Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. International
  3. చర్చి తరలిపోతోందిలా..!
ADVERTISEMENT 

చర్చి తరలిపోతోందిలా..!

International Sakshi User Sakshi Sakshi Time Aug 20, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
45634.jpg

స్వీడన్‌లో పురాతన చర్చి మరో చోట ఏర్పాటు 

కిరునా: అందమైన ఓ పురాతన చర్చి అలా రోడ్డుపై మెల్లగా ముందుకు వెళ్తుందంటే చూసే ఎవరికైనా ఆశ్చర్యం కలగకమానదు. స్వీడన్‌ ప్రభుత్వం అటువంటి బృహత్‌ కార్యక్రమానికి నడుం బిగించింది. కిరునా నగరంలో 113 ఏళ్ల క్రితం కలపతో నిర్మించిన ‘కిరునా కిర్కా’ను ఐదు కిలోమీటర్ల దూరంలో మరో చోట ఏర్పాటు చేయనుంది. నగరంలోని కొన్ని భవనాలతోపాటు ప్రజలకు సైతం పునరావాసం కల్పిస్తోంది. ఇదంతా ఆ నగరం చుట్టుపక్కలున్న ఇనుప ఖనిజం కోసం కావడం గమనార్హం.

ఎంతో ఇష్టమైన నిర్మాణం
స్వీడన్‌ ప్రభుత్వ ఎల్‌కేఏబీ కంపెనీ కిరునా చుట్టుపక్కల ప్రాంతంలో ప్రపంచంలోనే అతిపెద్దదైన ఇనుప ఖనిజం గనిని నిర్వహిస్తోంది. కిరునాలో గని తవ్వకాలు 1910లో మొదలు పెట్టిన ఎల్‌కేఏబీ కంపెనీయే అక్కడి గుట్టపై 1912లో ఈ లూథరన్‌ చర్చిని పూర్తిగా కలపతో నిర్మించింది. స్వీడన్‌ వాసులకు ఇది ఎంతో ఇష్టమైంది కిరునా చర్చి. 2001లో ప్రభుత్వం చేపట్టిన ఓ సర్వేలో 1950కి ముందున్న వాటిలో అత్యుత్తమ కలప నిర్మాణంగా స్వీడన్‌ ప్రజలు కిరునా చర్చికి ఓటేశారు. 

నగరానికి పునరావాసం
లోతులో చేపడుతున్న గని తవ్వకాలతో ఇప్పటికే నగరంలోని కొన్ని ఇళ్లు, నిర్మాణాలు పగుళ్లు వచ్చాయి. ఖనిజం కోసం 1,365 మీటర్ల లోతులో తవ్వకాలు చేపట్టాల్సి ఉన్నందున నివాసాలు, నిర్మాణాలకు ప్రమాదం ఉందని కంపెనీ అంచనా వేసింది. దీంతో, నగరాన్ని తరలించేందుకు 2004 నుంచే 30 ఏళ్ల ప్రణాళికను సిద్ధం చేసింది. నగరంలోని 3వేల ఇళ్లతోపాటు 6 వేల మందికి అక్కడికి 5 కిలోమీటర్ల దూరంలోని మరో ప్రాంతంలో పునరావాసం కల్పించింది. ఇప్పటికే కొన్ని ప్రభుత్వ, వాణిజ్య నిర్మాణాలను కూల్చి వేశారు. సుమారు 25 భవనాలను పునాదుల నుంచి పైకి లేపి, ప్రత్యేక వాహనాల్లో కొత్త నగరంలోకి తరలించారు. అందమైన పురాతన కిరునా చర్చి సహా మరో 16 భవనాలను తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

భారీ ట్రాలర్‌పైన ఎర్రని చర్చి
సుమారు 40 మీటర్ల వెడల్పు, 672 మెట్రిక్‌ టన్నుల బరువైన కిరునా చర్చిని తరలించేందుకు ప్రత్యేకంగా ట్రయిలర్‌ను నిర్మించారు. దీనిపైకి ఎరుపు రంగులో ఉన్న చర్చి నిర్మాణాన్ని తరలించారు. ట్రాలీ ప్రయాణించే మార్గంలోని రోడ్డు వెడల్పును 9 మీటర్ల నుంచి ఏకంగా 24 మీటర్లకు పెంచారు. ఒక వంతెనను సైతం నేలమట్టం చేశారు. 12 గంటలు పట్టే చర్చి ప్రయాణం మంగళవారం మొదలై బుధవారంతో ముగియనుంది. మధ్యలో రెండుసార్లు మాత్రం టీ విరామం కోసం ఆపుతారు. గంటకు అర కిలోమీటర్‌ నుంచి ఒకటిన్నర కిలోమీటర్ల వేగం వరకు ట్రాలీ ప్రయాణించనుంది. చర్చి తరలింపు సందర్భంగా కిరునాలో భారీ సంగీత కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. స్వీడన్‌ రాజు కార్ల్‌ గుస్తావ్‌ సైతం హాజరుకానున్నారు. కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. కొత్త నగరంలో 2026 చివరి కల్లా ఈ చర్చిని తిరిగి తెరవనున్నారు. చర్చి తరలింపునకు అయ్యే ఖర్చు వివరాలను మాత్రం మైనింగ్‌ కంపెనీ వెల్లడించలేదు. యూరప్‌లో ఉత్పత్తయ్యే ఇనుప ఖనిజంలో 80 శాతం వరకు కిరునాలోనే ఎల్‌కేఏబీ తవ్వి తీస్తోంది. భవిష్యత్తులో దీనిని మరింతగా విస్తరించేందుకు ప్రణాళికలు వేస్తోంది.

 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
church
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

న్యూ ఇయర్‌లో విషాదం : అగ్నికీలల్లో చారిత్రాత్మక వోండెల్కెర్క్ చర్చి

న్యూ ఇయర్‌లో విషాదం : అగ్నికీలల్లో చారిత్రాత్మక వోండెల్కెర్క్ చర్చి

24X7 మద్యం.. ఊరూరా సాక్ష్యం!

24X7 మద్యం.. ఊరూరా సాక్ష్యం!

సిరియాలో దారుణం.. 30 మంది మృతి

సిరియాలో దారుణం.. 30 మంది మృతి

మానవీయ మతగురువు

మానవీయ మతగురువు

సర్వమతాల భక్తులు కొలిచే సాగర్‌ మాత

సర్వమతాల భక్తులు కొలిచే సాగర్‌ మాత

సాంత్వననిచ్చే గొంతులు

సాంత్వననిచ్చే గొంతులు

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.