Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. International
  3. ‘నల్ల పెట్టె’ మౌనరాగం!
ADVERTISEMENT 

‘నల్ల పెట్టె’ మౌనరాగం!

International Sakshi User Sakshi Sakshi Time Jan 13, 2025 Sakshi Read Time Read Time: 5 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Plane.jpg
  • గుట్టు విప్పని బ్లాక్ బాక్స్ 
  • విమానాలు కూలినప్పుడు మూగబోతున్న ఫ్లైట్ రికార్డర్లు
  • దుర్ఘటన హేతువు తెలిసేదేలా?
  • క్లిష్టంగా దక్షిణ కొరియా విమాన ప్రమాదం దర్యాప్తు

బ్లాక్ బాక్స్... చూసేందుకు నల్ల రంగులో ఉండదు. ‘డెత్ కోడ్’ను రహస్యంగా తనలో దాచుకుంటుంది. ఈ బాక్స్ ఒకటి కూడా కాదు. నిజానికి రెండు పెట్టెలు! విమానం కూలిపోతే అందరి కళ్లూ దానికోసమే చూస్తాయి. రికవరీ బృందాలు దాని వేటలో నిమగ్నమవుతాయి. అది దొరికితే చాలు... ప్రమాద కారణాలు తెలిసినట్టే. ఆ తప్పులు, లోపాలు పునరావృతమవకుండా జాగ్రత్తపడితే భవిష్యత్ ప్రమాదాలను నివారించవచ్చు. విమానయానాన్ని అందరికీ సురక్షితం చేయవచ్చు.

గాలిలో ప్రయాణం గాలిలో దీపం. రన్ వే మీది నుంచి పైకి ఎగిరిన విమానం మళ్లీ క్షేమంగా కిందికి దిగేదాకా టెన్షనే. వైమానిక దుర్ఘటనలకు కారణాలు తెలియాలంటే, కచ్చితమైన ఆధారాలు కనుగొనాలంటే తొలుత దాని బ్లాక్ బాక్స్ పరిశోధకుల చేతికి చిక్కాలి. అందుకే దర్యాప్తు సంస్థలు ముందుగా దాని అన్వేషణ కోసం రంగంలోకి దిగుతాయి. బ్లాక్ బాక్స్ వాస్తవానికి రెండు భాగాలు. అవి ఫ్లైట్ డేటా రికార్డర్ (ఎఫ్డీఆర్), కాక్పిట్ వాయిస్ రికార్డర్ (సీవీఆర్). వీటిని ఫ్లైట్ రికార్డర్స్ అంటారు. బ్లాక్ బాక్స్ పేరుకు తగ్గట్టుగా ఇవి నల్ల రంగులో ఉండవు! ప్రమాద స్థలిలో సులభంగా గుర్తుపట్టగలిగేలా ప్రకాశవంతమైన ఆరెంజ్ రంగులో ఉంటాయి.

విమానం కూలిపోయినప్పుడు ఆ నష్ట ప్రభావం దాని తోకభాగంపై స్వల్పంగా పడుతుంది. అందుకే కీలక డేటా నిక్షిప్తమైన బ్లాక్ బాక్స్ సురక్షితంగా ఉండేలా దాన్ని విమానం తోక భాగంలో అమర్చుతారు. సెకన్ల వ్యవధిలో ఎఫ్డీఆర్ దాదాపు వెయ్యి పరామితులను నమోదు చేస్తుంది. ప్రమాద సమయంలో విమానం ఎంత ఎత్తులో, ఎంత వేగంతో ఎగురుతోంది? ఇంజిన్ పనితీరు ఎలా ఉంది? ప్రయాణ మార్గం, దిశ వంటి వివరాలను అది నమోదు చేస్తుంది. ఎయిర్ ట్రాఫిక్ నియంత్రణ కేంద్రానికి పైలట్లు పంపిన, స్వీకరించిన సమాచారమేంటి? పైలట్ల సంభాషణలు, విమానంలోని కాక్పిట్ శబ్దాలు వంటి వివరాలను సీవీఆర్ రికార్డు చేస్తుంది.


విమాన ప్రమాదాలకు దారితీసిన కారణాలేమిటి? దుర్ఘటన చివరి నిమిషాల్లో ఎలాంటి మార్పులు సంభవించాయి? అనే వివరాలను బ్లాక్ బాక్స్ మాత్రమే వెల్లడించగలదు. ఫ్లైట్ రికార్డర్ల డేటాను విశ్లేషించి ప్రమాద హేతువులపై పరిశోధకులు ఓ అంచనాకు వస్తారు. మరి దర్యాప్తులో ఇంత కీలకమైన ఈ ‘నల్ల పెట్టె’… తాను మాట్లాడబోనంటూ అప్పుడప్పుడు మొండికేస్తుంది. కావాల్సిన డేటా ఇవ్వకుండా మొరాయించి ఇన్వెస్టిగేటర్లను ముప్పుతిప్పలు పెడుతుంది. క్లిష్ట సమయాల్లో రహస్యాలు బయటికి చెప్పకుండా మూగనోము పడుతుంది. దక్షిణ కొరియాకు చెందిన ‘జెజు ఎయిర్’ విమానం గత నెల 29న కూలిపోయి ఇద్దరు మినహా 179 మరణించిన సంగతి తెలిసిందే. ఆ విమానం కూలడానికి నాలుగు నిమిషాల ముందు నుంచే అందులోని ఫ్లైట్ రికార్డర్లు పనిచేయడం మానివేశాయి. దాంతో ఆ దుర్ఘటన దర్యాప్తు ప్రస్తుతం క్లిష్టంగా మారింది. దక్షిణ కొరియా విమానంలోని బ్లాక్ బాక్స్ ఎందుకు విఫలమైంది? బ్లాక్ బాక్సులు ఇలా విఫలమైన సందర్భాలు గతంలో ఉన్నాయా? అందుకు దారితీసే కారణాలేంటి? ఈ సమస్యను అధిగమించేదేలా? వివరాలు మీకోసం...
 
వైఫల్యానికి కారణాలివీ...
బ్లాక్ బాక్సులో భాగమైన రెండు ఫ్లైట్ రికార్డర్ల బరువు సుమారు 4.5 కిలోల దాకా ఉంటుంది. గురుత్వశక్తి కంటే 3,400 రెట్ల అధిక శక్తితో విమానం కూలుడు సంభవించినా బ్లాక్ బాక్స్ తట్టుకోగలదు. వెయ్యి డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతనూ కొంతసేపు భరించగలదు. విమానం సముద్రంలో కూలినా తానెక్కడున్నదీ తెలిపేలా హై పిచ్ శబ్దాలతో బ్లాక్ బాక్స్ 90 రోజులపాటు సంకేతాలు పంపగలదు. నీటిలో 20 వేల అడుగుల లోతులోనూ 30 రోజులు పనిచేయగలదు. దానిలోని కీలక డేటా, ఆడియో చెరిగిపోకుండా టెక్నీషియన్లు జాగ్రత్తగా వివరాలు సేకరిస్తారు. డేటాను డౌన్లోడ్ చేసుకుని కాపీ చేస్తారు. అనంతరం డేటాను డీకోడ్ చేసి గ్రాఫ్స్ రూపొందిస్తారు. సర్క్యూట్ పాడవటం, సెన్సర్లు విఫలమవడం తదితర సాంకేతిక అవరోధాలు, సాఫ్ట్వేర్ (Software) లోపాలు తలెత్తినప్పుడు బ్లాక్ బాక్సులు పనిచేయవు.


ప్రమాద తీవ్రత విపరీతంగా ఉండి భౌతికంగా ధ్వంసమైనప్పుడు వాటిపై ఆశ వదిలేసుకోవాల్సిందే. విమాన సిబ్బంది ఉద్దేశపూర్వకంగా డీ-యాక్టివేట్ చేసినప్పుడు అవి పనిచేయడం మానివేస్తాయి. డేటా ఓవర్ లోడ్ (Overload) అయినప్పుడు కూడా అవి మొరాయిస్తాయి. కొన్ని పాత బ్లాక్ బాక్సుల్లో నిర్ణీత కాలం తర్వాత డేటా ఓవర్ రైట్ అయిపోతుంది. ఫలితంగా వాటి నుంచి ఎలాంటి సమాచారం లభించదు. నిరుడు జనవరిలో అలస్కా ఎయిర్లైన్స్ (airlines) బోయింగ్ విమానం ప్రయాణ సమయంలో దాని తలుపు ఊడినప్పుడు (డోర్ ప్లగ్ బ్లో-అవుట్) సీవీఆర్ పూర్తిగా ఓవర్ రైట్ అయింది. దాని నుంచి డేటా లభ్యం కాలేదు. అత్యుష్ణ లేదా అత్యల్ప ఉష్ణోగ్రతలు, నీటిలో ఎక్కువ కాలం నానడం వల్ల కూడా ఫ్లైట్ రికార్డర్లు పాడవుతాయి. తేమ చేరుకుని సున్నిత భాగాల్లోని ఎక్విప్మెంట్ దెబ్బతిని షార్ట్ సర్క్యూట్ కావడం, అత్యధిక ఎత్తుల్లోని పీడనం, పక్షులు ఢీకొనడం, పిడుగుపాట్లు వంటి వాటి వల్ల కూడా బ్లాక్ బాక్సులు పనిచేయకపోవచ్చు.
 
పదేళ్లుగా జాడ లేని మలేసియా విమానం!
ఫ్లైట్ రికార్డర్ల సామర్థ్యంపై కొన్నేళ్లుగా చర్చ సాగుతోంది. ఆవశ్యకత ఎంతో ఉన్నా ఖర్చు, పరిమితుల దృష్ట్యా వాటి సామర్థ్యం పెంపు అంశంలో కొంత జాప్యం సంభవిస్తోంది. అత్యవసర సందర్భాల్లో ఫ్లైట్ రికార్డర్లు పనిచేయాలంటే వాటికి విమానంలోని సాధారణ సిస్టమ్స్ నుంచి కాకుండా వేరే వ్యవస్థల నుంచి పవర్ సరఫరా తప్పనిసరి. విమానంలోని రెండు ఇంజిన్లూ విఫలమైనప్పుడు విమానం అంతటా ఎలక్ట్రికల్ పవర్ నిలిచిపోతుంది. 1999లో న్యూయార్క్ నుంచి కైరో వెళుతున్న ‘ఈజిప్ట్ ఎయిర్’ విమానం అట్లాంటిక్ మహాసముద్రంలో కూలిపోయి అందులోని 217 మంది మరణించారు. ఈ విమానంలో ఆన్బోర్డ్ (onboard) ఎలక్ట్రికల్ పవర్ ఆగిపోగానే ఫ్లైట్ రికార్డర్లు పనిచేయడం మానివేశాయి.

విమానం లోపల సాధారణ అవసరాలకు సరఫరా అయ్యే కరెంటుపై ఆధారపడకుండా ఫ్లైట్ రికార్డర్లు మరో 10 నిమిషాలపాటు అదనంగా రికార్డింగ్ చేయడానికి వీలుగా ప్రత్యామ్నాయ బ్యాకప్ పవర్ ఏర్పాట్లు ఉండాలని సదరు ప్రమాదం దరిమిలా అమెరికా జాతీయ రవాణా సేఫ్టీ బోర్డు సిఫార్సు చేసింది. బ్లాక్ బాక్సులకు బ్యాకప్ బ్యాటరీలున్నా వాటి జీవితకాలం తక్కువ. ఆ బ్యాటరీలు కొన్ని సందర్భాల్లో పనిచేయవు. దక్షిణ కొరియా ‘జెజు ఎయిర్’ విమానంలోనూ విద్యుత్ వ్యవస్థ విఫలమవడంతో ఫ్లైట్ రికార్డర్లకు పవర్ అందక అవి పనిచేయడం మానివేసి ఉంటాయని భావిస్తున్నారు.

ఇక సీవీఆర్ విషయానికొస్తే అది సాధారణంగా ఒక విడతలో గరిష్ఠంగా రెండు గంటలపాటు మాత్రమే రికార్డు చేయగలదు. ఆ రెండు గంటల్లో రికార్డయిన డేటానే అది రిపీట్ చేస్తుంది. ఈ రికార్డింగ్ నిడివిని 25 గంటలకు పెంచాలనేది ఎప్పట్నుంచో వినిపిస్తున్న డిమాండ్. ఇది ప్రస్తుతం కార్యరూపం దాలుస్తోంది. 2009లో ఎయిర్ ఫ్రాన్స్ ఫ్లైట్ 447 రియో డి జెనీరో (బ్రెజిల్) నుంచి ప్యారిస్ వెళుతూ నడి అట్లాంటిక్ మహాసముద్రంలో కూలిపోయి విమానంలోని 228 మంది చనిపోయారు. ఇక మలేసియా ఎయిర్లైన్స్ (airlines) ఎంహెచ్ 370 ఫ్లైట్ వ్యధ... ఇప్పటికీ అంతు లేని కథ! 2014లో కౌలాలంపూర్ నుంచి బీజింగ్ ప్రయాణిస్తూ అకస్మాత్తుగా రాడార్ తెర మీది నుంచి ఆ విమానం అదృశ్యమైంది.

అందులోని 239 మందీ మరణించారని భావిస్తున్నారు. విమానం అలా ఎందుకు అదృశ్యమైందో ఇప్పటికీ అంతుచిక్కలేదు. వైమానిక చరిత్రలో అదొక పెద్ద మిస్టరీ. ఆ విమానం ఏమైపోయిందో కనుక్కోవడానికి బోలెడు వ్యయమైంది. ఆ అన్వేషణ ఇప్పటికీ కొనసాగుతుండటం విశేషం. ఆ విమానం దక్షిణ హిందూమహాసముద్రంలో కూలి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. దాని జాడ కనుగొనేందుకు అన్వేషణ పునః ప్రారంభించాలని మలేసియా తాజాగా నిర్ణయించింది. ‘ఎయిర్ ఫ్రాన్స్’ విమానం దుర్ఘటన దరిమిలా... మహాసముద్రాలను దాటి దూర ప్రయాణాలు చేసే ట్రాన్స్-ఓషనిక్ ఫ్లైట్స్ విషయంలో కాక్పిట్ వాయిస్ రికార్డర్లో 25 గంటల వాయిస్ డేటా రికార్డింగ్ ఉండాల్సిందేనని ఫ్రాన్స్ సిఫార్సు చేసింది.

మలేసియా ఎయిర్లైన్స్ విమానం అదృశ్యంతో ఆ సిఫార్సుకు ప్రాముఖ్యం ఏర్పడింది. ఈ దిశగా అమెరికా కూడా ముందడుగు వేసింది. కాక్పిట్ వాయిస్ రికార్డర్లో 25 గంటల రికార్డింగును తమ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ రీ-ఆథరైజేషన్ చట్టంలో చేర్చింది అమెరికా. అయితే కొత్తగా తయారయ్యే విమానాల్లోనే ఈ మార్పులకు వీలవుతోంది.  ఇప్పుడు తిరుగుతున్న చాలా విమానాల జీవిత కాలం 40-50 ఏళ్లు. పాత విమానాల్లో సీవీఆర్ రికార్డింగ్ వ్యవధి పెంపు సాధ్యపడటం లేదు.

కొత్త టెక్నాలజీతో బ్లాక్ బాక్సులు!
తాజా సవాళ్లు, మారిన సాంకేతికత నేపథ్యంలో అధునాతన రీతిలో సరికొత్త బ్లాక్ బాక్సులకు రూపకల్పన జరుగుతోంది. ఎక్కువ గంటల రికార్డింగ్, అధిక డేటా స్టోరేజి, బ్యాకప్ బ్యాటరీల జీవిత కాలం పెంపు వంటివి ఇందులోని ప్రధానాంశాలు. విమానాల కూలుళ్ల తీవ్రత ఎంత ఎక్కువగా ఉన్నా సమర్థంగా పనిచేసే బ్లాక్ బాక్సులూ రాబోతున్నాయి. విమానాలు సముద్రాల్లో కూలిపోయే మెరైన్ ప్రమాదాల్లో రికవరీ బృందాలు తక్కువ శ్రమతో సత్వరం బ్లాక్ బాక్సును గుర్తించేలా మెరుగుపరచిన ‘అండర్ వాటర్ లొకేటర్ బీకాన్స్ అభివృద్ధి దశలో ఉన్నాయి. దీంతోపాటు అతి ముఖ్యమైన రియల్ టైమ్ డేటాను గ్రౌండ్ స్టేషన్లకు ప్రసారం చేసే కొత్త డిజైన్లతో బ్లాక్ బాక్సులు రూపుదిద్దుకుంటున్నాయి. విమానానికి సంబంధించిన కీలక సమాచారం ఎప్పటికప్పుడు గ్రౌండ్ స్టేషనుకు చేరుతుంది కనుక ఒకవేళ ప్రమాదంలో బ్లాక్ బాక్స్ భౌతికంగా నాశనమైనా పెద్దగా ఎలాంటి ఇబ్బంది ఉండబోదు. 
- జమ్ముల శ్రీకాంత్

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
plane crash
New technology
Jammula Srikanth
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

మిస్సోరి విమాన ప్రమాదం : మృతుల్లో తెలుగు టెకీ సాయి కార్తీక వర్మ

మిస్సోరి విమాన ప్రమాదం : మృతుల్లో తెలుగు టెకీ సాయి కార్తీక వర్మ

స్కైడైవింగ్ యాత్ర విషాదాంతం.. అమెరికాలో ఘోర విమాన ప్రమాదం

స్కైడైవింగ్ యాత్ర విషాదాంతం.. అమెరికాలో ఘోర విమాన ప్రమాదం

భారత వాయుసేన విమాన ప్రమాదం.. ఐదుగురు మృతి

భారత వాయుసేన విమాన ప్రమాదం.. ఐదుగురు మృతి

పెట్రోల్ కష్టాలకు చెక్.. కొత్త కారు ఎంట్రీ!

పెట్రోల్ కష్టాలకు చెక్.. కొత్త కారు ఎంట్రీ!

కుప్పకూలిన రీఫ్యూయలింగ్‌ విమానం

కుప్పకూలిన రీఫ్యూయలింగ్‌ విమానం

రోబో సలహాలు.. మంచివే!

రోబో సలహాలు.. మంచివే!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.