Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. National
  3. బిహార్‌లో 69 శాతం ఓటింగ్‌
ADVERTISEMENT 

బిహార్‌లో 69 శాతం ఓటింగ్‌

National Sakshi User Sakshi Sakshi Time Nov 12, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
BIHAR.jpg

ముగిసిన రెండో విడత పోలింగ్‌

మొదటి దశకు మించి ఓటేసిన జనం

కిషన్‌గంజ్‌లో అత్యధికంగా 76.26%

నవాడాలో అత్యల్పంగా 57.31శాతం

పట్నా: బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల తుది విడత పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన నితీశ్‌ కుమార్‌పై ప్రజాభిప్రాయ సేకరణగా భావిస్తున్న అత్యంత కీలకమైన రెండో విడత పోలింగ్‌లో అత్యధికంగా సుమారు 69 శాతం ఓటింగ్‌ నమోదైంది. నవంబర్‌ 6వ తేదీన మొదటి విడత పోలింగ్‌లో రికార్డు స్థాయిలో 65.09 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకోగా, ఈసారి అంతకుమించి జనం పోలింగ్‌ కేంద్రాలకు తరలివచ్చారు. సమయం పూర్తయిన తర్వాత కూడా బూత్‌ల వద్ద బారులు తీరి కనిపించారు. పోలింగ్‌ శాతం మరింత పెరిగే అవకాశాలున్నాయని పరిశీలకులు అంటున్నారు.

ముఖ్యంగా, ముస్లింల ప్రాబల్యమున్న కిషన్‌గంజ్‌లో ఏకంగా 76.26 శాతం ఓటింగ్‌ నమోదు కావడం విశేషం. పొరుగునున్న కటిహార్‌లో 75.23 శాతం, పుర్నియాలో 73.79 శాతం, అరారియాలో 67.79 శాతం నమోదైంది. అత్యల్పంగా నవాడాలో 57.31 శాతం మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. సాయంత్రం 5 గంటల సమయానికి రాష్ట్రంలో 60 శాతం మార్కును దాటని ఏకైక జిల్లా కూడా ఇదే కావడం గమనార్హం. మొదటి విడతలో 121 నియోజకవర్గాల్లోని 3.75 కోట్ల మంది అర్హులైన ఓటర్లకుగాను 65.09 శాతం మంది ఓటేశారు. ఈసారి 122 స్థానాల్లో 3.70 కోట్ల మంది ఓటర్లుండగా 1,302 మంది పోటీ చేస్తున్నారు.

గతం కంటే 9 శాతం ఎక్కువ
రాష్ట్రంలో రెండో విడత పోలింగ్‌లో రికార్డుస్థాయిలో 68.79 శాతం ఓటింగ్‌ నమోదైందని చీఫ్‌ ఎలక్టోరల్‌ అధికారి(సీఈవో) వినోద్‌ సింగ్‌ గుంజియాల్‌ తెలిపారు. రెండు విడతల్లో కలిపి 66.91 శాతం మంది ఓటేసినట్లు గణాంకాలు చెబుతున్నాయన్నారు. 1951 తర్వాత మొదటిసారిగా భారీ ఓటింగ్‌ నమోదైందని చెప్పారు. అదేవిధంగా, పురుషుల కంటే మహిళలే అత్యధికంగా ఓటేశారని చెప్పారు. 2020 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఇది 9.6 శాతం ఎక్కువని ఆయన వివరించారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో 57.29 శాతం ఓటింగ్‌ నమోదైందని గుర్తు చేశారు.

మరో 2 వేల పోలింగ్‌ స్టేషన్ల ఓటింగ్‌ వివరాలు అందాల్సి ఉన్నందున, ఓటింగ్‌శాతం పెరిగే అవకాశముందన్నారు. తాజా ఫలితాలపై ఇండియా కూటమి నేతలు..ప్రభుత్వ వ్యతిరేక పవనాలు బలంగా వీస్తున్నాయడానికి ఇదే నిదర్శనమని పేర్కొనగా, గతంలోనూ ఇలాంటి సందర్భాల్లోనూ ప్రభుత్వాలు కొనసాగిన ఉదాహరణ లున్నాయని ఎన్డీయే నేతలంటున్నారు.


మొదటి, రెండో విడత పోలింగ్‌ సందర్భంగా అత్యధికంగా 70 శాతానికి మించి ఓటింగ్‌ నమోదైన జిల్లాలు గంగా నది ఉత్తర ప్రాంతంలోని అత్యధిక జనసాంద్రత కలిగి, ఎన్డీయేకు గట్టి పట్టున్న ప్రాంతాలు కావడం విశేషం. అదే సమయంలో, ముస్లింలు ఎక్కువగా ఉన్న కిషన్‌గంజ్, కటిహార్, పుర్నియా జిల్లాల్లో గత ఎన్నికల్లో ఇండియా కూటమి వైపు మొగ్గు చూపారు. ప్రజలు ప్రత్యామ్నాయం వైపు ఎదురు చూస్తున్నా రనేందుకు ఓటింగ్‌ శాతాలే తార్కాణమని వ్యూహ కర్త ప్రశాంత్‌ కిశోర్‌ పేర్కొన్నారు. ఫలితాలు తమకు అనుకూలంగా ఉంటాయని అంచనా వేశారు.

ఓటేసిన ప్రముఖులు..
జేడీయూ యాక్టింగ్‌ ప్రెసిడెంట్‌ సంజయ్‌ ఝా, కేంద్ర మంత్రి జితన్‌ రామ్‌ మాంఝీ, జన్‌ సురాజ్‌ వ్యవస్థాపకుడు ప్రశాంత్‌ కిశోర్, రాష్ట్ర కాంగ్రెస్‌ చీఫ్‌ రాజేశ్‌ రామ్, రాష్ట్రమంత్రి నితీశ్‌ మిశ్రా తదితరులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
voting
Bihar Assembly Election 2025
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఎన్నికల్లో పారదర్శకతకు పాతర!

ఎన్నికల్లో పారదర్శకతకు పాతర!

KSR: ఏపీలో అర్ధరాత్రి ఓట్లు.. ఈసీ స్పందించాలని డిమాండ్

KSR: ఏపీలో అర్ధరాత్రి ఓట్లు.. ఈసీ స్పందించాలని డిమాండ్

‘బంగ్లా’లో హిందూ ఓటర్ల భయం.. ఈసీకి ప్రత్యేక వినతి

‘బంగ్లా’లో హిందూ ఓటర్ల భయం.. ఈసీకి ప్రత్యేక వినతి

పీకే యూ టర్న్‌? ప్రియాంకను కలిసి..

పీకే యూ టర్న్‌? ప్రియాంకను కలిసి..

భారత్‌లో నచ్చిన పార్టీకి ఓటేసే ఛాన్స్‌ వస్తే..

భారత్‌లో నచ్చిన పార్టీకి ఓటేసే ఛాన్స్‌ వస్తే..

ఎస్‌.ఐ.ఆర్‌పై ఈసీ కీలక నిర్ణయం

ఎస్‌.ఐ.ఆర్‌పై ఈసీ కీలక నిర్ణయం

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.