Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. International
  3. బొరుసు పడుంటే ఆమె బతికి ఉండేదేమో!
ADVERTISEMENT 

బొరుసు పడుంటే ఆమె బతికి ఉండేదేమో!

International Sakshi User Sakshi Sakshi Time Jan 14, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Poland_Crime_Coin_Toss.jpg

మనిషిలోని ‘మృగం’ మేల్కొంటే.. ఎంతటి దారుణానికైనా తెగిస్తుంది. ముఖ్యంగా లైంగిక దాడుల విషయంలో మరీ ఘోరాలను నిత్యం చూస్తూనే ఉన్నాం. అయితే ఇక్కడో కేసులో నిందితుడు నేరానికి పాల్పడిన తీరు, కారణం విని.. న్యాయమూర్తితో సహా అందరినీ విస్తుపోయేలా చేశాయి. 

18 ఏళ్ల ఓ యువతి నైట్‌క్లబ్‌లో తన స్నేహితులతో పార్టీ ముగించుకుని బస్సులో ఇంటికి వెళ్తోంది. ఆ టైంలో ఓ కుర్రాడి కళ్లు ఆమె మీద పడ్డాయి. హ్యాండ్సమ్‌గా ఉండడంతో ఆమె కూడా అతనితో మాటలు కలిపింది. అర్ధరాత్రి దాటడంతో.. తన ఇంటికి రావాలంటూ ఆమెను ఆహ్వానించాడు. అయితే అమాయకంగా అతని వెంట వెళ్లడం ఆమె పాలిట శాపమైంది.

కొన్నిరోజుల తర్వాత.. ఓ ప్లాస్టిక్‌ బ్యాగులో ఆమె శవంగా కనిపించింది. శవపరీక్షలో.. ఆమెను ఊపిరి ఆడకుండా చేసి చంపినట్లు తేలింది. అంతేకాదు ఆమెపై అఘాయిత్యం జరిగినట్లు నిర్ధారణ అయ్యింది. మృతురాలి ఐడెంటిటీని మిస్సింగ్‌ కేసు ద్వారా పోల్చుకున్నారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. అన్ని కోణాల్లో దర్యాప్తు జరిపిన పోలీసులు.. చివరకు ఆ రాత్రి ఆమెను తన ఇంటికి తీసుకెళ్లి మరీ బలిగొన్న యువకుడ్ని అదుపులోకి తీసుకున్నారు. 

కేసు విచారణలో భాగంగా నిందితుడ్ని జనవరి 8వ తేదీన పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. జడ్జి ముందు నేరం అంగీకరిస్తూ అతను చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి.. ‘‘మా పరిచయం బస్సులో జరిగింది. కాసేపు ఇద్దరం మాటలు కలిపాం. ఇంటికి వెళ్తావా? నాతో వస్తావా? అని ఆమెను అడిగా. ఆమె నాతో రావడానికి ఇష్టపడింది. నా ఇంట్లో ఏం మాట్లాడకుండా  ఇద్దరం ఎదురెదురుగా కూర్చున్నాం. ఉన్నట్లుండి ఆమె పడుకుని పోయింది.


.. నాకేం చేయాలో పాలుపోలేదు. ఆమెను నిద్ర లేపేందుకు యత్నించా. కానీ, ఆమె లేవలేదు. నా చేతిలో ఉన్న కాయిన్‌ను ఎగరేశా. బొమ్మ పడితే చంపేయాలి అనుకున్నా. బొరుసు పడితే ప్రాణాలతో వదిలేయాలనుకున్నా. ఆమె దురదృష్టం.. బొమ్మ పడింది. అందుకే ఆమెను చంపేశా. అలా ఎందుకు చేశానో నాకు తెలియదు. అది అలా జరిగిపోయిందంతే..!

.. నిర్ణయాలు తీసుకోవడం కష్టమనిపించినప్పుడల్లా నేను అలా కాయిన్‌ ఎగరేస్తుంటా. ఆరోజూ అలానే చేశా. బొమ్మ పడ్డాక.. ఆమె ఛాతీపై కూర్చుకున్నా. నా రూంలోని నైలాన్‌ తాడును ఆమె పీకకు వేసి నలిపేయడం ప్రారంభించా. ఊపిరాడక ఆమె విలవిలలాడింది. తిరిగి పోరాడలేని శక్తి ఆమెది. అప్పటికే ఆలస్యమై ఆమె ప్రాణం పోయింది. రక్తం చుక్క పడకుండా ఆమెను చంపాలని అనుకున్నా.. అలాగే చేశా. 

.. ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్నాక.. ఆమె దుస్తులు తొలగించి అనుభవించా. ఆపై మళ్లీ దుస్తులు తొడిగి ఓ బ్యాగ్‌లో ఆమె శవాన్ని పార్శిల్‌ చేశా. ఒక దుప్పట్లో చుట్టేసి తగలేయాలని అనుకున్నా. కానీ, ఎందుకనో అలా చేయలేకపోయా!. అందుకే ఆ రాత్రి బయట పారేసి వచ్చా. ఆమెను చంపేశాక ఎందుకనో హాయిగా అనిపించింది. ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నా. కానీ, నా వెంటనే ఆ నిర్ణయం మార్చుకున్నా’’ అని నిందితుడు జడ్జి ముందు ఒప్పుకున్నాడు.

కేసు విచారణ పూర్తయ్యాక.. బయటకు వస్తున్న నిందితుడిని తిడుతూ.. దాడికి మృతురాలి స్నేహితులు ప్రయత్నించారు. అయితే.. పోలీసులు వాళ్లను అడ్డుకుని నిందితుడ్ని అక్కడి నుంచి తరలించారు. ఫిబ్రవరి 12వ తేదీన ఈ కేసు తదుపరి విచారణ జరగనుంది. ఆ విచారణలోనే అతనికి జీవిత ఖైదు పడే అవకాశం ఉంది.

పోలాండ్‌(Poland) నగరం కటోవీస్‌లో 2023లో జరిగిన దారుణ ఘటన ఇది. నిందితుడి పేరు మెటాయుజ్‌ హెపా(20). బాధితురాలి పేరు విక్టోరియా కోజిఎలెస్కా(18).  దాదాపు నేరం జరిగిన ఏడాది తర్వాత నిందితుడు పోలీసులకు చిక్కాడు.  గ్లివిస్‌ కోర్టు ఫిబ్రవరిలో నిందితుడికి శిక్ష ఖరారు చేయనుంది. ప్రస్తుతం ఈ కేసు అక్కడ చర్చనీయాంశమైంది.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
toss
Coin
heads
tail
Psycho
Molestation
Crime News
Poland
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

లైంగిక నేరాల కేసుల్లో న్యాయ సున్నితత్వం అవసరం: సుప్రీం కోర్టు

లైంగిక నేరాల కేసుల్లో న్యాయ సున్నితత్వం అవసరం: సుప్రీం కోర్టు

శనగ కూరలో విషం కలిపి తల్లికి పెట్టిన కొడుకు.. ఎందుకో తెలిస్తే షాక్‌

శనగ కూరలో విషం కలిపి తల్లికి పెట్టిన కొడుకు.. ఎందుకో తెలిస్తే షాక్‌

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

షాబాద్‌ హత్యకేసుల నిందితుడు రాజ్‌కుమార్‌ మృతి

షాబాద్‌ హత్యకేసుల నిందితుడు రాజ్‌కుమార్‌ మృతి

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

మరో ఎన్‌కౌంటర్‌: నకిలీ నోట్ల అక్రమ రవాణాదారు అజయ్‌పై కాల్పులు

మరో ఎన్‌కౌంటర్‌: నకిలీ నోట్ల అక్రమ రవాణాదారు అజయ్‌పై కాల్పులు

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.