Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. International
  3. సౌదీలో కొత్త స్మార్ట్‌ సిటీ.. టెక్నాలజీ, ప్లానింగ్‌ హైలైట్‌
ADVERTISEMENT 

సౌదీలో కొత్త స్మార్ట్‌ సిటీ.. టెక్నాలజీ, ప్లానింగ్‌ హైలైట్‌

International Sakshi User Sakshi Sakshi Time Jan 21, 2026 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Saudi-Arabia.jpg

సౌదీ అరేబియా.. అత్యంత ధనిక దేశం.. చమురు నిల్వలకు కొదవలేదు. బంగారపు కొండలూ ఉన్నాయి. మక్కాలాంటి పవిత్ర స్థలం ఉండటంతో ప్రపంచ దేశాలకు చెందిన కోట్లాది మంది ముస్లింలు పర్యటిస్తుంటారు. సాంప్రదాయాలకు అధిక విలువనిస్తూ.. మత పరమైన రాజ్యంగా గుర్తింపు పొందిన సౌదీ అరేబియాలో ఓ కొత్త నగరం సిద్ధమవుతోంది. నగరం సిద్ధం కావడమేంటా? అని ఆశ్చర్యపోతున్నారా?. అవును.. నియోమ్‌ సిటీగా దీనికి నామకరణం చేశారు.

నియోమ్‌ స్మార్ట్‌ సిటీ నిర్మాణానికి సౌదీ ప్రభుత్వం నాంది పలికింది. ప్రపంచంలోనే అత్యాధునిక, అధునాతన టెక్నాలజీతో ఆ పట్టణాన్ని తయారు చేస్తున్నారు. ఆ సిటీ తయారీ కోసం కొన్ని వేల కంపెనీలు రేయింబవళ్లు పని చేస్తున్నాయంటే సిద్ధమవుతున్న ఆ సిటీ ఎలా ఉంటుందో ఊహించడం కూడా కష్టమే.. వాస్తవంగా ఆ నగరం చూడటానికి ఒక సైన్స్ ఫిక్షన్ సినిమాలో భాగంలా కనిపిస్తుంది. అసలు ఆ నగరానికి సంబంధించిన అద్భుతమైన ప్రపోజల్ పరిశీలిస్తే.. ఈ నగరం నిజంగా రెడీ అవుతుందా?. ఇది సాధ్యమేనా?. ఈ డిజైన్‌లో నిజంగా ఏ ప్రయోజనాలున్నాయి?. ఎలాంటి నష్టాలు ఉంటాయి?. ఇలాంటి మెగా ప్రాజెక్ట్ ప్రపంచంపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే అనుమానాలు తలెత్తడం సహజమే.

సౌదీ అరేబియా దేశం పేరు వినగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేవి రెండు అంశాలు.. ఒకటి ఎడారి.. రెండోది చమురు నిల్వలు. ఎందుకంటే.. ఈ దేశం ఎక్కువగా ఎడారులతో చుట్టుముట్టి... సౌదీలో ఎటు చూసినా సాధారణ ఎడారి వాతావరణం కనిపిస్తుంది. ఎడారి దేశాన్ని.. ప్రపంచంలోనే అతి పెద్ద పర్యాటక సిటీగా మార్చాలనే ఆలోచనతో ‘నియోమ్’ అనే స్మార్ట్ సిటీని నిర్మించాలని సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ నిర్ణయించుకున్నారు. తన దేశంలోని ఒక పెద్ద ప్రాంతంలో ఆ సిటీని డెవలప్‌ చేయాలని దానికి ‘నియోమ్’ సిటీ అని నామకరణం చేశారు. నియోమ్‌ అనేది ఒక స్మార్ట్ సిటీ మాత్రమే కాదు.. ఇది ఒక పెద్ద ప్రాజెక్ట్ పేరు.

3/15 NEOM

The $1.5 trillion project isn't projected to be complete until at least 2045.

This Megacity Neom is currently using 20% of all the steel in the world. pic.twitter.com/3QPjgfs6eP

— ZOYA ✪ (@HeyZoyaKhan) December 8, 2024

సౌదీ అరేబియాలో ఉత్తర–పశ్చిమ భాగంలో రెడ్ సీ ఉత్తరాన ఉన్న ప్రాంతాన్ని ఈ సిటీ నిర్మాణానికి ఎంచుకున్నారు. సిటీ పరిమాణం దాదాపు ఉత్తరాఖండ్ రాష్ట్ర పరిమాణానికి సగానికి సమానం అని చెప్పవచ్చు. అసలు సౌదీలో అదే ప్రాంతాన్ని ఎంచుకోవడానికి కారణమేంటంటే అక్కడి వాతావరణం సౌదీ దేశంలో ఉండే వేడి వాతావరణంగా కాకుండా నార్మల్‌గా ఉంటుంది. ఆ సిటీకి నియోమ్‌ పేరు పెట్టడానికి కారణాలేంటని విశ్లేషిస్తే... ప్రిన్స్‌ పేరు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ పేరు నుంచి అరబిక్‌ భాష ఆధారంగా అక్షరాలు సేకరించినట్లు సమాచారం.

నియోమ్‌ సిటీ సౌదీ అరేబియాలోని అత్యంత ఎత్తైన పర్వత ప్రాంతంలో ఉంటుంది. ఇక్కడ శీతాకాలంలో ఉష్ణోగ్రతలు 0°C కంటే తక్కువకు పడిపోతాయి. ఇక్కడి మంచును కూడా వినియోగంలోకి తీసుకోనున్నారు. ఈ ప్రాజెక్ట్‌లో అత్యంత ప్రత్యేకమైన విషయం ఏమిటంటే.. దీని డిజైన్. 170 కిలోమీటర్ల పొడవైన ఒక లైన్. ఈ నగరం 200–500 మీటర్ల ఎత్తైన స్కై స్క్రేపర్ల మధ్య నిర్మించనున్నారు. ఇవి లీనియర్ ఫార్మ్‌లో ఉంటాయి. ఈ నగరం బయట వాతావరణం నుండి పూర్తిగా సంబంధం లేకుండా లోపలే స్వయం సమృద్ధిగా ఉండేలా డిజైన్ చేస్తున్నారు. న్యూయార్క్ నగర పరిమాణం కంటే దాదాపు 20 రెట్లు పెద్ద నగరం ఇది. 26,500 చదరపు కిలోమీటర్లు.. 10,500 చదరపు మైళ్ల వైశాల్యంలో ఈ నగరం సిద్ధమవుతోంది. కాబట్టి ఫుట్‌ప్రింట్ చాలా పెద్దది. నగరంలో మల్టిపుల్ లేయర్లు ఉంటాయి. పార్కులు, గ్రీన్ స్పేస్‌లు ఉంటాయి. 170 కిలోమీటర్ల పొడవైన లైన్ కావడంతో హై-స్పీడ్ రవాణా వ్యవస్థను వినియోగిస్తున్నారు.

అయితే ఈ ప్రాజెక్ట్‌లో సమస్యలు కూడా ఉన్నాయి. అందులో ప్రధాన సమస్య ఫైనాన్స్. కొన్ని నివేదికల పరిశీలనల ఆధారంగా ఈ ప్రాజెక్ట్ 2050 వరకు కూడా పూర్తికాకపోవచ్చు. సిటీ నిర్మాణానికి మొత్తం ఖర్చు 1 ట్రిలియన్ డాలర్ల దాకా.. అంటే ఇండియన్‌ కరెన్సీలో 85 లక్షల కోట్ల రూపాయలు వెచ్చించాల్సి ఉంటుంది. దానికోసం సౌదీ వద్ద వనరులు సిద్ధంగా లేకపోవడంతో పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు.. ప్లానింగ్‌కు అనుగుణంగా వినియోగించాల్సిన టెక్నాలజీ కూడా ఓ సవాలుగా మారింది. నియోమ్‌ సిటీలో ఒక చివర నుండి మరో చివర వరకు 20 నిమిషాల్లో ప్రయాణం చేయాలని నిర్ణయించారు. అంటే ప్రతి గంటకు 500 కంటే ఎక్కువ వేగం ఉండాలి.. కానీ ఇంత వేగం ఇచ్చే టెక్నాలజీ ఇప్పటివరకు లేదు. 2015లో జపాన్‌లో మాగ్లేవ్‌ ట్రైన్ టెస్ట్ రన్‌లో గంటకు 603 కిలోమీటర్‌ ప్రయాణించినప్పటికీ.. రెగ్యులర్ ఆపరేషన్లలో గంటకు 430 కిలోమీటర్లు మాత్రమే వేగం ఉంటుంది.

మరో విషయం ఏమిటంటే నియోమ్‌ సిటీలో 500 మీటర్ల ఎత్తైన గాజుతో కప్పే భవనాలను నిర్మించడం. దాని కోసం తక్కువ మోతాదులో కార్బన్‌ మెటీరియల్స్‌ వినియోగించడం దాదాపు అసాధ్యం. ఓవరాల్‌గా సిటీ నిర్మాణంతో స్థలం ఆదా అవుతున్నప్పటికీ.. సమస్యలు పెరిగే అవకాశముంది.  ఇక సౌదీ ప్రజలు ఇన్ని సవాళ్లను అధిగమించినా, ప్రజలు నిజంగా ఇక్కడ నివసించాలనుకుంటారా? అనేదీ ఇంకా ప్రశ్నగానే మిగిలి ఉంది.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Saudi Arabia
smart city
New York City
Mohammed bin Salman
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

అత్యంత స్టైలిష్‌ డిజైనర్‌వేర్‌లో మమ్దానీ భార్య రామా దువాజీ..!

అత్యంత స్టైలిష్‌ డిజైనర్‌వేర్‌లో మమ్దానీ భార్య రామా దువాజీ..!

న్యూయార్క్‌ టూర్‌ విషాదం : తల్లిని కాపాడబోయి యువకుడు దుర్మరణం

న్యూయార్క్‌ టూర్‌ విషాదం : తల్లిని కాపాడబోయి యువకుడు దుర్మరణం

‘కంపెనీని నిర్మించాను, మారథాన్‌ పూర్తి చేశా’! కానీ అమ్మమ్మ..

‘కంపెనీని నిర్మించాను, మారథాన్‌ పూర్తి చేశా’! కానీ అమ్మమ్మ..

New York: భారతీయుడి ప్రాణాలు తీసిన గుర్రపు బగ్గీ

New York: భారతీయుడి ప్రాణాలు తీసిన గుర్రపు బగ్గీ

ఆఖరి నిమిషంలో గోల్‌.. ఓటమి తప్పించుకున్న మాజీ చాంపియన్‌

ఆఖరి నిమిషంలో గోల్‌.. ఓటమి తప్పించుకున్న మాజీ చాంపియన్‌

తప్పులే మన అసలైన గురువులు

తప్పులే మన అసలైన గురువులు

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.