Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. National
  3. అత్యవసర పరిస్థితి... ఎయిర్ ఇండియా విమానం మళ్లింపు
ADVERTISEMENT 

అత్యవసర పరిస్థితి... ఎయిర్ ఇండియా విమానం మళ్లింపు

National Sakshi User Sakshi Sakshi Time Dec 22, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
inida.jpg

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ నుంచి ముంబైకి బయలుదేరిన ఎయిర్ ఇండియా (AI887) విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. సోమవారం తెల్లవారుజామున 3.20 గంటలకు ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే, విమానం కుడి వైపు ఇంజిన్ (ఇంజిన్ నంబర్ 2)లో ఆయిల్ ప్రెజర్ ఒక్కసారిగా సున్నాకి పడిపోయింది. ఈ అత్యవసర పరిస్థితిని గమనించిన పైలట్లు అప్రమత్తమై, వెంటనే విమానాన్ని తిరిగి ఢిల్లీకి మళ్లించి, సురక్షితంగా ల్యాండ్ చేయడంతో 100 మందికి పైగా ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

సాధారణంగా విమాన ఇంజిన్ భాగాలు వేడెక్కకుండా, సజావుగా పనిచేయడానికి ఇంజిన్ ఆయిల్ ఎంతో కీలకం. ఆయిల్ ప్రెజర్ సున్నాకి పడిపోవడం అనేది విమానయాన రంగంలో అత్యంత ప్రమాదకరమైన ‘టెక్నికల్ ఫెయిల్యూర్’గా పరిగణిస్తారు. దీనివల్ల ఇంజిన్ మంటలు అంటుకోవడం లేదా పూర్తిగా నిలిచిపోయే ప్రమాదం ఉంటుంది. అయితే, బోయింగ్ 777-337 ER విమాన సిబ్బంది సరైన సమయంలో స్పందించి ‘స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్’ పాటించడంతో పెను ముప్పు తప్పింది. ప్రయాణికులందరినీ సురక్షితంగా కిందకు దించి, ప్రత్యామ్నాయ విమాన ఏర్పాట్లు చేసినట్లు ఎయిర్ ఇండియా ప్రతినిధి తెలిపారు.

గత కొద్ది రోజుల్లో ఎయిర్ ఇండియా సంస్థకు చెందిన విమానాల్లో సాంకేతిక లోపాలు తలెత్తడం ఇది రెండోసారి. నాలుగు రోజుల క్రితం (డిసెంబర్ 18న) గన్నవరం విమానాశ్రయంలో విశాఖపట్నం వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో కూడా ఇలాంటి ఇంజిన్ సమస్యే తలెత్తింది. ఆ విమానంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తదితర ప్రముఖులు ఉన్నారు. అయితే టేకాఫ్‌కు ముందే ఈ లోపాన్ని గుర్తించి,విమానాన్ని రద్దు చేయడంతో ప్రమాదం తప్పింది.

వరుసగా జరుగుతున్న  ఇటువంటి ఘటనలు విమానాల నిర్వహణ, భద్రతా తనిఖీలపై ప్రయాణికుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా పండుగలు, పర్యాటక సీజన్ కావడంతో విమానయాన సంస్థలు తమ విమానాల కండిషన్‌పై మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తాజాగా  ఢిల్లీలో నిలిచిపోయిన విమానానికి సమగ్ర సాంకేతిక పరీక్షలు నిర్వహిస్తున్నామని, పూర్తి క్లియరెన్స్ వచ్చాకే విమానాన్ని తిరిగి సర్వీసులోకి తెస్తామని ఎయిర్ ఇండియా స్పష్టం చేసింది.

ఇది కూడా చదవండి: ఆపరేషన్‌ సిందూర్‌పై మునీర్‌ సంచలన వ్యాఖ్యలు
 

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Air India
flight cancel
Engineeing
Pressure
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఎయిరిండియాకు తృటిలో తప్పిన ప్రమాదం

ఎయిరిండియాకు తృటిలో తప్పిన ప్రమాదం

తక్కువ ధరకు విమాన టికెట్లు.. ఎయిర్ ఇండియాలో కొత్త కేటగిరీ

తక్కువ ధరకు విమాన టికెట్లు.. ఎయిర్ ఇండియాలో కొత్త కేటగిరీ

విమానాల కొనుగోలు ప్రణాళిక వాయిదా?

విమానాల కొనుగోలు ప్రణాళిక వాయిదా?

ఏం జరిగింది? ఎందుకు జరిగింది? ఇంకా రహస్యమేనా?

ఏం జరిగింది? ఎందుకు జరిగింది? ఇంకా రహస్యమేనా?

ఎయిరిండియాకు షాక్‌ : రెట్టింపు ఫైన్‌

ఎయిరిండియాకు షాక్‌ : రెట్టింపు ఫైన్‌

ప్రకృతి ఉగ్రరూపం... భయంకరమైన రాక్షస గాలులు మూడు విమానాలు ధ్వంసం

ప్రకృతి ఉగ్రరూపం... భయంకరమైన రాక్షస గాలులు మూడు విమానాలు ధ్వంసం

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.