Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. National
  3. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగాసునేత్ర ప్రమాణం
ADVERTISEMENT 

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగాసునేత్ర ప్రమాణం

National Sakshi User Sakshi Sakshi Time Feb 1, 2026 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
sune.jpg

ఎన్సీపీ(అజిత్‌ పవార్‌) శాసనసభాపక్ష నేతగా ఎన్నిక  

రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా  

సునేత్రకు ఎక్సైజ్, క్రీడలు, మైనార్టీ అభివృద్ధి శాఖలు కేటాయింపు  

ముంబై/బారామతి:  మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా సునేత్ర పవార్‌(62) శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజధాని ముంబైలోని రాజ్‌భవన్‌లో నిరాడంబరంగా జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్‌ ఆచార్య దేవవ్రత్‌ ఆమెతో ప్రమాణం చేయించారు. మహారాష్ట్ర తొలి మహిళా ఉప ముఖ్యమంత్రిగా సునేత్ర పవార్‌ రికార్డుకెక్కారు. అంతకుముందు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా సమర్పించారు. 

ఉదయం నేషనలిస్టు కాంగ్రెస్‌ పార్టీ(అజిత్‌ పవార్‌) శాసనసభాపక్షం సమావేశమైంది. సునేత్ర పవార్‌ను తమ నేతగా ఎన్నుకుంది. పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి అజిత్‌ పవార్‌ జనవరి 28న విమాన ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన భార్య సునేత్రను నూతన ఉప ముఖ్యమంత్రిగా నియమించాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. 

సునేత్ర ప్రమాణ స్వీకారానికి రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, మరో ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే, ఎన్సీపీ నేతలు ప్రఫుల్‌ పటేల్, సునీల్‌ తత్కారే, ఛగన్‌ భుజబల్‌ తదితరులు హాజరయ్యారు. సునేత్ర చిన్నకుమారుడు జయ్‌ పవార్, ఆయన భార్య కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యకర్తలు, అభిమానులు ‘అజిత్‌ దాదా అమర్‌ రహే’అంటూ నినాదాలు చేశారు. 

సునేత్ర పవార్‌ ఆరు నెలల్లోగా ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సి ఉంది. తన భర్త మరణంతో ఖాళీ అయిన బారామతి అసెంబ్లీ స్థానం నుంచి ఉప ఎన్నికలో ఆమె పోటీ చేయబోతున్నట్లు సమాచారం. మరోవైపు సునేత్ర పవార్‌కు ఎక్సైజ్, క్రీడలు, మైనార్టీల అభివృద్ధి శాఖలను కేటాయించారు. ఆమె భర్త నిర్వర్తించిన ఆర్థిక, ప్రణాళిక శాఖలను ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ తనవద్దే అట్టిపెట్టుకున్నారు. 

ప్రమాణ స్వీకారం అనంతరం సునేత్ర ‘ఎక్స్‌’లో పోస్టుచేశారు. తన భర్త ఆశయాలను ముందుకు తీసుకెళ్తానని చెప్పారు. ఆయన అడుగు జాడల్లో నడుస్తూ అంకితభావంతో విధులు నిర్వర్తిస్తానని, రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. ఛత్రపతి శివాజీ, సాహూ, ఫూలే, అంబేడ్కర్‌ వంటి మహనీయుల ఆదర్శాలే తనకు స్ఫూర్తి అని ఉద్ఘాటించారు.  

ప్రధాని మోదీ అభినందనలు  
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన సునేత్ర పవార్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం ఆమె నిరంతరం కృషి చేస్తారన్న విశ్వాసం ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ఎక్స్‌లో పోస్టుచేశారు. దివంగత నేత అజిత్‌ పవార్‌ ఆశయాలను సునేత్ర నెరవేర్చాలని ఆకాంక్షించారు.  

ఆ సంగతి నాకు తెలియదు: శరద్‌ పవార్‌  
సునేత్ర పవార్‌ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోతున్న సంగతి తనకు ముందుగా తెలియదని ఎన్సీపీ(శరద్‌ పవార్‌) అధ్యక్షుడు శరద్‌ పవార్‌ అన్నారు. ప్రసార మాధ్యమాల ద్వారానే తనకు తెలిసిందని పేర్కొన్నారు. ప్రమాణ స్వీకారం గురించి ఎవరూ తనతో చర్చించలేదని చెప్పారు. ఎన్సీపీ(అజిత్‌ పవార్‌)లో అంతర్గతంగా చర్చించుకొని నిర్ణయం తీసుకొని ఉంటారని అభిప్రాయపడ్డారు. 

ఆయన శనివారం బారామతిలో మీడియాతో మాట్లాడారు. రెండు ఎన్సీపీలు విలీనం కావాలని అజిత్‌ పవార్‌ కోరుకున్నట్లు తెలిపారు. విలీనం గురించి ఫిబ్రవరి 12న ప్రకటించాలని అజిత్‌ పవార్‌ నిర్ణయించినట్లు వెల్లడించారు. రెండు పార్టీలు కలిసిపోవాలని ఆయన బలంగా కోరుకున్నారని స్పష్టంచేశారు. అది సాధ్యమవుతుందని తాను భావిస్తున్నట్లు శరద్‌ పవార్‌ వ్యాఖ్యానించారు.  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Maharashtra
deputy chief minister
Sunetra pawar
swearing in ceremony
Ajit Pawar
plane crash
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

అసలు లెక్క ఇదే.. మహారాష్ట్రలో బీజేపీ బిగ్‌ గేమ్‌!

అసలు లెక్క ఇదే.. మహారాష్ట్రలో బీజేపీ బిగ్‌ గేమ్‌!

మహారాష్ట్రలో భారీ వర్షాలు.. ముంచెత్తిన వరద (ఫొటోలు)

మహారాష్ట్రలో భారీ వర్షాలు.. ముంచెత్తిన వరద (ఫొటోలు)

రైలు బోగీనే హనీమూన్‌ సూట్‌!.. వైరల్‌ వీడియోపై విమర్శలు

రైలు బోగీనే హనీమూన్‌ సూట్‌!.. వైరల్‌ వీడియోపై విమర్శలు

వర్షపు నీటిలో పరీక్షల ప్రశ్నపత్రాలు

వర్షపు నీటిలో పరీక్షల ప్రశ్నపత్రాలు

ఆలస్యంగా వచ్చి.. అంతకంతకూ పెరిగి

ఆలస్యంగా వచ్చి.. అంతకంతకూ పెరిగి

మొబైల్‌ ఫోన్‌లో మాట్లాడుతూ నడుస్తూ మ్యాన్‌హోల్‌లో పడి..

మొబైల్‌ ఫోన్‌లో మాట్లాడుతూ నడుస్తూ మ్యాన్‌హోల్‌లో పడి..

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.