Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. International
  3. కోవిడ్‌-19 : బాంబు పేల్చిన తులసి గబ్బార్డ్‌
ADVERTISEMENT 

కోవిడ్‌-19 : బాంబు పేల్చిన తులసి గబ్బార్డ్‌

International Sakshi User Sakshi Sakshi Time Jun 19, 2026 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Top-US-Scientist-Funded-Wuhan-Lab_0.jpg

ప్రపంచాన్ని  గడ గడలాడించిన మహమ్మారి కోవిడ్‌-19 వైరస్‌ మూలాలపై అమెరికా జాతీయ నిఘా సంస్థ మాజీ డైరెక్టర్ తులసి గబ్బార్డ్  వెళుత వెళుతూ బాంబు పేల్చారు.  చైనాలోని వుహాన్ ల్యాబ్‌కు ఆంథోనీ ఫౌచీ నిధులు ఇచ్చారు, కోవిడ్ వాస్తవాలను దాచారంటూ అమెరికా మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ తులసి గబ్బార్డ్ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తున్నాయి. కరోనా వైరస్ పుట్టుక, వ్యాప్తికి సంబంధించి ఇప్పటికీ సాగుతున్న వివాదంలో సరికొత్త అగ్గి రాజేశారు.

అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ మాజీ చీఫ్ మెడికల్ అడ్వైజర్ డాక్టర్ ఆంథోనీ ఫౌచీ చైనాలోని వుహాన్ రీసెర్చ్ ల్యాబ్‌కు నిధులు సమకూర్చారని, ఈ ల్యాబ్ నుంచే కోవిడ్-19 మహమ్మారి వ్యాపించిందని అమెరికా అవుట్‌గోయింగ్ డీఎన్‌ఐ చీఫ్‌ తులసి గబ్బార్డ్ సంచలన ఆరోపణలు చేశారు. తన అనారోగ్యంతో ఉన్న భర్తను చూసుకోవడానికి గత నెలలో డోనాల్డ్ ట్రంప్ ఇంటెలిజెన్స్ చీఫ్ పదవికి రాజీనామా చేసిన తులసి గబ్బార్డ్ మాట్లాడుతూ.. నిజాన్ని దాచడానికి ఆంథోనీ ఫౌచీ ఉపయోగించిన వ్యూహాలు "డీప్ స్టేట్ ప్లేబుక్" ( తెరవెనుక శక్తుల వ్యూహం) నుండి వచ్చినవేనని అన్నారు.

తన పదవీకాలం చివరి రోజున కొన్ని ‘ఇంతకుముందెన్నడూ చూడని’ రహస్య పత్రాలను విడుదల చేస్తూ ఈ విషయాలను వెల్లడించారు. 2020లో అమెరికాకు కోవిడ్ సోకినప్పుడు బైడెన్ ప్రభుత్వానికి నేతృత్వం వహించిన ఫౌచీ, వుహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (WIV)లో "బాట్ (గబ్బిలం) కరోనావైరస్‌లపై ప్రమాదకరమైన గెయిన్-ఆఫ్-ఫంక్షన్ (gain-of-function) పరిశోధనల" కోసం అమెరికా పన్ను చెల్లింపుదారుల మిలియన్ల డాలర్ల నిధులను అందించారని గబ్బార్డ్ పేర్కొన్నారు. వైరస్ ల్యాబ్ నుండి లీక్ అయిందనే నిజాన్ని కప్పి పుచ్చడానికి ఫౌచీ కెరీర్ లీడర్‌షిప్‌తో కలిసి పనిచేశారని తులసి గబ్బార్డ్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

ఇదీ చదవండి: 60 ఏళ్లకి లవ్‌, 75 రోజులకే పెళ్లి : నటి లవ్‌ స్టోరీ

ట్రిలియన్ డాలర్ల వ్యాక్సిన్ వ్యాపారం కోసం
వైరల్ పరిశోధనల గురించి ఇంటెలిజెన్స్ అధికారులతో జరిపిన చర్చలపై 2024లో కాంగ్రెస్ (అమెరికా పార్లమెంట్) ముందు ప్రమాణం చేసి ఫౌచీ అబద్ధాలు చెప్పారని వెల్లడించింది.  డిసెంబర్ 2022లో పదవి నుంచి వైదొలగే వరకు 38 ఏళ్లపాటు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ (NIAID)కు అధిపతిగా పనిచేసిన 85 ఏళ్ల ఫౌచీ, పెద్ద ఫార్మా కంపెనీలతో చేతులు కలిపి "రిస్కీ కరోనావైరస్ పరిశోధనల"కు నిధులు ఇచ్చారని గబ్బార్డ్ కార్యాలయం ఆరోపించింది. ట్రిలియన్ల డాలర్ల విలువైన "యూనివర్సల్ వ్యాక్సిన్ల" వేట కోసం ఇదంతా జరిగిందని పేర్కొంది.

ఇదీ చదవండి: బీమా లేకుండానే చీప్‌గా కాంటాక్ట్ లెన్స్‌ : అమెరికన్‌ మహిళ సంబరం

డాక్టర్ ఫౌచీ వంటి రాజకీయ ప్రేరేపిత,స్వార్థపూరిత నాయకులు తమ సొంత తప్పులను, అధికార దుర్వినియోగాన్ని కప్పిపుచ్చు కున్నారు, ఇంటెలిజెన్స్‌ను తారుమారు చేశారు, కాంగ్రెస్‌కు అబద్ధాలు చెప్పారు, దేశాన్ని సురక్షితంగా ఉంచడానికి అవసరమైన కీలక వాస్తవాలను తెలుసుకోకుండా చట్టబద్ధంగా ఎన్నికైన అధ్యక్షుడిని అడ్డుకోవడం ద్వారా ఆయనను బలహీన పరిచారంటూ ఆమె ధ్వజమెత్తారు.

"కోవిడ్-19 మహమ్మారి మిలియన్ల మంది అమెరికన్లకు ,ప్రపంచవ్యాప్తంగా లెక్కలేనన్ని మందికి అపారమైన కష్టాలను, నష్టాన్ని మిగిల్చింది. ఏళ్ల తరబడి సాగిన అబద్ధాలు, సెన్సార్‌షిప్ కప్పిపుచ్చుకునే ధోరణుల తర్వాత, అమెరికా ప్రజలకు పారదర్శకత, నిజం మరియు జవాబుదారీతనం లభించాల్సిన అవసరం ఉంది."  అని తులసి గబ్బార్డ్ వ్యాఖ్యానించారు. 

అంతేకాదు జూన్ 2024లో జరిగిన పబ్లిక్ కాంగ్రెస్ విచారణలో ఫౌచీ అబద్ధాలు చెప్పారని ఆమె కార్యాలయం స్పష్టం చేసింది. మహమ్మారికి ముందు లేదా తర్వాత వైరల్ పరిశోధనలకు సంబంధించి ఎఫ్‌బీఐ (FBI), సీఐఏ (CIA), డీఐఏ (DIA) లేదా ఏదైనా యూఎస్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీతో మాట్లాడారా అని ఫౌచీని పదే పదే ప్రశ్నించినపుడు  ఆయన మాట దాటవేశారని, కోవిడ్ గురించి నాకు తెలిసి తప్పు మాట్లాడలేదని తప్పుడు ప్రకటన చేశారని పేర్కొంది.

ఫౌచీ కోవిడ్ నివేదికలను సవాలు చేసిన ఇంటెలిజెన్స్ విశ్లేషకులు ప్రతీకార చర్యలను ఎదుర్కొన్నారని, వారిని పక్కన పెట్టడంతోపాటు, వారి కెరీర్‌కు నష్టం వాటిల్లిందని పలువురు విజిల్ బ్లోవర్ల సాక్ష్యాలు వెల్లడిస్తున్నాయి, ఈ భయాల వల్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తపరిచే వారి నోళ్లు మూయించారని గబ్బార్డ్ కార్యాలయం వెల్లడించింది. 

అయితే, ఈ ఆరోపణలపై డాక్టర్ ఆంథోనీ ఫౌచీ నుండి ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదు. 

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
scientist
funded
Wuhan
tulsi gabbard
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

2026 ఎల్ నినో హెచ్చరిక..ఉన్న భయాలు - అసలు నిజాలు

2026 ఎల్ నినో హెచ్చరిక..ఉన్న భయాలు - అసలు నిజాలు

30 దేశాలు.. 120 బయోల్యాబ్స్‌ - అమెరికా ఫండింగ్?

30 దేశాలు.. 120 బయోల్యాబ్స్‌ - అమెరికా ఫండింగ్?

'హవానా సిండ్రోమ్' టెస్టింగ్‌ : నార్వే సైంటిస్ట్‌కు చుక్కెదురు

'హవానా సిండ్రోమ్' టెస్టింగ్‌ : నార్వే సైంటిస్ట్‌కు చుక్కెదురు

ఎవరీ వంది వర్మ...? మార్స్‌ రోవర్స్‌ తొలి ప్లాన్‌ డ్రైవ్‌..

ఎవరీ వంది వర్మ...? మార్స్‌ రోవర్స్‌ తొలి ప్లాన్‌ డ్రైవ్‌..

రెస్టారెంట్‌ మేనేజర్‌గా ఇస్రో శాస్త్రవేత్త..!

రెస్టారెంట్‌ మేనేజర్‌గా ఇస్రో శాస్త్రవేత్త..!

కర్ణాటకలో అద్భుతం : ఇది ‘మామూలు చిరుత’ కాదు

కర్ణాటకలో అద్భుతం : ఇది ‘మామూలు చిరుత’ కాదు

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.