Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. National
  3. అమర్‌నాథ్‌ యాత్ర షురూ
ADVERTISEMENT 

అమర్‌నాథ్‌ యాత్ర షురూ

National Sakshi User Sakshi Sakshi Time Jul 4, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Amarnath-Yatra.jpg

బాబా బర్ఫానీకి అందిన తొలి హారతి

పహల్గాం, బాల్టాల్‌ క్యాంప్‌ల నుంచి

బయలుదేరిన మొదటి బృందం

ఆగస్టు 9వ తేదీతో ముగియనున్న యాత్ర

భారీ బందోబస్తు చేపట్టిన యంత్రాంగం

సాక్షి, న్యూఢిల్లీ: హిమాలయాల్లోని పవిత్ర అమర్‌నాథ్‌ గుహలోని మంచు స్ఫటిక శివలింగ దర్శనానికి వేళయ్యింది. అత్యంత కఠినమైన, అననుకూల వాతావరణం మధ్య మొత్తం 38 రోజులపాటు సాగే అమర్‌నాథ్‌ యాత్ర గురువారం ప్రారంభమైంది. ఉదయం 3,880 మీటర్ల ఎత్తులోని అమర్‌నాథ్‌ గుహలో బాబా బర్ఫానీకి తొలి హారతి కార్యక్రమం నిర్వహించారు. 

వందలు, వేల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిన భక్తుల్లో మొదటి యాత్రికుల బృందం పహల్గాం, బాల్టాల్‌ బేస్‌ క్యాంప్‌ల నుంచి ‘హర్‌ హర్‌ మహాదేవ్‌’, ‘బమ్‌ బమ్‌ భోలే’ నినాదాలతో గుహ దిశగా ప్రయాణం ప్రారంభించారు. బుధవారం జమ్మూలోని భగవతీ నగర్‌ క్యాంప్‌ నుంచి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా జెండా ఊపడంతో 168 వాహనాల్లో 5,892 మందితో కూడిన యాత్రికుల తొలి బృందం పయనమైంది. 

ఈ యాత్ర ఆగస్టు 9వ తేదీన రక్షాబంధన్‌ రోజున ముగుస్తుంది. ఇప్పటికే 3.5 లక్షలకుపైగా భక్తులు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. జమ్మూలోని సరస్వతీ ధామ్, వైష్ణవి ధామ్, పంచాయతీ భవన్, మహాజన్‌ సభ వంటి కేంద్రాల్లో రోజూ సుమారు 2,000 మంది రిజిస్ట్రేషన్లను చేసుకుంటున్నారు. 2011లో అత్యధికంగా 6.34 లక్షల మంది భక్తులు అమర్‌నాథుని దర్శించుకున్నారు. ఈసారి ఇప్పటి వరకు యాత్రకు 3.5 లక్షల మంది ఆన్‌లైన్‌ ద్వారా పేర్లు నమోదు చేసుకున్నారు.

The first batch of Shri #AmarnathYatra2025 pilgrims was flagged off by Srinagar Police and the CRPF from the Pantha chowk base camp and directed to the Baltal base camp.#spiritualjourney #amarnathcave #yatra2023 #jammukashmir #DivineJourney #religioustourism #mountainpilgrimage pic.twitter.com/KHI1zN9Z4t

— crpf_fan (@CrprepostFan) July 2, 2025

ఘనమైన భద్రతా ఏర్పాట్లు
1990 నుంచి 2017 వరకు అమర్‌నాథ్‌ యాత్ర మార్గంలో 36 వరకు ఉగ్రవాద దాడులు జరిగాయి. ఈ దాడుల్లో 53 మంది యాత్రికులు మరణించగా, మరో 167 మంది గాయపడ్డారు. 2000లో అమర్‌నాథ్‌ యాత్రపై మొదటి ఉగ్రవాద దాడి జరిగింది. ఈ ఏడాది యాత్రను ప్రశాంతంగా పూర్తి చేయడానికి జమ్మూకశ్మీర్‌ పోలీసులు, సీఆర్‌పీఎఫ్, ఆర్మీ ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశాయి. 

ప్రధానమైన పహల్గాం, బాల్టాల్‌ మార్గాల్లో కాంక్రీటు బంకర్లు, చెక్‌పోస్టులు, డ్రోన్ల ద్వారా నిత్యం నిఘా కొనసాగిస్తున్నారు. యాత్రికుల వాహనాలు పాస్‌ల ద్వారా మాత్రమే అనుమతులు పొందుతున్నాయి. పలు అంశల భద్రతా ఏర్పాట్లలో భాగంగా ప్రతి దశలో మెటల్‌ డిటెక్టర్లు, డాగ్‌ స్క్వాడ్లతో అణువణువూ తనిఖీలు చేస్తున్నారు.


రెండు రూట్ల ద్వారా యాత్ర
పహల్గాం రూట్‌: 48 కిలోమీటర్ల దూరం, సుమారు 5 రోజులు పడుతుంది. పహల్గాం నుంచి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న చందన్వాడి వరకు యాత్ర తేలిక. అక్కడి నుంచి 3 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న పిస్సూ టాప్, ఆపై మరో 9 కిలోమీటర్లు నడవాలి. సాయంత్రానికి శేషనాగ చేరుకుంటారు. రెండో రోజు అక్కడ్నుంచి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న పంచతరణి చేరుకుంటారు. ఆపైన చివరిగా ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న అమర్‌నాథ్‌ గుహకు పయనమవుతారు.
 

బాల్టాల్‌ మార్గం: యాత్ర సమయం తక్కువగా ఉన్న వారు ఈ మార్గంలో వెళ్లవచ్చు. సుమారు 16 కిలోమీటర్ల దూరముండే ఈ మార్గంలో సుమారు 2 రోజుల్లో పవిత్ర గుహకు చేరుకునే వీలుంది. అయితే ఇది కాస్త కఠినమైన పర్వతమయం, మలుపులతో కూడిన మార్గం. వృద్ధులకు అనువైంది కాదు.

👉:​​​​​​​ (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)



ఇది కూడా చదవండి: ముద్దులొలికే ఈ చిన్నారి ఫొటో వెనుక.. అంతులేని విషాదం

 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Amarnath Yatra
Amarnath Yatra 2025
piligrims
JammuKashmir
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

అమర్‌నాథ్‌ యాత్రకు ‘ఆపరేషన్‌ శివ’ 

అమర్‌నాథ్‌ యాత్రకు ‘ఆపరేషన్‌ శివ’ 

తిరుగు ప్రయాణంలో అయ్యప్ప భక్తుల కష్టాలు..

తిరుగు ప్రయాణంలో అయ్యప్ప భక్తుల కష్టాలు..

శబరిమలలో మళ్లీ పెరిగిన రద్దీ

శబరిమలలో మళ్లీ పెరిగిన రద్దీ

స్పాట్‌ బుకింగ్‌ 5వేలే

స్పాట్‌ బుకింగ్‌ 5వేలే

‘ఫిజిక్స్‌వాలా’పై ఎఫ్‌ఐఆర్‌.. కారణం ఇదే..

‘ఫిజిక్స్‌వాలా’పై ఎఫ్‌ఐఆర్‌.. కారణం ఇదే..

‘పహల్గాం’ ముష్కరులకు సాయమందించిన వ్యక్తి అరెస్ట్‌

‘పహల్గాం’ ముష్కరులకు సాయమందించిన వ్యక్తి అరెస్ట్‌

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.