Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. National
  3. ‘ఒక్క ఎగ్జామ్‌తో అయిపోలేదు’.. యాక్టర్ ఎమోషనల్‌ మెసేజ్‌!
ADVERTISEMENT 

‘ఒక్క ఎగ్జామ్‌తో అయిపోలేదు’.. యాక్టర్ ఎమోషనల్‌ మెసేజ్‌!

National Sakshi User Sakshi Sakshi Time Jun 20, 2026 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
neet-re-exam.jpg

ముంబై: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET-UG) 2026 రీ-ఎగ్జామినేషన్‌  ఆదివారం(జూన్‌ 21) జరగనుంది.  దేశవ్యాప్తంగా లక్షలాది మంది  విద్యార్థులు ఈ పరీక్ష రాయనున్నారు. ఈ సందర్భంగా బాలీవుడ్‌ నటుడు ఉపేంద్ర చౌహాన్ విద్యార్థుల్లో ధైర్యాన్ని నింపేందుకు ‘టైమ్స్ నౌ డిజిటల్’ ద్వారా ఒక  సందేశాన్ని పంచుకున్నారు. పరీక్షలో విజయం సాధిస్తే మంచిదేనని, ఒకవేళ విఫలమైనా అది జీవితాంతం కాదని చెబుతూ, మానసిక ఒత్తిడిలో ఉన్న అభ్యర్థులకు ఆయన ధైర్యాన్ని నూరిపోశారు.

‘జీవితంలోనూ లెక్కలేనన్ని అపజయాలు’
తాను కూడా కెరీర్‌లో ఎన్నో ఒడిదొడుకులను, లెక్కలేనన్ని తిరస్కరణలను ఎదుర్కొన్నానని ఉపేంద్ర చౌహాన్ గుర్తుచేసుకున్నారు. ఒకానొక సమయంలో తన కలలు చేజారిపోతున్నాయని, జీవితంలో ఇంకేమీ మిగల్లేదని తీవ్ర నిరాశకు గురైన క్షణాలను ఆయన పంచుకున్నారు. అయితే ఆ కష్ట కాలమే తనను ఈ రోజు ఒక బలమైన వ్యక్తిగా తీర్చిదిద్దిందని, జీవితాన్ని చూసే సరైన మార్గాన్ని నేర్పిందని వివరించారు. జీవితం అనే పెద్ద ప్రయాణంలో ఇలాంటి కఠినమైన పరీక్షలు చాలా చిన్నవని, అపజయాలే మనిషి ఎదుగుదలకు, పరిమితులను దాటి ముందుకు సాగడానికి దోహదపడతాయని ఆయన తెలిపారు.

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ టు యాక్టర్
తన సొంత జీవిత ప్రయాణాన్ని ఉదాహరణగా చూపుతూ ఉపేంద్ర విద్యార్థులకు కీలక విషయాలను వివరించారు. తాను కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పూర్తి చేసి, మొదట సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కావాలని అనుకున్నట్లు తెలిపారు. కానీ, ఆ తర్వాత అనుకోకుండా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి ఏడేళ్లపాటు విజయవంతంగా బిజినెస్ రన్ చేశానని చెప్పారు. ఆ సమయంలో తనకు నటుడిని అవుతానని అస్సలు తెలియదని, జీవితంలో తన అసలైన లక్ష్యం చాలా ఆలస్యంగా  గుర్తించానని అన్నారు.  ఆ గమ్యాన్ని చేరుకోవడానికి ప్రతి ఒక్కరూ జీవితానికి ఒక అవకాశం ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు.‘పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా సరే.. జీవితాన్ని దాని దారిన సాగనివ్వండి. జీవితం చాలా అందమైనది, దానిని ప్రేమించండి’ అంటూ విద్యార్థుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు.

ఇది కూడా చదవండి: అగ్రహీరో బ్యానర్‌లో ద్రౌపది ముర్ము బయోపిక్

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
NEET
Upendra
Paper leak
Student
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

డైపర్ల విరాళాల ఉద్యమం చేపట్టిన కాక్రోచ్‌ జనతా పార్టీ

డైపర్ల విరాళాల ఉద్యమం చేపట్టిన కాక్రోచ్‌ జనతా పార్టీ

షాక్‌ అనాలా?.. అద్భుతం అనాలా??.. 'ఇది నా పేపర్‌ కాదు' అనుకుంది!

షాక్‌ అనాలా?.. అద్భుతం అనాలా??.. 'ఇది నా పేపర్‌ కాదు' అనుకుంది!

టెలిగ్రామ్‌ సేవలు పునఃప్రారంభం

టెలిగ్రామ్‌ సేవలు పునఃప్రారంభం

NEET ఎగ్జామ్‌ మిస్‌.. విద్యార్థుల కన్నీళ్లు.. తప్పెవరిది?

NEET ఎగ్జామ్‌ మిస్‌.. విద్యార్థుల కన్నీళ్లు.. తప్పెవరిది?

అమెరికాలో తెలంగాణా విద్యార్థి అరుణ్‌ సాయి రెడ్డి హఠాన్మరణం

అమెరికాలో తెలంగాణా విద్యార్థి అరుణ్‌ సాయి రెడ్డి హఠాన్మరణం

కోడింగ్ టు ప్రిస్క్రిప్షన్: సత్తా చాటిన ‘ఆకృతి @ 32’

కోడింగ్ టు ప్రిస్క్రిప్షన్: సత్తా చాటిన ‘ఆకృతి @ 32’

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.