Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. International
  3. చంద్రుడి ఒడిలో ‘ఒడిస్సియస్’!
ADVERTISEMENT 

చంద్రుడి ఒడిలో ‘ఒడిస్సియస్’!

International Sakshi User Sakshi Sakshi Time Feb 23, 2024 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
usa.jpg

జాబిలిపైకి ల్యాండర్ల పరంపర కొనసాగుతోంది. జపాన్ ‘మూన్ స్నైపర్’ ల్యాండర్ తర్వాత తాజాగా అమెరికా వంతు వచ్చింది. అర్ధ శతాబ్దం తర్వాత చంద్రుడిపై మరోమారు అగ్రరాజ్యం జెండా రెపరెపలాడింది. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో హూస్టన్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రైవేటు సంస్థ ‘ఇంట్యూటివ్ మెషీన్స్’ రూపొందించిన ‘ఒడిస్సియస్’ (నోవా-సీ శ్రేణి) ల్యాండర్ జాబిలి ఉపరితలంపై దక్షిణ ధ్రువం చేరువలోని ‘మాలాపెర్ట్ ఎ’ బిలంలో దిగ్విజయంగా దిగింది. తొలుత ల్యాండర్ నేవిగేషన్ వ్యవస్థలోని లేజర్ రేంజిఫైండర్లలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో మిషన్ కంట్రోల్ కేంద్రంలోని శాస్త్రవేత్తలు ఆందోళన చెందారు. దీంతో ల్యాండర్ దిగాల్సిన నిర్దేశిత సమయంలో కొంత జాప్యం సంభవించినప్పటికీ భారత కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున 4:53 గంటలకు అది క్షేమంగా చంద్రుడిపై దిగి భూమికి సంకేతం పంపింది.

‘మాలాపెర్ట్ ఎ’ అనేది చంద్రుడి దక్షిణ ధృవానికి 300 కిలోమీటర్ల దూరంలో 85 డిగ్రీల దక్షిణ అక్షాంశ ప్రాంతంలో నెలకొన్న ఓ చిన్న బిలం. బెల్జియంకు చెందిన 17వ శతాబ్దపు ఖగోళ శాస్త్రవేత్త చార్లెస్ మాలాపెర్ట్ పేరును దానికి పెట్టారు. చంద్రుడి దక్షిణ ధ్రువానికి అతి సమీపంలో దిగిన వ్యోమనౌకగా చరిత్ర సృష్టించిన ‘ఒడిస్సియస్’… ఆ విషయంలో గత ఏడాది మన చంద్రయాన్-3 ‘విక్రమ్’ ల్యాండర్ పేరిట ఉన్న రికార్డును బద్దలుకొట్టడం విశేషం.

‘ఒడిస్సియస్’ ల్యాండరుకు ‘ఇంట్యూటివ్ మెషీన్స్’ సంస్థ ఉద్యోగులు పెట్టుకున్న ముద్దు పేరు ‘ఒడీ’. ఈ మానవరహిత చంద్రయాత్రకు మిషన్ ‘ఐఎం-1’గా నామకరణం చేశారు. జీవితకాలం ఏడు రోజులే! పూర్తిగా ఓ ప్రైవేటు కంపెనీ తయారీ-నిర్వహణలో ల్యాండర్ ఒకటి చంద్రుడి ఉపరితలంపై సజావుగా దిగడం ఇదే తొలిసారి. సాంకేతిక అవాంతరాలు ఎదుర్కొన్నప్పటికీ జపాన్ ‘స్లిమ్’ ల్యాండర్ మాదిరిగా తలకిందులుగా కాకుండా ‘ఒడిస్సియస్’ నిటారుగానే దిగినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. షడ్భుజి ఆకృతితో, సిలిండర్ ఆకారంలో టెలిఫోన్ బూత్ కంటే కాస్త పెద్ద పరిమాణంలో ఉన్న ఈ ల్యాండరులో 100 కిలోల బరువైన ఐదు ‘నాసా’ పరికరాలు, ఇతర వాణిజ్య సంస్థలకు చెందిన ఆరు శాస్త్రీయ పరికరాలు (పేలోడ్స్) ఉన్నాయి. అవి చంద్రుడిపై పరిశోధనలు నిర్వహిస్తాయి.

వీటిలో లేజర్ రెట్రో రిఫ్లెక్టర్, ఐఎల్ఓ-ఎక్స్ అబ్జర్వేటరీ (టెలిస్కోప్) ఉన్నాయి. జాబిలిపై ‘ఒడిస్సియస్’ జీవితకాలం కేవలం ఏడు రోజులు. మరో వారం రోజుల్లో అది దిగిన ప్రదేశంలో సూర్యాస్తమయం అవుతుంది. కనుక ల్యాండర్ పనిచేయడానికి సౌరశక్తి లభించదు. చంద్రుడి ఉపరితలంతో అంతరిక్ష వాతావరణం చర్యనొందే విధానం, రేడియో ఆస్ట్రానమీ, చంద్రావరణానికి సంబంధించిన డేటాను ‘నాసా’ పేలోడ్స్ సేకరించనున్నాయి. అమెరికా చివరిసారిగా 1972లో చేపట్టిన ‘అపోలో-17’ మానవసహిత యాత్రలో వ్యోమగాములు జీన్ సెర్నాన్, హారిసన్ ష్మిట్ చంద్రుడి నేలపై నడయాడారు. ఆ తర్వాత అమెరికా వ్యోమనౌక ఒకటి నియంత్రిత విధానంలో చంద్రుడిపై దిగడం ఇదే మొదటిసారి. చైనా కంటే ముందుగా తమ ‘ఆర్టెమిస్’ యాత్రతో త్వరలో జాబిలిపైకి తమ వ్యోమగాములను పంపాలని అమెరికా భావిస్తోంది.

ఈ నేపథ్యంలో ‘ఒడిస్సియస్’ సేకరించే సమాచారం కీలకం కానుంది. చంద్రుడిపైకి ప్రైవేటు ల్యాండర్లను ప్రయోగించడానికి ఉద్దేశించిన తన కమర్షియల్ లూనార్ పేలోడ్ సర్వీసెస్ ప్రాజెక్టులో భాగంగా ‘నాసా’ వెయ్యి కోట్ల రూపాయల విలువైన ఈ మిషన్ కాంట్రాక్టును ‘ఇంట్యూటివ్ మెషీన్స్’కు కట్టబెట్టింది. చంద్రుడి సూక్ష్మ శిల్పానికి గాంధీ పేరు! ఆరు కాళ్లపై నిలబడే ‘ఒడిస్సియస్’ ల్యాండర్ ఎత్తు 4 మీటర్లు కాగా, వెడల్పు సుమారు 2 మీటర్లు. ప్రయోగ సమయంలో ల్యాండర్ బరువు 1,908 కిలోలు. ఈ నెల 15న ఫ్లోరిడాలోని కేప్ కెనెవరాల్ నుంచి కెన్నెడీ అంతరిక్ష కేంద్రం వేదికగా ఇలాన్ మస్క్ సంస్థ ‘స్పేస్-ఎక్స్’కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్ సాయంతో దాన్ని ప్రయోగించారు. భూమి నుంచి చూస్తే చంద్రుడిలో కనిపించే 62 దశలు, అంతరిక్షంలోని ఇతర ప్రాంతాల నుంచి చూస్తే చంద్రుడిలో అగుపించే మరో 62 దశలు, ఒక చంద్రగ్రహణం... మొత్తం కలిపి చంద్రుడి 125 దశలను ప్రతిబింబించే సూక్ష్మ శిల్పాలను ఓ పెట్టెలో పెట్టి ల్యాండరులో అమర్చడం విశేషం.

వీటిని అమెరికన్ కళాకారుడు జెఫ్ కూన్స్ రూపొందించారు. ఒక్కో బుల్లి శిల్పం వ్యాసం అంగుళం. ఈ శిల్పాలకు మానవ చరిత్రలో అత్యంత ప్రాముఖ్యమున్న అరిస్టాటిల్, లియోనార్డో డా విన్సీ, గాంధీ, డేవిడ్ బౌయీ, బిల్లీ హాలిడే తదితరుల పేర్లు పెట్టారు. భూమికి ‘ఒడిస్సియస్’ ల్యాండర్ పంపిన సంకేతం బలహీనంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఫలితంగా ల్యాండర్ భవితపై అనిశ్చితి నెలకొంది. దీంతో మిషన్ కంట్రోల్ కేంద్రంలో హర్షధ్వానాలు, విజయోత్సవాలను రద్దు చేశారు. ల్యాండర్ సంకేతాలను మెరుగుపరచేందుకు ‘ఇంట్యూటివ్ మెషీన్స్’ శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు.

::: జమ్ముల శ్రీకాంత్

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Japan
Moon
USA
Lunar
Sniper
operations
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

భీకరంగా మారిన అమెరికా-ఇరాన్‌ యుద్ధం!

భీకరంగా మారిన అమెరికా-ఇరాన్‌ యుద్ధం!

ప్రపంచకప్‌ నుంచి అమెరికా నిష్క్రమణ

ప్రపంచకప్‌ నుంచి అమెరికా నిష్క్రమణ

జపాన్‌తో కాలానుగుణ ఒప్పందాలు

జపాన్‌తో కాలానుగుణ ఒప్పందాలు

హార్మూజ్‌పై ఇరాన్ షాకింగ్‌ కామెంట్స్‌.. స్ట్రాంగ్‌ వార్నింగ్

హార్మూజ్‌పై ఇరాన్ షాకింగ్‌ కామెంట్స్‌.. స్ట్రాంగ్‌ వార్నింగ్

పాక్‌పై అమెరికా సెనేటర్ల నిప్పులు: లాడెన్‌ను దాచారంటూ ఆగ్రహం!

పాక్‌పై అమెరికా సెనేటర్ల నిప్పులు: లాడెన్‌ను దాచారంటూ ఆగ్రహం!

వాన్స్‌ను ముందుకు నెట్టి.. ట్రంప్‌ సేఫ్‌ గేమ్?

వాన్స్‌ను ముందుకు నెట్టి.. ట్రంప్‌ సేఫ్‌ గేమ్?

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.