Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. International
  3. ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌లో ట్రంప్‌ పేరు.. ఊహించిందేనన్న వైట్‌హౌజ్‌!
ADVERTISEMENT 

ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌లో ట్రంప్‌ పేరు.. ఊహించిందేనన్న వైట్‌హౌజ్‌!

International Sakshi User Sakshi Sakshi Time Jul 24, 2025 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Trump_Epstiene.jpg

జెఫ్రీ ఎప్‌స్టీన్‌ పాపాల్లో ట్రంప్‌కు వాటా ఉందంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. అయితే ఎప్‌స్టీన్‌ ఓ మానవ మృగం అని, అతనితో చాలా ఏళ్లపాటు ఎలాంటి సంబంధాలు కొనసాగలేదని ట్రంప్‌ చెబుతూ వస్తున్నారు. ఈ తరుణంలో కీలకమైన ఎప్‌స్టీన్‌ పైల్స్‌లో ట్రంప్‌ పేరు నిజంగా ఉందా? లేదా? అనే చర్చ అమెరికాలో విస్తృతంగా నడుస్తోంది. 

తాజాగా.. ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌లో ట్రంప్‌ పేరు పలుమార్లు ప్రస్తావన ఉందని, ఆ విషయాన్ని యూఎస్‌ అటార్నీ జనరల్‌ పామ్‌ బాండీ(Palm Bondi) అధ్యక్షుడు ట్రంప్‌ దృష్టికి తీసుకెళ్లారని వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ బుధవారం ఓ సంచలనాత్మక కథనం ప్రచురించింది. మే నెలలోనే ఇది జరిగిందని, అయితే ఆ ఫైల్స్‌లో ట్రంప్‌ ప్రస్తావన ఏయే సందర్భాల్లో వచ్చిందనేది మాత్రం సదరు కథనం వివరించలేదు. 

ఎప్‌స్టీన్‌తో దగ్గరి సంబంధాలే ట్రంప్‌కు ఉన్నాయంటూ మొన్నీమధ్య wsj ఓ కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే. 2003లో ఎప్‌స్టీన్‌ పుట్టినరోజు కానుకగా ట్రంప్‌ ఓ లేఖ రాశారన్నది ఆ వార్త సారాంశం. అయితే ఆ కథనాన్ని తోసిపుచ్చిన ట్రంప్‌ సదరు మీడియా సంస్థపై భారీ పరువు నష్టం దావా వేశారు. ఈలోపు కనీసం వారం కూడా తిరగకుండానే మరో కథనంతో అదే మీడియా సంస్థ వచ్చింది. అయితే..


ఇది ఊహించిందేనని వైట్‌హౌజ్‌ అంటోంది. ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌లో ట్రంప్‌ పేరు.. ఫేక్‌ న్యూస్‌ అంటూ కొట్టిపారేసింది అమెరికా అధ్యక్ష భవనం. సదరు మీడియా సంస్థ నుంచి ఇలాంటి కథనాలు ఊహించినవేనని, డెమోక్రాట్లు, లిబరల్‌ మీడియా ట్రంప్‌పై అసత్య ప్రచారాలు చేస్తున్నాయని ఒక ప్రకటనలో తెలిపింది. మాజీ అధ్యక్షుడు ఒబామాపై విచారణ నేపథ్యంలోనే ఈ అంశాన్ని తెరపైకి తెచ్చారంటూ వైట్‌హౌజ్‌ వర్గాలు అంటున్నాయి. 

2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యంపై అమెరికాలో రాజకీయ దుమారం రేగింది. రష్యాతో చేతులు కలిపి హిల్లరీ క్లింటన్‌ ప్రచారాన్ని ట్రంప్‌ దెబ్బ తీయాలని చూశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే ఆ ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లభించలేవు. అయితే.. తాజాగా ఈ అంశంలో అప్పటి అధ్యక్షుడు బరాక్‌ ఒబామా పాత్రపై పెను దుమారం రేగింది. 

ట్రంప్‌, నేషనల్‌ ఇంటెలిజెన్స్‌ డైరెక్టర్‌ తుల్సీ గబ్బార్డ్‌ ఆరోపణలు ప్రకారం.. ఒబామా తన ప్రభుత్వంలో ఉన్న అధికారులతో కలిసి రష్యా జోక్యంపై తప్పుడు ఇంటెలిజెన్స్ నివేదికలు తయారు చేశారని, తద్వారా ట్రంప్‌ ప్రచారాన్ని అడ్డుకోవాలని చూశారన్నది ఆ కథనాల సారాంశం. ఈ ఆరోపణలకు సంబంధించి డీక్లాసిఫైడ్ డాక్యుమెంట్స్‌ను గబ్బార్డ్‌ విడుదల చేశారు కూడా. అయితే.. ఒబామా మాత్రం ఆ ఆరోపణలను కొట్టిపారేస్తున్నారు. 

ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌లో.. 

అమెరికన్‌ ఫైనాన్షియర్‌, ప్రముఖ ఇన్వెస్టర్‌ అయిన జెఫ్రీ ఎప్‌స్టీన్‌ లైంగిక వేధింపుల ఆరోపణలతో మీటూ ఉద్యమ సమయంలో అరెస్ట్‌ అయ్యాడు. ఆపై 2019లో జైల్లో అనుమానాస్పద స్థితిలో మరణించగా.. ఆత్మహత్య చేసుకున్నాడని అధికారులు ప్రకటించారు. ఇదే కేసులో అరెస్టైన ఎప్‌స్టీన్‌ సన్నిహితురాలు గిస్లేన్‌ మాక్స్‌వెల్‌.. ప్రస్తుతం జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. అమెరికాలో సంచలనం సృష్టించింది జెఫ్రీ ఎప్‌స్టీన్ హైప్రొఫైల్‌ సెక్స్ కుంభకోణం. 

చాలా ఏళ్లపాటు మైనర్‌ బాలికలపై ఎప్‌స్టీన్‌ లైంగిక దాడికి పాల్పడ్డాడన్నది ప్రధాన ఆరోపణ. అంతేకాదు.. 90వ దశకం నుంచి అమెరికాలో ప్రముఖ ప్రముఖ రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలకు ఎప్‌స్టీన్‌ అమ్మాయిలను సప్లై చేశాడని, ఈ వ్యవహారంలో అతని సన్నిహితురాలు గిస్లేన్‌ మాక్స్‌వెల్‌ సహకరించారన్న అభియోగాలు ఉన్నాయి. ఈ క్రమంలో.. 

ఎప్‌స్టీన్‌ ఫైల్స్(EPSTEIN FILES) అనేది ప్రధానంగా తెర మీదకు వచ్చింది. ఇది ఈ స్కామ్‌కు సంబంధించిన కీలక పత్రాల వ్యవహారం. ఈ ఫైల్స్‌లో ఎప్‌స్టీన్‌ టోటల్‌ కాంటాక్ట్‌ లిస్ట్‌, ఫ్లైట్‌ లాగ్‌లు, అతనికి వ్యతిరేకంగా సేకరించిన ఆధారాలు ఉన్నాయని గతంలో దర్యాప్తు సంస్థలు ప్రకటించాయి. వీటిని బయటపెట్టాలని చాలా ఏళ్లుగా డిమాండ్‌ నడుస్తోంది అక్కడ. అయితే ట్రంప్‌ అధికారంలోకి వచ్చాక ఆ ఫైల్స్‌ వివరాలు బహిర్గతం అవుతాయని అంతా భావించారు. అందుకు తగ్గట్లే.. 

ఎఫ్‌బీఐ, అమెరికా న్యాయవిభాగం ఆ బాధ్యతలు సంయుక్తంగా చేపట్టాయి. అయితే జులై మొదటి వారంలో యూఎస్‌ అటార్నీ జనరల్‌ పామ్‌ బాండీ అనూహ్యమైన ప్రకటన చేశారు. అందులో సంచలనాత్మక వివరాలేవీ లేవని అన్నారామె. ఎప్‌స్టీన్‌ వద్ద ‘క్లయింట్ లిస్ట్’ లేదు. ఆయన బ్లాక్‌మెయిల్ చేయలేదని, ప్రాముఖ్యమైన వ్యక్తులపై నేరపూరిత ఆధారాలు లేవని” పేర్కొన్నారు. అయితే.. 


ఎప్‌స్టీన్‌తో ట్రంప్‌కు ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగానే  ఆ వివరాలను బయటపెట్టనివ్వడం లేదన్న విమర్శలు ఇప్పుడు తీవ్రస్థాయిలో వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్లే ఇద్దరూ కలిసి ఉన్న ఫొటోలు(పాతవి) నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ట్రంప్‌ వివాహ వేడుకలోనూ ఎప్‌స్టీన్‌ కనిపించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుండడం గమనార్హం. ఈ క్రమంలో.. ఈ సెక్స్‌ స్కాండల్‌ను కదిలించిన అమెరికన్‌ విజువల్‌ ఆర్టిస్ట్‌ మరియా ఫార్మర్‌(ఎప్‌స్టీన్‌పై ఫిర్యాదు చేసిన తొలి వ్యక్తి.. ఈమె కేసులోనే ఎప్‌స్టీన్‌ అరెస్టయ్యాడు).. ట్రంప్‌ను కూడా ఎఫ్‌బీఐ సంస్థ విచారించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Donald trump
white house
Wall Street Journal report
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

హర్ముజ్‌ జలసంధిపై కొత్త ఆధిపత్య పోరు!

హర్ముజ్‌ జలసంధిపై కొత్త ఆధిపత్య పోరు!

మళ్లీ ట్రిగ్గర్‌ నొక్కిన ట్రంప్.. మరింత ముదిరిన యుద్ధం

మళ్లీ ట్రిగ్గర్‌ నొక్కిన ట్రంప్.. మరింత ముదిరిన యుద్ధం

పుతిన్‌ తగ్గేదేలే.. మళ్లీ మంటలు రేపే యుద్ధమా?

పుతిన్‌ తగ్గేదేలే.. మళ్లీ మంటలు రేపే యుద్ధమా?

భీకరంగా మారిన అమెరికా-ఇరాన్‌ యుద్ధం!

భీకరంగా మారిన అమెరికా-ఇరాన్‌ యుద్ధం!

వాన్స్‌ను ముందుకు నెట్టి.. ట్రంప్‌ సేఫ్‌ గేమ్?

వాన్స్‌ను ముందుకు నెట్టి.. ట్రంప్‌ సేఫ్‌ గేమ్?

అమెరికా డీల్‌ను నెతన్యాహు చెడగొడుతున్నారా?

అమెరికా డీల్‌ను నెతన్యాహు చెడగొడుతున్నారా?

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.