Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. International
  3. మదురో బయటపడేందుకు ఏకైక మార్గం ఇదేనా!
ADVERTISEMENT 

మదురో బయటపడేందుకు ఏకైక మార్గం ఇదేనా!

International Sakshi User Sakshi Sakshi Time Jan 5, 2026 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Maduro.jpg

ప్రపంచానికి తానే పోలీసోడినని.. జడ్జినని ట్రంప్‌ నేతృత్వంలోని అమెరికా అనుకుంటోందా?. అందుకే వేరే దేశాల్లోకి చొరబడి మరీ అధినేతలను ఎత్తుకొస్తోందా?. నిన్న వెనెజువెలా?.. రేపు మరో దేశానికి ఈ పరిస్థితి రాకుండా ఉంటుందా?.. ఇలాంటి ప్రశ్నలతో కూడిన చర్చ నడుస్తోంది ఇప్పుడు. మొన్నటిదాకా అధ్యక్ష హోదాలో గౌరవం అందుకున్న నికొలస్‌ మదురో.. ఇప్పుడు ఈ భూమ్మీద నరకంగా పేరున్న న్యూయార్క్‌ బ్రూక్లిన్‌ జైల్లో ఖైదీగా ఉన్నారు. ఆయన అక్కడి నుంచి బయటపడే మార్గం ఉందా?.. 

మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోర్స్‌పై ‘నార్కో-టెర్రరిజం’ కేసు నమోదు చేసింది అమెరికా డ్రగ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌. నార్కో-టెర్రరిజం కుట్ర, కొకైన్‌ దిగుమతి, మెషీన్‌ గన్స్, విధ్వంసకర ఆయుధాలను కలిగి ఉండటం వంటి అభియోగాలను మోపారు. డ్రగ్స్‌ రవాణా కోసం కిడ్నాప్‌లు, వాళ్లపై దాడులు చేయడంవంటి కేసులనూ పెట్టారు. వారు డబ్బులు ఇవ్వకపోవడంతో వారిని హింసించేవారని అదనపు అభియోగాలు నమోదు చేశారు. ఈ పరిస్థితుల్లో ఆయన బయటపడే మార్గాలు చాలా పరిమితంగా ఉన్నాయని నిపుణులు అంటున్నారు. 

  • మదురో ముందున్న అమెరికా కోర్టులో తాను నిర్దోషినని నిరూపించుకోవడం.. ఇది అత్యంత కఠినమైన మార్గం. ఎందుకంటే అది అమెరికా ఫెడరల్ కోర్టు. పైగా ట్రంప్‌ ప్రభుత్వం ఎలాగైనా సరే బలమైన సాక్ష్యాలు సమర్పించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో.. ఆయన నేరం ఒప్పుకున్నా.. ఒప్పుకోకపోయినా శిక్ష తప్పించుకోవడం చాలా కష్టమే. అయితే మరణశిక్ష పడకపోవచ్చని.. అమెరికా చట్టాల ప్రకారం జీవితఖైదే పడొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 
     
  • రెండోది.. కుదిరితే రాజకీయ ఒత్తిళ్లు కుదరకుంటే దౌత్య చర్చలు. వెనెజువెలా తాత్కాలిక ప్రభుత్వం లేదంటే దాని మిత్రదేశాలు అమెరికాపై ఒత్తిడి తెచ్చి మదురో విడుదల కోసం ప్రయత్నించవచ్చు. 
     
  • మూడోది ప్రత్యేక ఒప్పందం (deal). అమెరికా-వెనెజువెలా మధ్య ఏదైనా రాజకీయ లేదంటే వ్యూహాత్మక ఒప్పందం కుదరడం. అప్పుడు ఆయన విడుదలకు అవకాశం ఉంటుంది. మూడు ఆప్షన్లలో మూడో దానికే ఎక్కువ ఆస్కారం ఉండొచ్చని విశ్లేషకులూ చెబుతున్నారు. మదురోకు అత్యంత విశ్వసనీయురాలైన డెల్సీ రోడ్రిగ్జ్‌ ప్రస్తుతానికి వెనెజువెలా అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. ఆమెకు అమెరికా చమురు పరిశ్రమలోని రిపబ్లికన్లతో, అలాగే వాల్‌స్ట్రీట్‌తోనూ మంచి సంబంధాలే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆమె తల్చుకుంటే డీల్‌ కుదిరే అవకాశమున్నట్లు తెలుస్తోంది. 

ముమ్మాటికీ అక్రమ అరెస్టే!
ఎక్స్‌ట్రాడిషన్‌ అనేది ఒక దేశం నుండి మరొక దేశానికి నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని అప్పగించే చట్టపరమైన ప్రక్రియ. ఒక దేశాధినేతను మరొక దేశం సైనిక చర్య ద్వారా పట్టుకోవడం అంతర్జాతీయ చట్టానికి విరుద్ధం. అయితే అమెరికా దృష్టిలో ఇది తమ దేశానికి సంబంధించిన భద్రతా చర్య. ఇదే విషయంపై ఫెడరల్‌ కోర్టుల్లో ట్రంప్‌ సర్కార్‌ వాదనలు వినిపించొచ్చు. కానీ, అంతర్జాతీయ చట్టం ప్రకారం ఇది  ఆ దేశ సార్వభౌమాధికార ఉల్లంఘన.. అక్రమ అరెస్టే అవుతుందని నిపుణులు చెబుతున్నారు . 

మదురో అక్రమ అరెస్ట్‌కు మద్దతు కంటే ఆందోళనే ఎక్కువగా వ్యక్తం అవుతోంది. అమెరికా చర్యను యూరోపియన్‌ యూనియన్‌ ఖండించింది. ఛాథమ్ హౌస్ (UK Think Tank).. ఇలాంటి చర్యలకు అంతర్జాతీయ చట్టంలో ఎలాంటి న్యాయబద్ధత లేదని స్పష్టంగా పేర్కొంది. కాబట్టి అమెరికా సైనిక చర్య అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన కిందకే వస్తుంది. అయితే.. యూఎన్‌ చార్టర్‌ ప్రకారం ఒక దేశం మరొక దేశంపై సైనిక చర్య తీసుకోవడానికి భద్రతా మండలి అనుమతి అవసరం. కానీ, ట్రంప్‌ అలాంటి అనుమతులు తీసుకోకుండానే వెనెజువెలా అధ్యక్షుడిని బంధించారు. దీనిపై ఆయన ఎలాంటి వివరణ ఇచ్చుకుంటారో చూడాలి. అదే సమయంలో.. ఇవాళ జరగబోయే అత్యవసర సమావేశంపై ఉత్కంఠ నెలకొంది. 

అమెరికా చట్టసభలోనూ..
అటు అమెరికా పార్లమెంట్‌(కాంగ్రెస్‌లోనూ).. ఈ అక్రమ అరెస్ట్‌ చట్టబద్ధతపై పలు అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. వెనెజువెలా పడవలపై దాడులు చేయడాన్ని డెమొక్రట్లతో పాటు ట్రంప్‌ సొంత పార్టీ రిపబ్లికన్లూ ఖండించారు. ఇప్పుడు వాళ్లకు తెలియకుండా ఆ దేశంపై విరుచుకుపడటం, అధ్యక్షుడిని తీసుకురావడంపై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌ అనుమతి లేకుండా చేపట్టిన ఈ ఆపరేషన్‌ను కోర్టుల్లోనూ తేల్చుకునే అవకాశం లేకపోలేదు.

ఐసీజేలో..
అంతర్జాతీయ న్యాయస్థానం సాధారణంగా ఇలాంటి వ్యవహారాల్లో తనంతట తానుగా జోక్యం చేసుకోదు.  వెనెజువెలాగానీ ఏదైనా ఇతర దేశాలుగానీ అమెరికా చర్యపై అధికారికంగా కేసు వేస్తే విచారణ చేపట్టే అవకాశం ఉంటుంది. అదే జరిగితే.. మదురో అరెస్ట్‌ అమెరికాతో పాటు అంతర్జాతీయ భద్రత కోసం అవసరం అని వాదించే అవకాశం లేకపోలేదు.

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
nicolas maduro
Venezuela
USA
Brooklyn
Donald trump
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

హర్ముజ్‌ జలసంధిపై కొత్త ఆధిపత్య పోరు!

హర్ముజ్‌ జలసంధిపై కొత్త ఆధిపత్య పోరు!

మళ్లీ ట్రిగ్గర్‌ నొక్కిన ట్రంప్.. మరింత ముదిరిన యుద్ధం

మళ్లీ ట్రిగ్గర్‌ నొక్కిన ట్రంప్.. మరింత ముదిరిన యుద్ధం

పుతిన్‌ తగ్గేదేలే.. మళ్లీ మంటలు రేపే యుద్ధమా?

పుతిన్‌ తగ్గేదేలే.. మళ్లీ మంటలు రేపే యుద్ధమా?

భీకరంగా మారిన అమెరికా-ఇరాన్‌ యుద్ధం!

భీకరంగా మారిన అమెరికా-ఇరాన్‌ యుద్ధం!

ప్రపంచకప్‌ నుంచి అమెరికా నిష్క్రమణ

ప్రపంచకప్‌ నుంచి అమెరికా నిష్క్రమణ

హార్మూజ్‌పై ఇరాన్ షాకింగ్‌ కామెంట్స్‌.. స్ట్రాంగ్‌ వార్నింగ్

హార్మూజ్‌పై ఇరాన్ షాకింగ్‌ కామెంట్స్‌.. స్ట్రాంగ్‌ వార్నింగ్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.