Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. International
  3. ఒకే రోజు.. అమెరికా, రష్యాలకు భారీ షాక్‌!
ADVERTISEMENT 

ఒకే రోజు.. అమెరికా, రష్యాలకు భారీ షాక్‌!

International Sakshi User Sakshi Sakshi Time Jun 16, 2026 Sakshi Read Time Read Time: 4 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Russia-Double.jpg

అవేం సాధారణ యుద్ధ విమానాలు కావు.. అవసరమైతే అణ్వాయుధాలను మోసుకెళ్లి వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలపై విరుచుకుపడగల గగన కోటలు. ఒకటి అమెరికా బీ-52 స్ట్రాటోఫోర్ట్రెస్‌, మరొకటి రష్యా టీయూ-22ఎం3.. కోల్డ్‌వార్‌ కాలంలో ప్రపంచాన్ని గడగడలాడించిన రెండు మహాశక్తుల అణు బలానికి ప్రతీకలవి. అలాంటి రెండు దేశాల వ్యూహాత్మక శక్తికి ప్రతీకలైన బాంబర్లు.. కొన్ని గంటల వ్యవధిలో నేలకూలడం ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తోంది.. 

అమెరికా, రష్యాలకు ఒకే రోజు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. అణ్వాయుధాలను మోసుకెళ్లగల సామర్థ్యం ఉన్న రెండు దేశాల వ్యూహాత్మక బాంబర్లు ప్రమాదానికి గురయ్యాయి. అమెరికాకు చెందిన బీ-52 స్ట్రాటోఫోర్ట్రెస్‌ బాంబర్‌ కూలి ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా.. రష్యాకు చెందిన టీయూ-22ఎం3 బాంబర్‌ కూడా కుప్పకూలింది. అయితే రష్యా విమానంలోని సిబ్బంది సురక్షితంగా బయటపడటంతో పెను విషాదం తప్పింది.

SHOCKING COINCIDENCE: On June 15, 2026, TWO strategic bombers crashed on the SAME DAY — first Russia's Tu-22M3 in Siberia (4 pilots survived), then US B-52 in California (8 crew died) ❄️🇺🇸

Both Cold War-era aircraft. Both gone in one day. pic.twitter.com/rxZ01MztPX

— RB. (@KailashVashi) June 16, 2026

అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న ఎడ్వర్డ్స్‌ ఎయిర్‌ ఫోర్స్‌ బేస్‌ నుంచి టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే అమెరికా వైమానిక దళానికి చెందిన బీ-52 స్ట్రాటోఫోర్ట్రెస్‌ బాంబర్‌ కూలిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే విమానం మంటల్లో చిక్కుకోవడంతో అందులో ఉన్న ఎనిమిది మంది సిబ్బంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ఈ బాంబర్‌ టెస్టింగ్‌లో భాగంగా.. ప్రమాదానికి గురైనట్లు అమెరికా వైమానిక దళం తెలిపింది. ప్రమాదంలో సిబ్బంది సజీవ దహనం కాగా.. స్పాట్‌ నుంచి భారీగా నల్లటి పొగలు ఎగసిపడిన దృశ్యాలు వైరల్‌గా మారాయి. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించిన అధికారులు.. ఎడ్వర్డ్స్‌ ఎయిర్‌ బేస్‌లోని కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశారు.

LIVE VISUALS: కుప్పకూలిన బాంబర్ విమానం క్షణాల్లో బూడిద

All 8 crew DEAD in B-52 bomber crash in routine test flight — CNN 

'Indications are crash was not survivable' — officialshttps://t.co/Llhou3fYku pic.twitter.com/DwEmKbAhTb

— RT (@RT_com) June 16, 2026

మరోవైపు రష్యాలోని సైబీరియా ప్రాంతంలోని ఇర్కుట్స్క్‌లో టీయూ-22ఎం3 వ్యూహాత్మక బాంబర్‌ కూలిపోయింది. శిక్షణా విమానయానంలో పాల్గొంటున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే ప్రమాదం సంభవించే ముందే సిబ్బంది ఎజెక్ట్‌ కావడంతో ప్రాణనష్టం జరగలేదని తెలిపింది. విమానం ఎలాంటి యుద్ధ సామగ్రి లేకుండానే ప్రయాణిస్తోందని, భూమిపై కూడా ఎలాంటి నష్టం జరగలేదని పేర్కొంది.

అసలు ఈ రెండు వ్యూహాత్మక బాంబర్ల ప్రత్యేకతే వాటిని ప్రపంచ సైనిక చరిత్రలో అత్యంత కీలక వేదికలుగా నిలిపింది. బీ-52 స్ట్రాటోఫోర్ట్రెస్‌ 1952లో తొలి ప్రయోగాన్ని పూర్తి చేసుకోగా, 1955లో అమెరికా వైమానిక దళంలో అధికారికంగా ప్రవేశించింది. దాదాపు ఏడు దశాబ్దాలుగా ఇది అమెరికా వ్యూహాత్మక వైమానిక శక్తికి వెన్నెముకగా కొనసాగుతోంది. వియత్నాం యుద్ధం, గల్ఫ్‌ యుద్ధం, ఆఫ్ఘనిస్తాన్‌, ఇరాక్‌ ఆపరేషన్లలో ఈ బాంబర్లు కీలక పాత్ర పోషించాయి. అణు బాంబుల నుంచి అత్యాధునిక క్రూయిజ్‌ క్షిపణుల వరకు మోసుకెళ్లగల సామర్థ్యం దీనికి ఉంది.

దీని ప్రారంభ ఉత్పత్తి కాలంలో ఒక్క బీ-52 విమానం ఖర్చు సుమారు 14 మిలియన్‌ డాలర్లకు చేరువగా ఉండేది. కానీ ఆధునికీకరణలు, అప్‌గ్రేడ్లు కలిపితే ప్రస్తుత విలువ మరియు నిర్వహణ వ్యయం వందల మిలియన్‌ డాలర్ల స్థాయికి చేరినట్లు రక్షణ విశ్లేషణలు పేర్కొంటాయి. ఇప్పటికీ కొత్త ఇంజిన్లు, అవియానిక్స్‌, ఆయుధ వ్యవస్థలతో దీన్ని నిరంతరం అప్‌గ్రేడ్‌ చేస్తూ వస్తున్నారు.

మరోవైపు రష్యా టీయూ-22 బాంబర్‌ కుటుంబానికి చెందిన టీయూ-22ఎం3 వెర్షన్‌ 1980లలో సేవల్లోకి వచ్చింది. నాటో దేశాలు దీనిని "బ్యాక్‌ఫైర్‌"గా పిలుస్తాయి. సోవియట్‌ యుగం నుంచి రష్యా వ్యూహాత్మక వైమానిక శక్తిలో ఇది కీలక భాగంగా కొనసాగుతోంది. సిరియా, ఉక్రెయిన్‌ యుద్ధాల్లో కూడా ఈ బాంబర్లను వినియోగించారు. ఖెచ్‌-22 క్రూయిజ్‌ క్షిపణులు, అలాగే ఆధునిక హైపర్‌సోనిక్‌ ఆయుధాలు మోసుకెళ్లగల సామర్థ్యం దీని ప్రధాన బలం.

టీయూ-22ఎం3 ఖర్చు విషయానికి వస్తే, సోవియట్‌ కాల అంచనాలు మరియు ఆధునిక పునర్మూల్యాంకనాల ప్రకారం ఒక్క విమానం ఉత్పత్తి వ్యయం సుమారు 40–50 మిలియన్‌ డాలర్ల మధ్యగా భావించబడుతుంది. అయితే ఆయుధ సమీకరణ, నిర్వహణ, ఆధునికీకరణతో కలిపితే దీని మొత్తం జీవన వ్యయం గణనీయంగా పెరుగుతుంది.

బలం విషయానికి వస్తే.. బీ-52 విమానం దాదాపు 31 టన్నుల వరకు ఆయుధాలను మోసుకెళ్లగలదు. గాల్లో ఇంధనం నింపుకుంటే వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను చేరుకుని దీర్ఘదూర దాడులు చేయగల సామర్థ్యం దీనికి ఉంది. మరోవైపు టీయూ-22ఎం3 సూపర్‌సోనిక్‌ వేగంతో ప్రయాణించగలదు. సముద్రంలోని యుద్ధ నౌకలు, భూభాగంలోని వ్యూహాత్మక స్థావరాలపై వేగవంతమైన దాడుల కోసం దీన్ని ప్రత్యేకంగా రూపొందించారు.

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. కోల్డ్‌వార్‌ ముగిసి మూడు దశాబ్దాలకు పైగా గడిచినా అమెరికా, రష్యా ఇప్పటికీ ఈ పాత తరం బాంబర్లపైనే ఎక్కువగా ఆధారపడుతున్నాయి. దీనికి ప్రధాన కారణం కొత్త వ్యూహాత్మక బాంబర్ల అభివృద్ధికి అయ్యే భారీ వ్యయం!. ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణులు, అణు జలాంతర్గాములు, హైపర్‌సోనిక్‌ ఆయుధాల అభివృద్ధితో బాంబర్ల ప్రాధాన్యం కొంత తగ్గినప్పటికీ.. అణు నిరోధక వ్యూహంలో వీటి పాత్ర మాత్రం ఇప్పటికీ కీలకంగానే ఉంది.

అమెరికా ప్రస్తుతం అత్యాధునిక బీ-21 రైడర్‌ స్టెల్త్‌ బాంబర్‌ను అభివృద్ధి చేస్తుండగా.. రష్యా పాక్‌-డీఏ ప్రాజెక్టుపై పనిచేస్తోంది. అయితే సాంకేతిక సవాళ్లు, భారీ వ్యయభారం, పరీక్షల్లో జాప్యం కారణంగా ఈ ప్రాజెక్టులు ఇంకా పూర్తిస్థాయిలో సేవల్లోకి రాలేదు. ఫలితంగా 1950ల, 1980ల కాలానికి చెందిన ఈ గగన దిగ్గజాలే ఆధునికీకరణలతో ఇప్పటికీ సేవలు అందిస్తున్నాయి.

ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా అణు శక్తికి ప్రతీకగా నిలిచిన బీ-52, రష్యా వ్యూహాత్మక బలానికి చిహ్నంగా భావించే టీయూ-22ఎం3 బాంబర్లు ఒకే రోజు ప్రమాదాలకు గురికావడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కోల్డ్‌ వార్‌ ప్రత్యర్థులైన రెండు దేశాలకు ఒకేసారి ఎదురైన ఈ అరుదైన ఎదురుదెబ్బ.. ప్రపంచ సైనిక వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపింది.

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
USA
Russia
war planes
shock
cold war
Web Special
సంబంధిత పోల్స్
Loading..

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.