Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. International
  3. ఇరాన్‌ ముందుచూపు.. మొజాయిక్‌ డిఫెన్స్‌!
ADVERTISEMENT 

ఇరాన్‌ ముందుచూపు.. మొజాయిక్‌ డిఫెన్స్‌!

International Sakshi User Sakshi Sakshi Time Mar 14, 2026 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Mohammad-Ali-Jafari.jpg

ఇరాన్‌ను దుర్భేద్యంగా మార్చిన యుద్ధ తంత్రం 

సైనిక యూనిట్లకు ఎక్కడికక్కడ స్వయం ప్రతిపత్తి 

దాంతో నాయకుడు లేకున్నా స్వతంత్రంగా పోరు

ఫిబ్రవరి 28న ఇరాన్‌పై ఇజ్రాయెల్‌–అమెరికా ఉరుముల్లేని పిడుగులా విరుచుకుపడ్డాయి. సుప్రీం లీడర్‌ ఖమేనీతో పాటు అగ్ర నాయకత్వాన్నంతా దాదాపుగా తుడిచిపెట్టేశాయి. ఆ దాడుల్లో ఆర్మీ చీఫ్‌ సయ్యద్‌ అబ్దుల్‌ ఇబ్రహీం ముసావీ, ఐఆర్‌జీసీ చీఫ్‌ కమాండర్‌ మొహమ్మద్‌ పక్పూర్, రక్షణ మంత్రి అజీజ్‌ నాసిర్‌జాదేతో పాటు మరో 30 మందికి పైగా పౌర, సైనిక అగ్ర నేతలను అంతం చేశాయి. అంతటితో ఆగకుండా రెండు వారాలుగా ఇరాన్‌పై ఎడతెరిపి లేని దాడులతో విరుచుకుపడుతున్నాయి. ఆ దేశ డిఫెన్స్, దాడుల వ్యవస్థలను ఎక్కడికక్కడ నేలమట్టం చేస్తూ వస్తున్నాయి. పైగా నూతన సుప్రీం నేత, ఖమేనీ కుమారుడు మొజ్తబా కూడా తొలి రోజు దాడిలోనే గట్టిగా గాయపడ్డట్టు వార్తలొస్తున్నాయి. 

అయినా సరే, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఆశించినట్టుగా ఇరాన్‌ను ఓడించడం దేవుడెరుగు, ఆ దేశాన్ని కాస్త కూడాలొంగదీయలేకపోయారు. ఇజ్రాయెల్‌తో పాటు గల్ఫ్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్‌ ముమ్మర దాడులతో విరుచుకుపడుతూనే ఉంది. పశి్చమాసియా మొత్తాన్నీ యుద్ధక్షేత్రంగా మార్చేసింది. ఇంకెంత కాలమైనా పోరాడేందుకు సిద్ధమంటోంది. ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేసే నాయకత్వం లేకపోయినా, వ్యవస్థలన్నీ కుప్పకూలుతున్నా, డెడ్లీ కాంబినేషన్‌గా పరిగణించే ఇజ్రాయెల్‌–అమెరికా సంయుక్త దాడులను దీటుగా ఎదుర్కోవడం ఇరాన్‌కు ఎలా సాధ్యపడుతోంది? ఇందుకు సమాధానం ఒక్కటే. ఆ దేశం ముందుచూపుతో సిద్ధంచేసి పెట్టుకున్న మొజాయిక్‌ డిఫెన్స్‌ సిద్ధాంతం! అత్యంత శక్తిమంతుడైన శత్రువుపై ఇరాన్‌కు గెలుపు సాధించి పెట్టలేకపోయినా, ఓటమిని మాత్రం అసాధ్యంగా మార్చే గమ్మత్తైన ఏర్పాటిది!! 

సైనికాధికార వికేంద్రీకరణ 
ఇరాన్‌ మొజాయిక్‌ రక్షణ సిద్ధాంతానికి 2003 ఇరాక్‌ యుద్ధంతో బీజం పడింది. దీని రూపకర్త నాటి ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్‌ (ఐఆర్‌జీసీ) డైరెక్టర్‌ మొహమ్మద్‌ అలీ జఫారీ. 2003 యుద్ధంలో సద్దాం హుస్సేన్‌ సేనలను తుడిచిపెట్టేందుకు అమెరికాకు కేవలం 26 రోజుల సమయం సరిపోయింది. నాయకుని పలాయనంతో ఇరాక్‌ సైన్యం చేష్టలుడిగింది. తమకు ఎప్పటికప్పుడు ఆదేశాలిస్తూ సమన్వయం చేసే వ్యవస్థ లేక ఉన్నపళంగా చేతులెత్తేసింది. ఈ ఉదంతాన్ని ప్రత్యక్షంగా గమనించిన జఫారీ ఇరాన్‌కు ఎప్పటికీ అలాంటి గతి పట్టకుండా జాగ్రత్త పడాలని నిశ్చయించుకున్నారు. ఆ ఆలోచనల్లోంచి 2005లో పుట్టుకొచి్చందే మొజాయిక్‌ రక్షణ సిద్ధాంతం. ఒక్కముక్కలో చెప్పాలంటే అధికార వికేంద్రీకరణే దీని మూలమంత్రం.

ఇందులో భాగంగా సైనిక, ఐఆర్‌జీసీ బలగాలను పాక్షిక స్వయంప్రతిపత్తితో కూడిన 31 విభాగాలుగా తీర్చిదిద్దారు. అలా రాష్ట్రానికి ఒకటి చొప్పున 31 ప్రొవిన్షియల్‌ కమాండ్లు ఏర్పాటయ్యాయి. ప్రతి కమాండ్‌కూ సొంత ప్రధాన కార్యాలయం, కమాండ్‌–కంట్రోల్‌ వ్యవస్థలు, క్షిపణులు, డ్రోన్లతో కూడిన ఆయుధ వ్యవస్థ, సమీకృత బసీజ్‌ పోరాట యూనిట్లు, నావికా దళ విభాగాలు, నిఘా వ్యవస్థలు, ఆయుధాగారం వంటివి ఉంటాయి. నాయకత్వం అందుబాటులో లేని పరిస్థితుల్లో ప్రతి కమాండ్‌ కూడా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటూ పోరాటం కొనసాగించేలా జాగ్రత్తలు తీసుకున్నారు. 2007లో జఫారీ ఐఆర్‌సీజీ చీఫ్‌ కమాండర్‌గా ఎంపికయ్యా మొజాయిక్‌ సిద్ధాంతాన్ని పూర్తిస్థాయిలో అమల్లోకి తీసుకొచ్చారు. 

పొరుగునుంచే పాఠాలు 
ఇరాక్‌లో మాదిరిగా నాయకత్వాన్ని అంతం చేసి తమను లొంగదీసుకోవడం సాధ్యపడే విషయం కాదని ఇరాన్‌ విదేశాంగ మంత్రి సయీద్‌ అబ్బాస్‌ అరాఘ్చీ ముందే స్పష్టం చేశారు. యుద్ధం మొదలైన రెండో రోజు మార్చి 1వ తేదీనే ఈ మేరకు ఎక్స్‌లో ఆయన పోస్టు చేశారు. 

 


 

ఆద్యంతం ఐఆర్‌జీసీతోనే ముడిపడ్డ కెరీర్‌ జనరల్‌ మొహమ్మద్‌ అలీ జఫారీది. ఇస్లామిక్‌ విప్లవం అనంతరం ఇరాక్‌ సరిహద్దుల్లోని కుర్దిస్తాన్‌ ప్రావిన్స్‌లో నిఘా విభాగంలో చేరారు. అనంతరం ఇరాక్‌తో పదేళ్ల యుద్ధంలో పోరాడారు. 1992 నాటికి ఐఆర్‌జీసీ పదాతి దళాల కమాండర్‌గా ఎదిగారు. 2005లో ఐఆర్‌జీసీ స్ట్రాటజిక్‌ స్టడీస్‌ సెంటర్‌ డైరెక్టర్‌గా ఎంపికయ్యాక మొజాయిక్‌ సిద్ధాంతానికి పదును పెట్టారు. 2003లో ఇరాక్‌ను అమెరికా ఆక్రమించిన తీరు నుంచి నేర్చుకున్న పాఠాలనే అందుకు ముడిసరుకుగా మార్చుకున్నారు.

నిద్రలేని రాత్రులే
ఇరాన్‌ ముందుచూపుతో ఏర్పాటు చేసుకున్న మొజాయిక్‌ డిఫెన్స్‌ వ్యవస్థ నేటి అత్యవసర పరిస్థితుల్లో అద్భుతంగా ఉపయోగపడుతోంది. ఫిబ్రవరి 28న అనూహ్య రీతిలో భారీ దాడులకు గురైనా ఖమేనీతో పాటు అత్యున్నత నాయకత్వం దాదాపుగా తుడిచిపెట్టుకుపోయినా గంటల వ్యవధిలోనే ఇరాన్‌ బలగాలు తేరుకున్నాయి. ఇజ్రాయెల్‌పైనే గాక గల్ఫ్‌లోని అమెరికా స్థావరాలపై ఎడాపెడా దాడులతో విరుచుకుపడ్డాయి.

శత్రు దాడులకు ఎక్కడికక్కడ దీటుగా బదులిస్తున్నాయి. పరిస్థితులకు అనుగుణంగా స్వీయ నిర్ణయాలతో విమానాశ్రయాలు, చమురు, నీటి శుద్ధి కేంద్రాలు, బ్యాంకుల వంటి పౌర వ్యవస్థలపైనా దాడులతో గుబులు పుట్టిస్తున్నాయి. కేంద్ర నాయకత్వం లేని లోటు పెద్దగా కనిపించకుండా చేస్తున్నాయి. ఇజ్రాయెల్, అమెరికా రెండింటికీ నిద్ర లేకుండా చేస్తున్నాయి. ఇరాన్‌ ప్రస్తుత యుద్ధ తంత్రాన్ని పైలట్‌ ప్రత్యక్ష పర్యవేక్షణతో పని లేకుండానే విమానాన్ని సురక్షితంగా నడిపే ఆటో పైలట్‌ మోడ్‌తో అంతర్జాతీయ రక్షణ నిపుణులు పోలుస్తున్నారు. 

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
mohammad
ali
iran
Defence
Israel
USA
Supreme Leader of Iran
Army Chief
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

హర్ముజ్‌లో మళ్లీ అమెరికా బ్లాకేడ్‌.. ఇరాన్‌ సంచలన ప్రకటన

హర్ముజ్‌లో మళ్లీ అమెరికా బ్లాకేడ్‌.. ఇరాన్‌ సంచలన ప్రకటన

హర్ముజ్‌ జలసంధిపై కొత్త ఆధిపత్య పోరు!

హర్ముజ్‌ జలసంధిపై కొత్త ఆధిపత్య పోరు!

భీకరంగా మారిన అమెరికా-ఇరాన్‌ యుద్ధం!

భీకరంగా మారిన అమెరికా-ఇరాన్‌ యుద్ధం!

ప్రపంచకప్‌ నుంచి అమెరికా నిష్క్రమణ

ప్రపంచకప్‌ నుంచి అమెరికా నిష్క్రమణ

హార్మూజ్‌పై ఇరాన్ షాకింగ్‌ కామెంట్స్‌.. స్ట్రాంగ్‌ వార్నింగ్

హార్మూజ్‌పై ఇరాన్ షాకింగ్‌ కామెంట్స్‌.. స్ట్రాంగ్‌ వార్నింగ్

పాక్‌పై అమెరికా సెనేటర్ల నిప్పులు: లాడెన్‌ను దాచారంటూ ఆగ్రహం!

పాక్‌పై అమెరికా సెనేటర్ల నిప్పులు: లాడెన్‌ను దాచారంటూ ఆగ్రహం!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.