క్లౌడ్ హోస్టింగ్‌కు అనుమతి

➡️ స్కానింగ్ ఖచ్చితత్వానికి సంబంధించిన కఠిన ప్రమాణాల సడలింపు

➡️ CERT-In భద్రతా ఆడిట్ నిబంధన తొలగింపు

➡️ పొరపాట్లపై జరిమానాల బదులు ఆలస్యాలపై జరిమానాల విధానం

ఇటీవల సీబీఎస్‌ఈ రీవాల్యూయేషన్‌ పోర్టల్‌లో వెలుగుచూసిన సైబర్‌ భద్రతా లోపాలు, అనధికార యాక్సెస్‌ ఘటనలు ఈ వివాదానికి మరింత బలం చేకూర్చాయి. భద్రతా పరీక్షలు పూర్తయ్యాయా? లేదంటే నిబంధనలను పక్కనబెట్టి వ్యవస్థను అమల్లోకి తీసుకువచ్చారా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో టెండర్‌ ప్రక్రియపై సమగ్ర విచారణ జరపాలని, సీఏజీ ఆడిట్‌ నిర్వహించాలని, పార్లమెంట్‌లో చర్చ చేపట్టాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశం కావడంతో ఈ ఆరోపణలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

లేవనెత్తుతున్న ప్రశ్నలు

❓ నిబంధనలు మార్చాల్సిన అవసరం ఎందుకు వచ్చింది?

❓ మార్పుల వల్ల ఎవరు లబ్ధి పొందారు?

❓ భద్రతా ప్రమాణాలు ఎందుకు తగ్గించారు?

❓ తొలి టెండర్ వివరాలు ఎందుకు కనిపించడం లేదు?

❓ విద్యార్థుల డేటా భద్రతకు ఎలాంటి హామీ ఉంది?
 

అయితే ఇప్పటివరకు ఈ ఆరోపణలపై సీబీఎస్‌ఈ లేదా కోయెంప్ట్‌ ఎడ్యూటెక్‌ సంస్థ నుంచి అధికారిక వివరణ వెలువడలేదు. కానీ ఒక విద్యార్థి చేసిన ఈ పరిశోధన ఇప్పుడు దేశంలోని అతిపెద్ద విద్యా బోర్డుల్లో ఒకటైన సీబీఎస్‌ఈ టెండర్‌ ప్రక్రియపై కొత్త ప్రశ్నలను లేవనెత్తుతోంది. సమాధానాలు ఎప్పుడు వస్తాయన్నదే ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి రెకెత్తిస్తోంది.

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
CBSE
Tender Scam
Tenders
Telangana
Delhi
CBSE Row
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

ఇథనాల్‌ పెట్రోల్‌.. నాకు, నా కుటుంబానికి పైసా లాభం లేదు: గడ్కరీ

ఇథనాల్‌ పెట్రోల్‌.. నాకు, నా కుటుంబానికి పైసా లాభం లేదు: గడ్కరీ

 కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్‌ రిలీఫ్‌

కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్‌ రిలీఫ్‌

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.