Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
search Subscribe Subscribe Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ Live TV లైవ్ టీవీ
download app యాప్ download app Download App
మమ్మల్ని అనుసరించండి
  • facebook
  • x
  • instagram
  • youtube
  • whatsapp
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫొటోలు
  • వీడియోలు
  • close logo
  • search
    Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ download app యాప్

    విభాగాలు

  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • మమ్మల్ని అనుసరించండి

    facebook x instagram youtube whatsapp whatsapp whatsapp
  • Sakshi Search
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV

Breadcrumb

  1. Home
  2. International
  3. బుధుడి చెంతకు ‘బెపి కొలంబో’!
ADVERTISEMENT

బుధుడి చెంతకు ‘బెపి కొలంబో’!

International Sakshi User Sakshi Sakshi Time Sep 5, 2026 07:04 AM IST Sakshi Read Time Read Time: 4 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Google
Spacecraft.jpg
  • ఈఎస్ఏ, జాక్సా సంయుక్త మిషన్
  • నవంబరు 21న బుధ కక్ష్యలోకి ‘జంట వ్యోమనౌకలు’
  • డిసెంబరు 9న విడిపోనున్న ఆర్బిటర్స్
  • వీడనున్న మెర్క్యురీ మిస్టరీ!

బుధుడు... పరిమాణంలో మన చందమామ కంటే కొంచెం పెద్ద... సౌరవ్యవస్థలో అతి చిన్న గ్రహం... సూర్యుడికి అతి దగ్గరగా ఉండే గ్రహం కూడా... దీనికి సహజ చంద్రుళ్లు లేవు. బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు... ఇవి సౌరకుటుంబంలో శిలామయ అంతర గ్రహాలు. సౌరవ్యవస్థలోని ‘పాత నవగ్రహాల’ మాటకొస్తే… ప్లూటో గతంలో గ్రహం హోదా కోల్పోవడంతో అధికారికంగా అష్టగ్రహాలే మిగిలాయి. వీటిలో భూమిని తప్పిస్తే  మిగతా ఏడు గ్రహాల్లో శాస్త్రవేత్తలు ఇప్పటివరకు అతి తక్కువగా అధ్యయనం చేసింది బుధుడి గురించే! అలాంటి బుధుడి సంగతేంతో తేల్చడానికి, ఆ గ్రహాన్ని జల్లెడపట్టి లోతుగా అధ్యయనం చేయడానికి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్ఏ), జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ (జాక్సా) సంయుక్తంగా 2018లో ‘బెపి కొలంబో’ అంతరిక్ష మిషన్ ప్రయోగించాయి. 

ఇందులో భాగంగా జంట వ్యోమనౌకలు (ఉపగ్రహాలు) ఈ ఏడాది నవంబరులో బుధుడి కక్ష్యలో ప్రవేశించనున్నాయి. 1920-1984 మధ్యకాలంలో జీవించిన జూసెప్పీ బెపి కొలంబో ఇటలీకి చెందిన ఓ గణిత శాస్త్రజ్ఞుడు. బుధ, శుక్ర గ్రహాల వద్దకు తొలిసారిగా 1970వ దశకంలో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ ప్రయోగించిన ‘మెరైనర్-10’ మిషన్లో ఆయన పాలుపంచుకున్నారు. బెపి కొలంబో సేవలను స్మరిస్తూ తాజా ప్రాజెక్టుకు ఆయన పేరు పెట్టారు. అప్పట్లో బుధ, శుక్ర గ్రహాలకు సమీపంగా వెళ్లిన ‘మెరైనర్-10’ అంతరిక్ష నౌక వాటి ఫొటోలు తీసి భూమికి పంపింది. ఆ తర్వాత 2004లో నాసా ప్రయోగించిన ‘మెసెంజర్’ వ్యోమనౌక (ఆర్బిటర్) తొలిసారిగా 2011లో బుధుడి కక్ష్యలో ప్రవేశించి 2015 వరకు ఆ గ్రహాన్ని మరింత అన్వేషించింది.


                                                                   జూసెప్పీ బెపి కొలంబో

ఇవీ బుధుడి విశేషాలు...
బుధ గ్రహం సూర్యుడి నుంచి సగటున 5.8 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బుధుడిపై ఒకరోజు భూమిపై 58 రోజులతో సమానం. అక్షంపై తన చుట్టూ తాను తిరగడానికి బుధుడు అంత సమయం తీసుకుంటాడు. అలాగే 88 రోజులకోసారి సూర్యుడి చుట్టూ పరిభ్రమణం పూర్తిచేస్తాడు. అంటే భూమిపై 88 రోజులు గడిస్తే బుధుడిపై ఏడాది పూర్తవుతుంది. బుధుడి ఉపరితల ఉష్ణోగ్రత పగటి వేళల్లో 430 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు, రాత్రి సమయాల్లో మైనస్ 180 డిగ్రీల సెంటీగ్రేడ్ దాకా ఉంటాయి. ఈ గ్రహం వ్యాసం కేవలం 4,880 కిలోమీటర్లు. వాయువులతో కూడిన అతి పలుచని పొరతో అక్కడి వాతావరణం నిర్మితమైంది. బుధుడిని ‘విస్మరించిన లేదా నిర్లక్ష్యానికి గురైన’ గ్రహంగా పిలుస్తారు. 

కారణం- మన పొరుగు గ్రహాలైన శుక్రుడు, అంగారకుడితో పోలిస్తే బుధుడిని చేరుకోవడం, భూమి నుంచి దాన్ని అధ్యయనం చేయడం బహు కష్టం. సౌరవ్యవస్థలో సూర్యుడికి బుధుడు బాగా దగ్గరగా ఉంటాడు. సూర్యుడిది అఖండ గురుత్వ శక్తి. తన సమీపంలోని ఖగోళ వస్తువులను భానుడు అమిత వేగంతో ఆకర్షిస్తూ తనలోకి లాగేసుకుంటాడు. ఆ సౌర గురుత్వాకర్షణను దీటుగా ఎదుర్కొంటూ... దానికి వ్యతిరేకంగా తన వేగాన్ని బాగా తగ్గించుకుంటూ బుధుడిని చేరడానికి వ్యోమనౌక బోలెడు ఇంధనాన్ని మండించాలి! అందుకే ఈ ప్రయాణం సంక్లిష్టం, వ్యయభరితం. సూర్యుడి వేడికి వ్యోమనౌకలోని సైంటిఫిక్ పరికరాలు, ఎలక్ట్రానిక్ భాగాలు కాలిపోతాయి. 

వ్యోమనౌక భానుడికి అతి చేరువగా ఉంటుంది కనుక పగటి వేళ భూమ్మీది టెలిస్కోపులు సూర్యకాంతి ధగధగల్లో దాన్ని చూడలేవు. ఇన్ని పరిమితులున్నందునే కేవలం రెండు మిషన్లే (మెరైనర్-10, మెసెంజర్) బుధుడిని సందర్శించాయి. బుధుడి ఆవిర్భావం, తదనంతర పరిణామాలు, ఉపరితల స్వరూపం, అంతర్గత నిర్మాణం, రసాయన కూర్పు, వాతావరణం, గతిశీల-బలహీన అయస్కాంత క్షేత్రాన్ని అధ్యయనం చేయడం ‘బెపి కొలంబో’ మిషన్ లక్ష్యం. 2018 అక్టోబరు 20న ఫ్రెంచ్ గయానాలోని కౌరూ స్పేస్ పోర్టు నుంచి ఏరియన్-5 రాకెట్ ప్రయోగించి ఇందుకు శ్రీకారం చుట్టారు. చుట్టూ తిరిగి వెళ్లే మార్గంలో భాగంగా ఈ మిషన్ ఇప్పటివరకు వెయ్యి కోట్ల కిలోమీటర్ల దూరం పైగా ప్రయాణించింది.

‘మెర్కురీ హాలోస్’పై డేగ కన్ను!
చివరిసారిగా 2025 జనవరి 8న బుధుడి సమీపానికి వెళ్లినప్పుడు... ఆ గ్రహంపై అగ్నిపర్వత మైదానాలు, ఉల్కలు/గ్రహశకలాలు వంటి ఖగోళ వస్తువులు ఢీకొని ఉపరితలంపై ఏర్పడిన బిలాల తాలూకు అచ్చెరువొందించే ఫొటోలు తీసింది ‘బెపి కొలంబో’ మిషన్. బుధుడి ఉపరితల శిలల్లో ముఖ్యంగా గంధకం వంటి అస్థిర ఖనిజాలు సూర్యుడి వేడికి ఉత్పతనం చెందుతున్నట్టు 1974లో ‘మెరైనర్-10’ అంతరిక్ష నౌక గమనించింది. అక్కడి సల్ఫర్ వంటి అస్థిర మూలకాలు ద్రవస్థితిలోకి మారకుండానే ఘనస్థితి నుంచి నేరుగా వాయురూపంలో ఆవిరైపోవడంతో ఆ ప్రాంతాల్లో తక్కువ లోతుతో ప్రకాశవంతమైన విలక్షణ గుంతలు ఏర్పడ్డాయి. ‘మెర్క్యురి హాలోస్’గా పిలిచే వీటిపైనా ‘బెపి కొలంబో’ ఓ కన్నేస్తుంది. సూర్యుడికి అతి సమీపంగా ఉన్న గ్రహం కనుక విపరీత వేడిమిని తట్టుకునేలా జంట వ్యోమనౌకలను రూపొందించారు. ‘బెపి కొలంబో’ మిషన్ వ్యయం 1.65 బిలియన్ యూరోలు. మన కరెన్సీలో ఇది సుమారు రూ.18,100 కోట్లు. రాకెట్ ప్రయోగ వ్యయం, ఎంపీవో, ఎంటీవోల రూపకల్పన, ఇతర నిర్వహణ ఖర్చులు కలిపి రూ.14,275 కోట్ల మేర సింహభాగాన్ని ఈఎస్ఏ భరించింది. ఎంఎంవో తయారీ సహా మిగతా ఖర్చును ‘జాక్సా’ పెట్టుకుంది.

రెండు కళ్లు... మాగ్నెటోస్ఫెరిక్, ప్లానెటరీ ఆర్బిటర్స్!
‘బెపి కొలంబో’ మిషన్లో ప్రధానంగా చెప్పాల్సింది రెండు వ్యోమనౌకల గురించి. ఇవి ఆర్బిటర్స్. బుధుడి కక్ష్యలో ఉపగ్రహాల్లా తిరుగుతూ ఆ గ్రహాన్ని శోధిస్తాయి. ఈ జంట వ్యోమనౌకలు... ‘మెర్క్యురీ మాగ్నెటోస్ఫెరిక్ ఆర్బిటర్’ (ఎంఎంవో), ‘మెర్క్యురీ ప్లానెటరీ ఆర్బిటర్’ (ఎంపీవో). బుధుడి అయస్కాంత వాతావరణాన్ని అధ్యయనం చేసే ఎంఎంవోను ‘జాక్సా’ రూపొందించింది. ఈ వ్యోమనౌకలో ప్లాస్మా వేవ్ ఇన్స్ట్రుమెంట్, మాగ్నెటోమీటర్, సోడియం అట్మాస్ఫియర్ స్పెక్ట్రల్ ఇమేజర్, డస్ట్ మానిటర్, ప్లాస్మా పార్టికిల్ ఎక్స్పరిమెంట్ పరికరాలు అమర్చారు. ఇవి అయాన్లు, ఎలక్ట్రాన్లను విశ్లేషించడంతోపాటు సౌరగాలి ప్రభావానికి బుధ గ్రహం ఎలా ప్రతిస్పందిస్తుందో పరిశీలిస్తాయి. ఇక బుధుడి ఉపరితలం, అంతర నిర్మాణాన్నిఅధ్యయనం చేసే పరికరాలున్న ఎంపీవోను యూరోపియన్ అంతరిక్ష సంస్థ తయారుచేసింది. ఈ వ్యోమనౌకలో బెపి కొలంబో లేజర్ ఆల్టిమీటర్, ఇమేజింగ్ ఎక్స్-రే స్పెక్ట్రోమీటర్, గామా-రే & న్యూట్రాన్ స్పెక్ట్రోమీటర్, సోలార్ ఇంటెన్సిటీ ఎక్స్-రే & పార్టికిల్ స్పెక్ట్రోమీటర్, మాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్వెస్టిగేషన్ వంటి డజను శాస్త్రీయ పరికరాలు ఉన్నాయి. 

ఇవి బుధుడి ధ్రువ ప్రాంతాల్లోని మంచును, ఉపరితల ద్రోణుల్ని పరిశీలించి గ్రహపు అంతర్గత క్రియాశీలతను తెలుసుకుంటాయి. ఈ జంట అంతరిక్ష నౌకలను మాతృ నౌక ‘మెర్క్యురీ  ట్రాన్స్ఫర్ మాడ్యూల్’ (ఎంటీఎం) బుధుడి చెంతకు మోసుకెళ్లింది. దాదాపు ఎనిమిదేళ్లుగా కలసికట్టుగా కోట్లాది కిలోమీటర్ల దూరం సాగిన వీటి పయనం గురువారం కీలక మలుపు తీసుకుంది. ఎంటీఎం నుంచి విడిపోయి ఎంఎంవో, ఎంపీవోలు ఒకే జంటగా బుధుడికేసి ప్రయాణం ఆరంభించాయి. లక్ష్యానికి ప్రస్తుతం 33 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆర్బిటర్లు నవంబరు 21న జంటగానే బుధుడి కక్ష్యలో ప్రవేశించనున్నాయి. అనంతరం కక్ష్యలో ఈ ఏడాది డిసెంబరు 9-10 తేదీల్లో అవి రెండూ విడిపోయి వేర్వేరు ఎత్తుల నుంచి బుధ గ్రహాన్ని మ్యాపింగ్ చేస్తాయి. మెర్క్యురీ ప్లానెటరీ ఆర్బిటర్ (ఎంపీవో) బుధుడికి 480 X 1,500 కిలోమీటర్ల కక్ష్యలో, మెర్క్యురీ మాగ్నెటోస్ఫెరిక్ ఆర్బిటర్ (ఎంఎంవో) 590 X 11,640 కిలోమీటర్ల అతి దీర్ఘవృత్తాకార కక్ష్యలోనూ ఉంటూ పరిశోధనలు చేపడతాయి.

- జమ్ముల శ్రీకాంత్ 
(Courtesy: European Space Agency, JAXA, Forbes, The Manila Times, ‘nature’ magazine).

ADVERTISEMENT
ADVERTISEMENT
tags Tags:
Jammula Srikanth
spacecraft
NASA
Space
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

చందమామపై భారీ గుంత... కనిపెట్టిన నాసా!

చందమామపై భారీ గుంత... కనిపెట్టిన నాసా!

అంతరిక్ష యుద్ధానికి మనం సిద్ధమా? 

అంతరిక్ష యుద్ధానికి మనం సిద్ధమా? 

‘అంతరిక్ష ఆయుధాలు’ మోహరించిన అమెరికా.. అసలు ఏంటవి?

‘అంతరిక్ష ఆయుధాలు’ మోహరించిన అమెరికా.. అసలు ఏంటవి?

ముంచుకొస్తున్న 76 కిలోమీటర్ల ఉపద్రవం.. నాసా కెమెరాకు చిక్కిన సాక్ష్యం

ముంచుకొస్తున్న 76 కిలోమీటర్ల ఉపద్రవం.. నాసా కెమెరాకు చిక్కిన సాక్ష్యం

కొత్త రంగాల్లోకి ప్రైవేట్‌ పెట్టుబడులు

కొత్త రంగాల్లోకి ప్రైవేట్‌ పెట్టుబడులు

‘భయం’పై నిర్భయంగా దిగితే..!

‘భయం’పై నిర్భయంగా దిగితే..!

మరిన్ని వార్తలు

మధ్యంతర ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌కు ఘోర పరాభవం

మధ్యంతర ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌కు ఘోర పరాభవం

ట్రంప్‌కు బిగ్‌ షాక్‌.. అమెరికా కళ్లుగప్పి ఇరాన్‌ భారీ స్కెచ్‌!

ట్రంప్‌కు బిగ్‌ షాక్‌.. అమెరికా కళ్లుగప్పి ఇరాన్‌ భారీ స్కెచ్‌!

పాక్‌లో ఇంధ‌న సంక్షోభం.. లీట‌ర్ పెట్రోల్ 400 పైమాటే!

పాక్‌లో ఇంధ‌న సంక్షోభం.. లీట‌ర్ పెట్రోల్ 400 పైమాటే!

భారత్‌కు బంగ్లాదేశ్‌ ప్రధాని తారిఖ్‌ రహ్మాన్‌? ఇక విభేదాలన్నీ..

భారత్‌కు బంగ్లాదేశ్‌ ప్రధాని తారిఖ్‌ రహ్మాన్‌? ఇక విభేదాలన్నీ..

సౌదీ రాజధానిలో హై అలర్ట్‌..  వైమానిక దాడులు?

సౌదీ రాజధానిలో హై అలర్ట్‌.. వైమానిక దాడులు?

గల్ఫ్‌లో కొత్త యువరాజు ఎంట్రీ.. మోదీ, పుతిన్‌తో భేటీపై కొత్త చర్చ

గల్ఫ్‌లో కొత్త యువరాజు ఎంట్రీ.. మోదీ, పుతిన్‌తో భేటీపై కొత్త చర్చ

  

ADVERTISEMENT
 
 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
 
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Jagati Publications Limited.