Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. National
  3. ఫ్లాష్‌బ్యాక్‌: ఆ నిర్ణయంతో..అతలాకుతలం 
ADVERTISEMENT 

ఫ్లాష్‌బ్యాక్‌: ఆ నిర్ణయంతో..అతలాకుతలం 

National Sakshi User Sakshi Sakshi Time May 20, 2023 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
2016-Indian-Banknote-Demonetisation.jpg

సాక్షి, నేషనల్‌ డెస్క్‌: అది 2016. నవంబర్‌ 8. రాత్రి 8 గంటల సమయం. ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా ఉన్న వేళ. ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నట్టుండి టీవీ తెరల మీద ప్రత్యక్షమయ్యారు. జాతినుద్దేశించి మాట్లాడటం మొదలు పెట్టారు. ఏమిటా అని ఆసక్తిగా చూస్తున్న వాళ్లందరికీ షాకిస్తూ పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించారు. (Rs 2000 Note Ban: రూ. 2 వేల నోట్లు రద్దు)

నల్లధనాన్ని రూపుమాపడమే లక్ష్యంగా రూ.1,000, రూ.500 నోట్లను తక్షణం రద్దు చేస్తున్నట్టు పేర్కొన్నారు. నకిలీ నోట్ల బెడద పోవడమే గాక నగదు రహిత డిజిటల్‌ లావాదేవీలకు కూడా ఈ నిర్ణయంతో ఊపొస్తుందని చెప్పుకొచ్చారు. ఫలితంగా 2016 నవంబర్‌ 8 అర్ధరాత్రి నుంచి పెద్ద నోట్లు పనికిరాకుండా పోయాయి! కానీ అనంతర పరిణామాలను, ముఖ్యంగా నోట్ల మార్పిడి ప్రక్రియను సజావుగా డీల్‌ చేయడంలో కేంద్రం పూర్తిగా విఫలమైంది. దాంతో కొద్ది నెలల పాటు దేశమంతా అక్షరాలా అల్లకల్లోలమైపోయింది. (రూ. 2000 నోట్ల రద్దు: షాపింగ్‌ చేసుకోవచ్చా?)

పెద్ద నోట్లను మార్చుకునేందుకు ఏ బ్యాంకు ముందు చూసినా కొండవీటి చాంతాటిని తలదన్నే లైన్లే. ఆ లైన్లలోనే కుప్పకూలిన ప్రాణాలు. నగదు మీదే ఆధారపడి నడిచే వ్యాపారాలు పడకేసి ఆర్థికంగా చితికిపోయిన సగటు బతుకులు. ఇలా ఎవరిని కదిలించినా కన్నీటి కథలే! మనసుల్ని మెలిపెట్టే గాథలే. వ్యవసాయం మొదలుకుని ఆటోమొబైల్, నిర్మాణ తదితర కీలక రంగాలు నగదు కటకటతో కొన్నాళ్ల పాటు పూర్తిగా పడకేశాయి. మొత్తంగా దేశ ఆర్థిక రంగమే అతలాకుతలమైపోయింది.

ఇంతా చేస్తే నోట్ల రద్దు వల్ల నల్లధనం ఏ మాత్రమూ కట్టడి కాలేదని తర్వాతి కాలంలో గణాంకాలతో పాటు నిరూపణ కావడం మరో విషాదం. అప్పట్లో ప్రవేశపెట్టిన రూ.2,000 కరెన్సీని ఆర్బీఐ తాజాగా రద్దు చేసిన నేపథ్యంలో నాటి చేదు జ్ఞాపకాలను జనం మరోసారి భయంభయంగా గుర్తు చేసుకుంటున్నారు... 





నోట్ల రద్దు–కొన్ని వాస్తవాలు 



♦
పలు అంచనాల ప్రకారం మన దేశ జీడీపీలో 20 నుంచి 25 శాతం దాకా నల్లధనమే. అంటే రూ.30 లక్షల కోట్ల పై చిలుకు!  



♦ నల్లధనం లేని బంగారు భవిష్యత్తు కోసం తాత్కాలికంగా కాస్త బాధను ఓర్చుకోక తప్పదని నోట్ల రద్దు వేళ ప్రధాని చెప్పుకొచ్చారు. జనం కూడా అందుకు సిద్ధపడ్డారు.  



♦ నోట్ల రద్దుతో తమకు కలిగిన నష్టాలను, వ్యయప్రయాలను పళ్ల బిగువున భరించారు. 



♦ నోట్ల రద్దు వల్ల కనీసం బ్యాంకింగ్‌ వ్యవస్థకు ఆవల ఉన్న రూ.3 లక్షల కోట్ల నుంచి రూ.4 లక్షల కోట్ల విలువైన నల్లధనం చెత్త కాగితం కింద మారుతుందని కేంద్రం ఆశించింది. 



♦ కానీ వాస్తవంలో జరిగింది అందుకు పూర్తిగా విరుద్ధమని గణాంకాలు తేల్చాయి.  



♦ నోట్ల రద్దు నిర్ణయం నాటికి దేశం చలామణిలతో ఉన్న నగదులో ఏకంగా 86 శాతం (రూ.16.24 లక్షల కోట్లు) రూ.1,000, రూ.500 నోట్లే. ఇందులో రూ1,000 నోట్ల వాటా 38 శాతం కాగా రూ.500 నోట్లది 47 శాతం. అదంతా రాత్రికి రాత్రి పనికిరాకుండా పోయింది. 



♦ ఈ మొత్తంలో ఏకంగా 99 శాతానికి పైగా కరెన్సీ క్రమంగా బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి తిరిగొచ్చిందని అనంతరం రిజర్వు బ్యాంకే అధికారికంగా ప్రకటించింది. నల్లధనం కట్టడి లక్ష్యం ఇసుమంతైనా నెరవేరలేదని తద్వారా స్పష్టమైంది. 



♦ నగదు కార్యకలాపాలను తగ్గించాలన్న ఉద్దేశమూ నెరవేరలేదు. 2016 నవంబర్‌లో దేశ ప్రజల దగ్గర రూ.17.7 కోట్ల విలువైన నగదుంటే 2022 అక్టోబర్‌ నాటికి ఆ మొత్తం ఏకంగా రూ.30.88 లక్షల కోట్లకు పెరిగింది. 



♦ నకిలీ నోట్ల చలామణి కూడా పెద్దగా తగ్గలేదని తర్వాతి కాలంలో గణాంకాలతో పాటు రుజువైంది. నకిలీ నోట్లలో అత్యధికం వంద రూపాయల నోట్లే కావడం ఇందుకు కారణమని తేలింది. 



♦ కాకపోతే నోట్ల రద్దు వల్ల ఇటు ప్రజలకు, అటు  ఆర్థిక వ్యవస్థకు జరిగిన నష్టం అపారం. 



♦ నగదు కార్యకలాపాల మీదే ఆధారపడే 48 కోట్ల మందికి పైగా భారతీయులను పెద్ద నోట్ల రద్దు కోలుకోలేని దెబ్బ కొట్టింది. 



♦ దేశ జీడీపీలో 45 నుంచి 60 శాతం దాకా వాటా ఉండే పలు రంగాలు కొన్నాళ్ల పాటు అత్యంత తీవ్రంగా ప్రభావితమయ్యాయి. 

ఆర్థికవేత్తల విస్మయం 

పలువురు ఆర్థికవేత్తలు కూడా నోట్ల రద్దు నిర్ణయంలో ఔచిత్యమేమిటో అంతుబట్టడం లేదంటూ అప్పట్లో ఆశ్చర్యపోయారు. ‘‘నల్లధనంలో మహా అయితే ఓ 5 శాతం మాత్రం నగదు రూపంలో ఉంటుందేమో. మిగతాదంతా భూములు, బంగారం వంటి ఆస్తుల రూపేణా మాత్రమే ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన సంగతే. అలాంటప్పుడు కేవలం పెద్ద నోట్ల రద్దుతో నల్లధనం మాయమైపోతుందని ఆర్బీఐ అనుకున్నారో!’’ అన్నారు.



♦ 2016 సెప్టెంబర్‌ దాకా ఆర్‌బీఐ గవర్నర్‌గా చేసిన రఘురాం రాజన్‌ నోట్ల రద్దు ప్రతిపాదనను తాను సమర్థించలేదని కుండబద్దలు కొట్టారు.



♦ నోట్ల రద్దు నిర్ణయాన్ని చట్టబద్ధమేనని గత జనవరిలో తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు కూడా, ‘ఆరేళ్ల తర్వాత ఇప్పుడు కాలాన్ని వెనక్కు తిప్పలేం’ అంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేసింది. ఆ నిర్ణయం లక్ష్యాన్ని సాధించిందా లేదా అన్నది ఇప్పుడు అప్రస్తుతమని స్పష్టంగా పేర్కొంది. 

చదవండి👉 ఇక దూకుడే దూకుడు.. తెలంగాణ కాంగ్రెస్‌కు ‘కర్ణాటక’ కిక్‌! 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Demonetisation
banknotes
Rs 500
Narendra Modi
business news
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఇక ఎన్డీఏ వేదిక 'మంగళ్ మిలన్’!

ఇక ఎన్డీఏ వేదిక 'మంగళ్ మిలన్’!

దూసుకెళ్లిన రిలయన్స్ పవర్ స్టాక్ ఇన్వెస్టర్లకు లాభాల పంట

దూసుకెళ్లిన రిలయన్స్ పవర్ స్టాక్ ఇన్వెస్టర్లకు లాభాల పంట

అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభం.. మోదీ ఐదు సంకల్పాలు ఇవే..

అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభం.. మోదీ ఐదు సంకల్పాలు ఇవే..

అగ్నిప్రమాదంపై ప్రధాని విచారం.. ఎక్స్‌గ్రేషియా ప్రకటన

అగ్నిప్రమాదంపై ప్రధాని విచారం.. ఎక్స్‌గ్రేషియా ప్రకటన

మీరు గొప్పనేత ఎప్పుడౌతారో ఏమో!

మీరు గొప్పనేత ఎప్పుడౌతారో ఏమో!

అజేయంగా మన సముద్ర శక్తి

అజేయంగా మన సముద్ర శక్తి

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.