Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
search Subscribe Subscribe Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ Live TV లైవ్ టీవీ
download app యాప్ download app Download App
మమ్మల్ని అనుసరించండి
  • facebook
  • x
  • instagram
  • youtube
  • whatsapp
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫొటోలు
  • వీడియోలు
  • close logo
  • search
    Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ download app యాప్

    విభాగాలు

  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • మమ్మల్ని అనుసరించండి

    facebook x instagram youtube whatsapp whatsapp whatsapp
  • Sakshi Search
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV

Breadcrumb

  1. Home
  2. National
  3. ఆసియా, కామన్వెల్త్ క్రీడల విజేతలకు కిట్-కిస్ ఘన సత్కారం
ADVERTISEMENT

ఆసియా, కామన్వెల్త్ క్రీడల విజేతలకు కిట్-కిస్ ఘన సత్కారం

National Sakshi User Sakshi Sakshi Time Oct 23, 2026 10:10 PM IST Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Google
students.jpg

చదువు, ఆటలు కలిసి సాగవన్న పాతకాలపు నమ్మకాన్ని పటాపంచలు చేస్తూ కిట్, కిస్ విద్యాసంస్థలు క్రీడా ప్రతిభకు అండగా నిలుస్తామని మరోసారి చాటిచెప్పాయి. హాంగ్‌జౌలో జరిగిన 19వ ఆసియా క్రీడలు, బర్మింగ్‌హామ్‌లో జరిగిన 22వ కామన్వెల్త్ క్రీడల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తమ విద్యార్థి క్రీడాకారులను ఘనంగా సత్కరించాయి. కిట్ ప్రాంగణంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో అంతర్జాతీయ వేదికపై అద్భుత ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు మొత్తం రూ.2.5 కోట్ల నగదు పురస్కారాలు అందజేశారు.

కిట్-కిస్ ఆధ్వర్యంలో శిక్షణ, ప్రోత్సాహం పొందిన క్రీడాకారులు అథ్లెటిక్స్, హాకీ, రగ్బీ, రోయింగ్ విభాగాల్లో కీలక పతకాలు సాధించి దేశానికి గర్వకారణంగా నిలిచారు. వీరి ప్రదర్శనతో జాతీయ క్రీడా పటంలో ఒడిశా ప్రాధాన్యం గణనీయంగా పెరిగి, పంజాబ్, హరియాణా, మహారాష్ట్ర వంటి క్రీడా దిగ్గజ రాష్ట్రాల సరసన నిలిచింది. భారత అంతర్జాతీయ క్రీడా విజయాల్లో సంస్థ పాత్ర నానాటికీ పెరుగుతోందనడానికి ఈ విజయాలే నిదర్శనం.

ఈ సత్కారం కేవలం పతకాలు, పోడియం స్థానాలకే పరిమితం కాలేదు. తీవ్రమైన సామాజిక, ఆర్థిక అవరోధాలను అధిగమించి అత్యున్నత స్థాయిలో పోటీపడిన యువ క్రీడాకారుల పట్టుదల, క్రమశిక్షణ, కృషికి ఇది పట్టం కట్టింది. వీరిలో చాలామంది గిరిజన, గ్రామీణ, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల నుంచి వచ్చినవారే. నాణ్యమైన విద్య, వృత్తిపరమైన శిక్షణ, ఆధునిక క్రీడా సౌకర్యాలు అందుబాటులో ఉంటే జీవితాలు ఎలా మారతాయో, ఛాంపియన్లు ఎలా తయారవుతారో వీరు నిరూపించారు.

ఈ సందర్భంగా కిట్, కిస్ వ్యవస్థాపకులు ప్రొఫెసర్ (డాక్టర్) అచ్యుత సామంత మాట్లాడుతూ, ఆత్మవిశ్వాసం, సామర్థ్యం, సామాజిక బాధ్యత కలిగిన వ్యక్తులను తీర్చిదిద్దడంలో విద్య, క్రీడలు పరస్పరం పూరకంగా ఉండాలన్న తన దృఢ విశ్వాసాన్ని పునరుద్ఘాటించారు. విద్యార్థులు చదువు, ఆటల్లో ఏదో ఒకదాన్నే ఎంచుకోవాలన్న సంప్రదాయ భావనను తిరస్కరిస్తూ, విద్యావకాశాలతో పాటు క్రమబద్ధమైన క్రీడా శిక్షణ, పోటీ అనుభవం అందించే సమగ్ర విధానాన్ని ఆయన మొదటి నుంచీ ప్రోత్సహిస్తున్నారు.

పురస్కారాల విధానం ప్రకారం ఆసియా క్రీడల్లో స్వర్ణ పతక విజేతలకు రూ.7 లక్షలు, రజత విజేతలకు రూ.5 లక్షలు, కాంస్య విజేతలకు రూ.3 లక్షలు అందజేశారు. కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణానికి రూ.5 లక్షలు, రజతానికి రూ.3 లక్షలు, కాంస్యానికి రూ.2 లక్షలు ఇచ్చారు. క్రీడల్లో పాల్గొని పతకాలు సాధించని క్రీడాకారులకు ఒక్కొక్కరికి రూ.1 లక్ష చొప్పున అందజేశారు. దేశ అంతర్జాతీయ ప్రాతినిధ్యానికి, భవిష్యత్ అవకాశాలకు దోహదపడేవారితో సహా మొత్తం క్రీడా బృందం కృషిని ఈ పురస్కారాలు గుర్తిస్తున్నాయి.

2028 లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించే ప్రతి క్రీడాకారుడికి రూ.1 కోటి ప్రోత్సాహకం అందజేస్తామని ప్రొఫెసర్ సామంత ప్రకటించారు. అంతర్జాతీయ క్రీడల్లో అత్యున్నత గౌరవాన్ని ఆశించే క్రీడాకారులకు అండగా నిలవాలన్న కిట్-కిస్ ఆకాంక్షకు ఈ ప్రకటన అద్దం పడుతోంది. రాబోయే జాతీయ, అంతర్జాతీయ పోటీలకు సిద్ధమవుతున్న క్రీడాకారులకు సంస్థ నుంచి నిరంతర సహకారం ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.

క్రీడా ప్రతిభ ఆర్థిక నేపథ్యం, భౌగోళిక ప్రాంతం, సామాజిక పరిస్థితులపై ఆధారపడదన్న సంస్థాగత సిద్ధాంతానికి కిట్-కిస్ క్రీడాకారుల విజయాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. శిక్షణ, పౌష్టికాహారం, వసతి, విద్య, తగిన మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉంటే అణగారిన వర్గాల యువత సైతం ప్రపంచ అత్యుత్తమ క్రీడాకారులతో పోటీపడగలరు. క్రీడలకు కిట్ ఇస్తున్న ప్రాధాన్యం, కిస్ సమ్మిళిత విద్యా విధానం కలిసి ప్రతిభావంతులైన విద్యార్థులు ఆటలోనూ, జీవితంలోనూ రాణించే అవకాశాలు కల్పిస్తున్నాయి.

ఒలింపిక్స్, ఇతర ప్రపంచ క్రీడా వేదికలపై భారత్ మరిన్ని విజయాలు ఆశిస్తున్న తరుణంలో, దేశ క్రీడా వ్యవస్థకు విద్యాసంస్థలు ఎలా దోహదపడగలవో కిట్-కిస్ నమూనా చక్కని ఉదాహరణగా నిలుస్తోంది. విజేతలకు బహుమతులు ఇవ్వడానికే పరిమితం కాకుండా, ప్రతిభను గుర్తించి, సామర్థ్యాన్ని పెంపొందించి, చదువుకు భంగం కలగకుండా దీర్ఘకాలిక క్రీడా జీవితాన్ని కొనసాగించేలా ఒక సమగ్ర సహాయ వ్యవస్థను నిర్మించడం ఈ విధానం ప్రత్యేకత.

 చదువుకుంటే అందలం, ఆటలాడితే అధోగతి అన్న పాత నానుడికి కాలం చెల్లిందని ఈ కార్యక్రమం స్పష్టమైన సందేశం ఇచ్చింది. విద్య, క్రీడలపై నిరంతర పెట్టుబడి ద్వారా ఈ రెండూ కలిసి ఛాంపియన్లనే కాదు, ఆత్మవిశ్వాసం, సాధికారత కలిగిన పౌరులనూ తయారుచేయగలవని కిట్, కిస్ నిరూపిస్తున్నాయి.  తరగతి గదుల నుంచి అంతర్జాతీయ వేదికల వరకు... అవకాశాలను విజయాలుగా, ఆకాంక్షలను అత్యున్నత ప్రతిభగా మలచుకోవడంలో యువ భారతానికి కిట్-కిస్ బాసటగా నిలుస్తోంది.

ADVERTISEMENT
ADVERTISEMENT
tags Tags:
medals
common wealth
prize money
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

'ద ట్రైటర్స్' విజేతగా శ్రావ్య-స్వీకర్.. ఎన్ని లక్షలు గెలుచుకున్నారంటే?

'ద ట్రైటర్స్' విజేతగా శ్రావ్య-స్వీకర్.. ఎన్ని లక్షలు గెలుచుకున్నారంటే?

స్వర్ణంతో బోణీ

స్వర్ణంతో బోణీ

30 స్వర్ణాలు... 35 రజతాలు... 49 కాంస్యాలు

30 స్వర్ణాలు... 35 రజతాలు... 49 కాంస్యాలు

ఈ నెల 13న క్రీడా శాఖ సమీక్ష

ఈ నెల 13న క్రీడా శాఖ సమీక్ష

ఆసియా క్రీడలకు గ్రాండ్ ఫినిష్.. 85 పతకాలతో భారత్ కు నాలుగో స్థానం

ఆసియా క్రీడలకు గ్రాండ్ ఫినిష్.. 85 పతకాలతో భారత్ కు నాలుగో స్థానం

మరింత మెరుగైతేనే!

మరింత మెరుగైతేనే!

మరిన్ని వార్తలు

ఫలితమివ్వని గ్రీన్ క్రాకర్స్‌.. టైమ్‌ దాటినా టపాసుల మోత!

ఫలితమివ్వని గ్రీన్ క్రాకర్స్‌.. టైమ్‌ దాటినా టపాసుల మోత!

సీఎం కనిపించగానే టీవీపై చెప్పులు విసిరిన మహిళలు!

సీఎం కనిపించగానే టీవీపై చెప్పులు విసిరిన మహిళలు!

కారులో మంటలు.. ఆరుగురి సజీవదహనం!

కారులో మంటలు.. ఆరుగురి సజీవదహనం!

అయోధ్య వేదికగా భగ్గమన్న రాజకీయం.. అఖిలేశ్‌కు యోగి అల్టిమేటం

అయోధ్య వేదికగా భగ్గమన్న రాజకీయం.. అఖిలేశ్‌కు యోగి అల్టిమేటం

పండక్కి ‘పీఎల్‌’ కూడా ఇవ్వరా?.. సోషల్‌ మీడియాలో రచ్చ!

పండక్కి ‘పీఎల్‌’ కూడా ఇవ్వరా?.. సోషల్‌ మీడియాలో రచ్చ!

పండుగ పూట పరీక్షేంటి?.. ‘బోర్డు’ను నిలదీస్తున్న విద్యార్థులు!

పండుగ పూట పరీక్షేంటి?.. ‘బోర్డు’ను నిలదీస్తున్న విద్యార్థులు!

  

ADVERTISEMENT
 
 
ADVERTISEMENT
ADVERTISEMENT
 
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Jagati Publications Limited.
Powered by Yodasoft