Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. International
  3. Presidential Debate: ట్రంప్‌ జోరు బైడెన్‌ బేజారు
ADVERTISEMENT 

Presidential Debate: ట్రంప్‌ జోరు బైడెన్‌ బేజారు

International Sakshi User Sakshi Sakshi Time Jun 29, 2024 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
280620241844-ELECTION-2024-.jpg

తొలి డిబేట్‌లో ట్రంప్‌ దూకుడు  

తడబడ్డ బైడెన్‌ 

పదాల కోసం పదేపదే తడుముకున్న అధ్యక్షుడు

గొంతులో వణుకు, మాటల్లో అయోమయం 

బైడెన్‌ తీరుపై డెమొక్రాట్లలో తీవ్ర ఆందోళన

అట్లాంటా: అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో రిపబ్లికన్‌ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (78) దూకుడు పెంచారు. దేశాధ్యక్షుడు, డెమొక్రాట్ల అభ్యర్థి జో బైడెన్‌తో తొలి ప్రెసిడెన్షియల్‌ డిబేట్‌లో స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శించారు. శుక్రవారం (భారత కాలమానం ప్రకారం) సీఎన్‌ఎన్‌ చానల్లో దాదాపు 90 నిమిషాల పాటు జరిగిన వాదనలో బైడెన్‌ సర్వశక్తులూ ఒడ్డారు. 

తన వయసుపై విమర్శలు, అధ్యక్ష బాధ్యతలను సజావుగా నిర్వర్తించడంపై అమెరికన్లలో నానాటికీ పెరుగుతున్న అనుమానాలను కొట్టిపారేసేందుకు అన్ని ప్రయత్నాలూ చేశారు. ట్రంప్‌ తనకంటే కేవలం మూడేళ్లే చిన్నవాడని పదేపదే చెప్పుకున్నారు. కానీ డిబేట్‌ పొడవునా బైడెన్‌ పదేపదే తడబడ్డారు. ప్రసంగం మధ్యలో ఉన్నట్టుండి మౌనాన్ని ఆశ్రయించారు. మాటల కోసం తడుముకున్నారు.

 తనలో తానే గొణుక్కుంటూ కన్పించారు. మాట్లాడుతున్న అంశాన్ని అర్ధంతరంగా వదిలేసి మరో విషయం ఎత్తుకుని ఆశ్చర్యపరిచారు. కొన్నిసార్లు బైడెన్‌ ఏం చెప్తున్నదీ ఎవరికీ అర్థం కూడా కాలేదు. పలు అంశాలపై ట్రంప్‌ పచ్చి అబద్ధాలు చెప్పినా వాటిని ఎత్తిచూపడంలో, సొమ్ము చేసుకోవడంలో ఆయన పూర్తిగా విఫలమయ్యారు. తనకు అనుకూలమైన గణాంకాలను సమయానుకూలంగా ప్రస్తావించడంలో కూడా చతికిలపడ్డారు. 

డిబేట్‌లో ట్రంపే నెగ్గారని సీఎన్‌ఎన్‌ పోలింగ్‌లో ఏకంగా 67 శాతం మంది ఓటర్లు పేర్కొన్నారు. బైడెన్‌కు 33 శాతం ఓట్లే లభించాయి. న్యూయార్క్‌ టైమ్స్‌ వంటి ప్రఖ్యాత వార్తా పత్రికలు కూడా తొలి డిబేట్‌ ట్రంప్‌దేనని పేర్కొన్నాయి. ‘‘బైడెన్‌పై వయోభారం కొట్టొచ్చినట్టు కని్పస్తోంది. ఆయన మాటతీరులోనూ అది స్పష్టంగా ప్రతిఫలించింది. ఆయన చెబుతున్న విషయాల్లో పొందికే లేకుండా పోయింది’’ అంటూ విమర్శలు గుప్పించాయి. 

దూకుడుకు మారుపేరైన ట్రంప్‌కు 81 ఏళ్ల బైడెన్‌ ఏ మేరకు పోటీ ఇవ్వగలరోనంటూ డెమొక్రాట్లలో ఇప్పటికే గట్టిగా ఉన్న అనుమానాలు కాస్తా తాజా డిబేట్‌ నేపథ్యంలో ఆందోళనగా మారాయి. వాదనలో బైడెన్‌ తొలుత కాస్త వెనకబడ్డారని ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ కూడా అంగీకరించారు. అయితే క్రమంగా పుంజుకుని సమర్థంగా ముగించారని చెప్పుకొచ్చారు. బైడెన్‌ భార్య జిల్‌ మాత్రం తన భర్త భలే బాగా మాట్లాడారంటూ ప్రశంసించారు!

 ‘‘ప్రతి ప్రశ్నకూ చక్కగా బదులిచ్చావు. అన్ని సమాధానాలూ తెలుసు నీకు!’’ అంటూ ఆయన్ను మెచ్చుకున్నారు. కానీ ఈ డిబేట్‌ నేపథ్యంలో బైడెన్‌ అధ్యక్ష రేసు నుంచి తప్పుకోవాలంటున్న వారి సంఖ్య డెమొక్రాట్లలో క్రమంగా పెరుగుతోంది. ట్రంప్, బైడెన్‌లను అధ్యక్ష అభ్యర్థులుగా ఇంకా లాంఛనంగా ప్రకటించాల్సి ఉంది. జూలై 15–18 మధ్య జరిగే సదస్సులో రిపబ్లికన్లు, ఆగస్టు 19న సదస్సులో డెమొక్రాట్లు తమ అభ్యర్థుల పేర్లను అధికారికంగా ప్రకటిస్తారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్‌ 5న జరగనున్నాయి. 

పరస్పర విమర్శల వర్షం... 
అమెరికా ఆర్థిక వ్యవస్థ, అబార్షన్‌ చట్టం, విదేశీ వ్యవహారాలు, వలసల వంటి పలు అంశాలపై ట్రంప్, బైడెన్‌ మధ్య వాడివేడి వాదనలు సాగాయి. ఆ క్రమంలో నేతలిద్దరూ తిట్ల పర్వానికి దిగారు. ‘‘నువ్వే అబద్ధాలకోరు. అమెరికా చరిత్రలోనే అత్యంత చెత్త ప్రెసిడెంట్‌ కూడా నువ్వే’’ అంటూ పరస్పరం దుయ్యబట్టుకున్నారు. పలు రకాల విమర్శలు చేసుకున్నారు. హష్‌ మనీ కేసు దోషి అంటూ ట్రంప్‌కు బైడెన్‌ చురకలు వేశారు.

 ‘‘జరిమానాలుగా నువ్వు ఎన్ని బిలియన్‌ డాలర్లు కట్టాలో గుర్తుందా? భార్య గర్భవతిగా ఉండగా నీలి చిత్రాల తారతో గడిపావు. నైతికత విషయంలో వీధుల్లో విచ్చలవిడిగా తిరిగే పిల్లి కంటే కూడా హీనం’’ అంటూ విమర్శల వర్షం కురిపించారు. బైడెన్‌తో పాటు ఆయన కుమారుడు హంటర్‌ కూడా క్రిమినలేనంటూ మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ కూడా విరుచుకుపడ్డారు. అస్తవ్యస్తమైన వలసల విధానంతో దేశ భవితవ్యాన్నే బైడెన్‌ ప్రమాదంలోకి నెట్టారంటూ దుయ్యబట్టారు. డిబేట్‌ ఆరంభం నుంచే ట్రంప్‌ పై చేయి కనబరిచారు. ఆయనను ఇరుకున పెట్టేందుకు బైడెన్‌ చేసిన ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదు.

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
USA
presidential elections
Republican candidate
Donald trump
Democratic candidate
Joe Biden
presidential debate
CNN
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

హర్ముజ్‌ జలసంధిపై కొత్త ఆధిపత్య పోరు!

హర్ముజ్‌ జలసంధిపై కొత్త ఆధిపత్య పోరు!

మళ్లీ ట్రిగ్గర్‌ నొక్కిన ట్రంప్.. మరింత ముదిరిన యుద్ధం

మళ్లీ ట్రిగ్గర్‌ నొక్కిన ట్రంప్.. మరింత ముదిరిన యుద్ధం

పుతిన్‌ తగ్గేదేలే.. మళ్లీ మంటలు రేపే యుద్ధమా?

పుతిన్‌ తగ్గేదేలే.. మళ్లీ మంటలు రేపే యుద్ధమా?

భీకరంగా మారిన అమెరికా-ఇరాన్‌ యుద్ధం!

భీకరంగా మారిన అమెరికా-ఇరాన్‌ యుద్ధం!

ప్రపంచకప్‌ నుంచి అమెరికా నిష్క్రమణ

ప్రపంచకప్‌ నుంచి అమెరికా నిష్క్రమణ

హార్మూజ్‌పై ఇరాన్ షాకింగ్‌ కామెంట్స్‌.. స్ట్రాంగ్‌ వార్నింగ్

హార్మూజ్‌పై ఇరాన్ షాకింగ్‌ కామెంట్స్‌.. స్ట్రాంగ్‌ వార్నింగ్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.