Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. International
  3. న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.. ఉలిక్కిపడిన జనం
ADVERTISEMENT 

న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.. ఉలిక్కిపడిన జనం

International Sakshi User Sakshi Sakshi Time Jun 19, 2026 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Times-sqaure.jpg

అమెరికాలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన న్యూయార్క్ టైమ్స్‌ స్వ్కేర్‌ (Times Square) మరోసారి కాల్పుల ఘటనతో ఉలిక్కిపడింది. అమెరికా స్థానిక కాలమానం ప్రకారం గురువారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో కాల్పుల శబ్దాలు వినిపించడంతో అక్కడున్న పర్యాటకులు, స్థానికులు ఒక్కసారిగా భయాందోళనలకు గురై ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ప్రాథమిక సమాచారం ప్రకారం.. పలువురు వ్యక్తుల మధ్య జరిగిన ఘర్షణ హింసాత్మకంగా మారి కాల్పులకు దారితీసింది. వెస్ట్ 44వ వీధి, సెవెంత్ అవెన్యూ సమీపంలో ఇద్దరు వ్యక్తులు తుపాకులతో కాల్పులు జరిపినట్లు వీడియోల్లో కనిపించింది. ఈ ఘటనతో అక్కడ ఉన్న వందలాది మంది భయంతో దుకాణాలు, భవనాల లోపలకి పరుగులు తీశారు. ఈ ఘటనలో ఒక వ్యక్తికి గాయాలైనట్లు అత్యవసర సేవల విభాగం తెలిపింది. గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. అయితే అతని పరిస్థితిపై పూర్తి వివరాలు వెల్లడించలేదు. ఘటన జరిగిన వెంటనే స్పందించిన పోలీసులు.. అనుమానితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనాస్థలిలో ఒక ఆయుధాన్ని కూడా స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. కాల్పులకు గల కారణాలు, ఇతర అనుమానితుల పాత్రపై దర్యాప్తు కొనసాగుతోంది.

BREAKING: Shots fired in Times Square in Manhattan, New York, after the Knicks parade. 

No injuries have been reported. pic.twitter.com/hFXaHUKwmG

— World Source News (@Worldsource24) June 18, 2026

కాగా, ఇటీవలే న్యూయార్క్‌ ఎన్‌బీఏ ఛాంపియన్‌షిప్ గెలిచిన సందర్భంగా నగరంలో భారీ సంబరాలు జరిగాయి. ఆ వేడుకల నేపథ్యంలో లక్షలాది మంది వీధుల్లోకి రావడంతో భద్రతను కట్టుదిట్టం చేసినప్పటికీ, గత కొన్ని రోజులుగా టైమ్స్ స్క్వేర్ పరిసరాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో కాల్పుల శబ్దాలు వినిపించగానే ప్రజలు ఒక్కసారిగా పరుగులు తీస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే పర్యాటక ప్రాంతాల్లో ఒకటైన టైమ్స్ స్క్వేర్‌లో ఈ ఘటన జరగడం భద్రతా వ్యవస్థలపై మరోసారి చర్చకు దారితీసింది. 

WOW🚨: After shots were fired in Time Square..this woman tried to save his life and he tried to kiss her for it 😭 pic.twitter.com/aBPGabkh7n

— Officer Lew (@officer_Lew) June 18, 2026

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
newyork police
Times Square
Gun Shot
firings
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఆక్రమిత కశ్మీర్‌ కల్లోలం

ఆక్రమిత కశ్మీర్‌ కల్లోలం

ఖాన్ సర్ కోచింగ్ సెంటర్ వద్ద కాల్పుల కలకలం

ఖాన్ సర్ కోచింగ్ సెంటర్ వద్ద కాల్పుల కలకలం

ఉక్రెయిన్‌లో కాల్పుల కలకలం.. ఆరుగురు మృతి

ఉక్రెయిన్‌లో కాల్పుల కలకలం.. ఆరుగురు మృతి

భారత నౌకలపై ఇరాన్‌ కాల్పులు!

భారత నౌకలపై ఇరాన్‌ కాల్పులు!

అమెరికాలో కాల్పుల కలకలం

అమెరికాలో కాల్పుల కలకలం

అమెరికాలో కాల్పుల కలకలం

అమెరికాలో కాల్పుల కలకలం

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.