Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. International
  3. ఈ నీళ్లు.. చాలా ఖరీదు గురూ!
ADVERTISEMENT 

ఈ నీళ్లు.. చాలా ఖరీదు గురూ!

International Sakshi User Sakshi Sakshi Time Dec 21, 2024 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
water.jpg

లైట్‌ తీసుకొ'నీరు'

నీరు.. మానవాళికి తప్పనిసరిగా అవసరమైన వనరు. ఒకప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఉచితంగా లభ్యమయ్యే నీటిని ఇప్పుడు డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నాం. ఒక లీటరు వాటర్‌ బాటిల్‌ ఖరీదు సాధారణంగా రూ.20 ఉంటుంది. కంపెనీ, ఇతరత్రా అంశాలను బట్టి రూ.2వేల బాటిల్‌ కూడా ఉంది. కానీ జపాన్‌కు చెందిన ఫిల్లికో అనే కంపెనీ ఇంతకుమించిన ధరకు మంచినీళ్లను అమ్ముతోంది. ఆ కంపెనీ వాటర్‌ బాటిళ్ల ధర రూ.84వేల నుంచి మొదలై ఏకంగా రూ.8 లక్షల వరకు ఉంది. 

ధర చూస్తే గుండె గుభేల్‌మనడం ఎంత నిజమో.. ఆ బాటిల్‌ చూసిన తర్వాత వావ్‌ అని అనకుండా ఉండలేకపోవడం కూడా అంతే నిజం. ఆ బాటిల్‌ అందం అలాంటిది మరి. ఇంతకీ ఆ బాటిల్‌ నీళ్లకు అంత రేటెందుకు? అవేమైనా పైనుంచి దిగొచ్చాయా అనే కదా మీ సందేహం? ఔను.. జపాన్‌లో అత్యంత స్వచ్ఛమైన ప్రదేశంగా భావించే కోబ్‌లోని రౌకా నేషనల్‌ పార్క్‌లో ఉన్న నునోబికి ఫాల్స్‌ నుంచి రాతిశిలల ద్వారా సహజసిద్ధంగా శుద్ధి అయి కిందకు వచ్చిన నీళ్లవి. 

నునోబికి ప్రాంతం అటు పరిశ్రమలకు, ఇటు వ్యవసాయానికి చాలా దూరంగా ఉండటం వల్ల అక్కడ ఎలాంటి కాలుష్యం ఉండదు. అందువల్ల అక్కడ నీళ్లు కూడా చాలా స్వచ్ఛంగా ఉంటాయి. పైగా రాతిశిలల్లో నుంచి ఫిల్టర్‌ కావడం వల్ల మరింత స్వచ్ఛత కలిగి ఉంటాయి. ఈ నేపథ్యంలో ఆ నీటిలోని సహజసిద్ధమైన ఖనిజ లవణాలు, స్వచ్ఛత పో­కుండా కనీస ప్రాసెసింగ్‌ పద్ధతులను ఉపయోగించి ప్యాక్‌ చేస్తారు. 


ఎంత కష్టపడి నాణ్యమైన నీటిని తీసుకొచ్చి జాగ్రత్తగా ప్యాక్‌ చేసినా.. రంగు, రుచి, వాసన లేని నీటికి మరీ ఇంత రేటేంటి బాస్‌ అంటారా? ఇదే డౌట్‌ ఫిల్లికో కంపెనీ యజమాని క్రిస్టియన్‌ డయోర్‌కీ వచి్చంది. మనిషికి నిత్యావసరమైన నీటిని లగ్జరీ వస్తువుగా అధిక ధరకు అమ్మడం ఎలా అని ఆలోచించారు.

దేవతా రెక్కలు.. కిరీటాలు..
» ఆకర్షణీయమైన ప్యాకింగ్‌ చేయడం ద్వారా మార్కెటింగ్‌ చేయడం సులభం అని డియోర్‌ భావించారు. దానికి తగినట్టుగా తమ బాటిల్‌ డిజైన్‌ను వినూత్నంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. శాటిన్‌ గాజుతో కంటికి ఇంపుగా కనిపించేలా బాటిల్‌ డిజైన్‌ చేయించారు. తాము విక్రయించే ధరకు అది చాలదనే భావనతో దానికి అదనపు సొబగులద్దారు. బాటిల్‌ మూతలను రాజు, రాణి కిరీటాలను పోలి ఉండేలా రూపొందించారు.

దేవతలకు రెక్కలు ఉన్నట్టుగా బాటిల్‌కు రెండు రెక్కలు కూడా జోడించారు. అవసరమైన చోట వెండి పూత పూయించారు. లగ్జరీ బ్రాండ్‌ స్ఫటికాలను ఉత్పత్తి చేసే స్వరోవ్‌స్కీ స్ఫటికాలను బాటిల్‌పై అమర్చారు. వెరసి.. చూసిన తర్వాత చూపు తిప్పుకోలేనంత అందమైన కళాఖండంగా తీర్చిదిద్దారు. దీనికి ఫిల్లికో జ్యవెలర్‌ వాటర్‌ అని పేరు పెట్టి.. ఇది సార్‌ మా బ్రాండ్‌ అంటూ తొలుత తమ వీఐపీ కస్టమర్లకు పరిచయం చేశారు. 

వారి నుంచి అద్భుత స్పందన వచ్చిoది. అనంతరం ఫిల్లికో కంపెనీ 2008లో కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు స్పాన్సర్‌గా వ్యవహరించడంతో ఈ బ్రాండ్‌ పేరు ఒక్కసారిగా మార్మోగిపోయింది. అంతే అక్కడ నుంచి వెనుతిరిగి చూడలేదు. 2005లో ప్రారంభమైన ఈ కంపెనీ ప్రస్థానం అప్రతిహతంగా కొనసాగుతోంది. అయితే, బాటిళ్ల డిజైన్‌ ఎప్పటికప్పుడు కొత్తగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వీటిని చేతితోనే తయారుచేస్తారు. 

అందువల్ల నెలకు 5వేల బాటిళ్లను మించి ఉత్పత్తి చేయరు. ఇది కూడా ఈ బ్రాండ్‌ డిమాండ్‌ కొనసాగడానికి మరో కారణం. ప్రస్తుతం ఫిల్లికో జ్యువెలరీ వాటర్‌ రెండో తరం నడుస్తోంది. ఈ బాటిల్‌ ప్రారంభ ధర వెయ్యి డాలర్లు. (దాదాపు రూ.84 వేలు). ఒక్కోసారి లిమిటెడ్‌ ఎడిషన్‌ పేరుతో మరింత వినూత్నమైన బాటిళ్లను ఉత్పత్తి చేసి విక్రయిస్తుంటారు. వాటి ధర ఏకంగా రూ.8.40 లక్షల వరకు కూడా ఉంటుంది. 

వాస్తవానికి ఆ బాటిల్‌లో ఉన్న నీళ్లను కాదు.. ఆ నీళ్లున్న బాటిల్‌ను ఇంత ధర పెట్టి కొనాలన్న మాట. అయితే, దాహం వేసిన ప్రతిసారీ ఈ నీటిని తాగితే కష్టమే కదా? కేవలం తమ స్టేటస్‌ సింబల్‌ చాటుకోవాల్సిన సందర్భాల్లో ఓ రెండు గుటకలు వేయక తప్పదు మరి. అసలే బ్రాండ్‌ వాటర్‌.. పైగా లిమిటెడ్‌ ఎడిషన్స్‌. ఆ మాత్రం ముందు జాగ్రత్త తప్పనిసరి.. కాదంటారా? 

– సాక్షి సెంట్రల్‌ డెస్క్‌   

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Japan
water bottle
water
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

జపాన్‌తో కాలానుగుణ ఒప్పందాలు

జపాన్‌తో కాలానుగుణ ఒప్పందాలు

ఫిఫాలో 1000వ మ్యాచ్‌.. జపాన్‌ గర్జనకు ట్యునీషియా చిత్తు

ఫిఫాలో 1000వ మ్యాచ్‌.. జపాన్‌ గర్జనకు ట్యునీషియా చిత్తు

ఆ పువ్వులు, డిస్టిల్డ్‌ వాటర్‌తో ముడతలు మాయం..!

ఆ పువ్వులు, డిస్టిల్డ్‌ వాటర్‌తో ముడతలు మాయం..!

భారత్‌లో ‘వాటర్ పాజిటివ్’గా అమెజాన్

భారత్‌లో ‘వాటర్ పాజిటివ్’గా అమెజాన్

జపాన్ సంచలన నిర్ణయం.. 80 ఏళ్ల శాంతివాదానికి స్వస్తి?

జపాన్ సంచలన నిర్ణయం.. 80 ఏళ్ల శాంతివాదానికి స్వస్తి?

సెమీఫైనల్లో భారత్‌

సెమీఫైనల్లో భారత్‌

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.