Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. International
  3. గ్రీన్‌లాండ్‌ నేలపై కరెన్సీ నీడలు!
ADVERTISEMENT 

గ్రీన్‌లాండ్‌ నేలపై కరెన్సీ నీడలు!

International Sakshi User Sakshi Sakshi Time Jan 9, 2026 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Greenland-People.jpg

వీలైతే యుద్ధం.. లేకపోతే శాంతి మంత్రం.. ఇది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌లో గత కొంతకాలంగా చూస్తూ వస్తున్న యాంగిల్స్‌. అయితే ఆయనలో ‘బిజినెస్‌మ్యాన్‌’ కూడా ఉన్నాడండి. తాను అనుకున్న దానిని ఏదో రకంగా దక్కించుకోవడమే ఈ బిజినెస్‌ సూత్రం. వీలేతై దేన్నైనా కొనేయడం. మనం షేర్లు కొన్నట్లు డెన్మార్క్‌లో భాగమైన గ్రీన్‌లాండ్‌ను కొనేయడానికి సిద్ధమవుతున్నారు ట్రంప్‌. అక్కడ 6 వందల బిలియన్‌ డాలర్లు వెచ్చించి ఆ ప్రాంతాన్ని సొంతం చేసుకోవడానికి సన్నద్ధమయ్యారు. ఎలాగైనా గ్రీన్‌లాండ్‌ను తమది అనిపించుకోవాలనే పట్టుదలతో ఉన్న ట్రంప్‌.. ఇక డానిష్‌ దేశానికి డబ్బు ఆశ చూపుతున్నారు. 

గ్రీన్‌లాండ్‌ నేలపై కరెన్సీ నీడను పరచడానికి ట్రంప్‌ శరవేగంగా పావులు కదుపుతున్నారు. నేటి ప్రపంచంలో డబ్బుతో అసాధ్యం కానిది ఏదీ లేదని నమ్మేవాళ్లలో ఒకరైన ట్రంప్‌.. డబ్బు అనే వలతో స్వేచ్ఛను బందించే యత్నం చేస్తున్నారు. ఈ మేరకు గ్రీన్‌లాండ్‌ (Greenland) ప్రజలకు డొనాల్డ్‌ ట్రంప్‌ భారీ ఆఫర్‌ చేశారు. స్వచ్ఛందంగా ఆ ప్రాంతాన్ని ఖాళీ చేస్తే ఆరు వందల బిలియన్‌ డాలర్లు చెల్లిస్తానని ప్రకటించారు ట్రంప్‌. ఇలా అక్కడ ప్రజల్ని ముందుగా ఖాళీ చేయించే యత్నం చేస్తున్నారు. 

ఈసారి గ్రీన్‌లాండ్‌ ప్రజలే టార్గెట్‌..
గ్రీన్‌లాండ్‌ అంటే అమెరికాకు అమితమైన ఆసక్తి. అందులోనూ ఈ దీవిపై ట్రంప్‌న‌కు ఆసక్తి మరీ ఎక్కువ. 2019లో ట్రంప్‌ తొలిసారి అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంలోనే గ్రీన్‌లాండ్‌పై బేరసారాలు జరిపారు. అప్పుడు ప్రభుత్వానికి డబ్బు ఆఫర్‌ను ప్రతిపాదించారు ట్రంప్‌.. అయితే దాన్ని డెన్మార్క్‌ తిరస్కరించింది. కానీ రెండోసారి అధ్యక్షుడైన ట్రంప్‌ మరోసారి కూడా డబ్బును వెదజల్లడానికి సిద్ధమయ్యారు. ఈసారి డెన్మార్క్‌ ప్రభుత్వాన్ని పక్కన పెట్టి.. గ్రీన్‌లాండ్‌ ప్రజలకు భారీ ఆఫర్‌ను తెరపైకి తీసుకొచ్చారు. అక్కడ ఉండే వారికి ప్రతీ వ్యక్తికి 10 వేల డాలర్ల నుంచి లక్ష డాలర్ల వరకూ ఇచ్చి ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించాలని చూస్తున్నారు. ఒకవేళ ట్రంప్‌ చూపే ఆశకు గ్రీన్‌లాండ్‌లో ఉండే వాళ్లు సిద్ధమైతే మాత్రం.. ఆ ప్రాంతాన్ని సునాయాసంగానే ట్రంప్‌ దక్కించుకునే అవకాశం ఉంటుంది. 

డబ్బు వలలో స్వేచ్ఛ బందీ కానుందా?
గ్రీన్‌లాండ్‌పై ట్రంప్‌ వ్యూహం మార్చడంతో డెన్మార్క్‌కు అంతా గందరగోళంగా ఉంది. డెన్మార్క్‌ నుంచి గ్రీన్‌లాండ్‌ను వేరు చేయడానికి చూస్తున్న ట్రంప్‌ను ఎదుర్కోవడానికి ఏం చేయాలనే యోచనలో ఉంది డెన్మార్క్‌ ప్రభుత్వం. ట్రంప్‌ ప్రకటించిన ఆఫర్‌కు గ్రీన్‌లాండ్‌ ప్రజలు లొంగితే ఇక తాము ప్రత్యక్ష యుద్ధంలోకి దిగకతప్పదనే భయం పట్టుకుంది. అగ్రరాజ్యం అమెరికా ఎదిరించి నిలబడటం అంత ఈజీ కాదని డెన్మార్క్‌కు తెలుసు. పోని వేరే దేశాలేమైనా సాయం చేస్తాయంటే అది ఎంతవరకూ జరుగతుందో అనేది చూడాలి. రష్యా, చైనా (China) వంటి దేశాలు డెన్మార్క్‌కు సాయం చేస్తే తప్పితే, గ్రీన్‌లాండ్‌ను కాపాడుకోవడం డెన్మార్క్‌కు అత్యంత కష్టమేనని విశ్లేషకులు అంటున్నారు. 

ప్రత్యేకమైన దీవి ఇది.. 
ఉత్తర అమెరికా, యూరప్‌ ఖండాలక ఇది సరిగ్గా మధ్యలో ఉంటుంది. ప్రధానంగా ఖండాంతర క్షిపణులు మందస్తు హెచ్చరికల వ్యవస్థ ఏర్పాటుకు ఇది అనువైనది. అమెరికా సైన్యానికి వ్యూహాత్మకమైన ప్రాంతంగా కూడా ఉపయోగపడుతుంది. రష్యా నావికా దళంపై అమెరికా ఎప్పుడూ కన్నేసి ఉంచడానికి కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుంది. 

యూరప్, ఉత్తర అమెరికా ఖండాలకు అది సరిగ్గా మధ్యలో ఉంటుంది. దాంతో అమెరికా సైన్యానికి వ్యూహాత్మకంగా ఈ ప్రాంతం చాలా కీలకం. అంతేగాక ఖండాంతర క్షిపణుల ముందస్తు హెచ్చరికల వ్యవస్థ ఏర్పాటుకు కూడా ఇది అత్యంత అనువైనది. వాయవ్య గ్రీన్‌లాండ్‌లోని పిటుఫిక్‌లో అమెరికాకు ఇప్పటికే సైనిక స్థావరముంది. ఇక్కడి నుంచి రష్యా నావికా దళ కదలికలపై అమెరికా అనునిత్యం స్పష్టంగా కన్నేసి ఉంచవచ్చు కూడా.

ఖనిజాల సంపదకు పెట్టింది పేరు.. 
అత్యంత అరుదైనవిగా ప్రకటించిన 34 ఖనిజాల్లో గ్రాఫైట్, లిథియం వంటి ఏకంగా 25 ఖనిజాలు గ్రీన్‌లాండ్‌లో అపారంగా ఉన్నట్టు తేలింది. అమెరికా ఈ ఖనిజాల కోసం చాలాకాలంగా చైనాపై ఆధారపడాల్సి వస్తోంది. చైనాపై విధించిన భారీ టారిఫ్‌లను కూడా అంతే వేగంగా ట్రంప్‌ వెనక్కు తీసుకోవడానికి ఈ ఖనిజాల ఎగుమతిపై డ్రాగన్‌ నిషేధం విధించడమే ప్రధాన కారణం. 

గ్రీన్‌లాండ్‌ తమకు చిక్కితే ఇకపై ఆ ఖనిజాల కోసం చైనాను బెదిరించే దురవస్థ ఉండదన్నది ట్రంప్‌ యోచనగా ఉంది. ఈ దీవి 7 దశాబ్దాల క్రితమే డెన్మార్క్‌లో భాగంగా మారింది. కాకపోతే 2019లో గ్రీన్‌లాండ్‌కు విస్తృత స్వయం పాలిత ప్రాంతంగా గుర్తింపు లభించింది. ప్రపంచంలోనే అతిపెద్ద దీవిగా ఉన్న గ్రీన్‌లాండ్‌.. డెన్మార్క్‌ నియంత్రణలోనే ఉంది. ప్రస్తుత గ్రీన్‌లాండ్‌ జనాభా కూడా లక్ష లోపే ఉంది. వారి జనాభా సుమారు 57 వేలు ఉండొచ్చని అంచనా..

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Donald trump
Greenland
USA
Denmark
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

హర్ముజ్‌ జలసంధిపై కొత్త ఆధిపత్య పోరు!

హర్ముజ్‌ జలసంధిపై కొత్త ఆధిపత్య పోరు!

మళ్లీ ట్రిగ్గర్‌ నొక్కిన ట్రంప్.. మరింత ముదిరిన యుద్ధం

మళ్లీ ట్రిగ్గర్‌ నొక్కిన ట్రంప్.. మరింత ముదిరిన యుద్ధం

పుతిన్‌ తగ్గేదేలే.. మళ్లీ మంటలు రేపే యుద్ధమా?

పుతిన్‌ తగ్గేదేలే.. మళ్లీ మంటలు రేపే యుద్ధమా?

భీకరంగా మారిన అమెరికా-ఇరాన్‌ యుద్ధం!

భీకరంగా మారిన అమెరికా-ఇరాన్‌ యుద్ధం!

ప్రపంచకప్‌ నుంచి అమెరికా నిష్క్రమణ

ప్రపంచకప్‌ నుంచి అమెరికా నిష్క్రమణ

హార్మూజ్‌పై ఇరాన్ షాకింగ్‌ కామెంట్స్‌.. స్ట్రాంగ్‌ వార్నింగ్

హార్మూజ్‌పై ఇరాన్ షాకింగ్‌ కామెంట్స్‌.. స్ట్రాంగ్‌ వార్నింగ్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.