Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. International
  3. మాది విశేషమైన బంధం
ADVERTISEMENT 

మాది విశేషమైన బంధం

International Sakshi User Sakshi Sakshi Time Sep 29, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
russia.jpg

భారత్‌ విదేశాంగ విధానాలను గౌరవిస్తాం

అమెరికాతో ఇండియా సంబంధం మాకు ప్రామాణికం కాదు

ఐరాస సభలో రష్యా మంత్రి లావ్‌రోవ్‌  స్పష్టీకరణ

ఐక్యరాజ్యసమితి: భారతదేశ ప్రయోజనాలను, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం అనుసరించే స్వతంత్ర విదేశాంగ విధానాలను తాము సంపూర్తిగా గౌరవిస్తామని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్‌ పేర్కొన్నారు. అమెరికాతో గానీ మరే ఇతర దేశంతోగానీ భారత్‌ సంబంధాలు, భారత్, రష్యాల మధ్య సంబంధాలకు ప్రామాణికం కావని స్పష్టం చేశారు. భారత్, రష్యాలు విశేషమైన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయన్నారు. 

ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీలో ఆయన ఈ మేరకు విస్పష్టంగా ప్రకటించారు. అమెరికా లేదా మరే ఇతర దేశంతో భారత్‌ సంబంధాల్లో ఏర్పడే ఉద్రిక్తతల ప్రభావం భారత్‌–రష్యాల మధ్య పడబోదని లావ్‌రోవ్‌ తెలిపారు. అంతకుముందు, ఆయన మీడియాతో మాట్లాడారు. రష్యా ఆయిల్‌ కొనరాదంటూ భారత్‌పై అమెరికా చేస్తున్న ఒత్తిడుల నేపథ్యంలో ఆయన పైవిధంగా వ్యాఖ్యానించారు. ‘అమెరికాతో సంబంధాలను గురించి భారతీయ మిత్రులను అడగను. ఇలాంటి విషయాలపై స్వయంగా తీసుకోగల సామర్థ్యం వారికి ఉంది’అని ఆయన అన్నారు.

 ‘అమెరికా ఒక వేళ మాకు చమురు విక్రయించాలనుకుంటే ఆ విషయంలో ఆ దేశంతో సంప్రదింపులకు మేం సిద్ధం. అంతేతప్ప, ఇతర దేశాల నుంచి మేం ఏం కొనాలి, రష్యాతో ఏం కొనాలి, ఏం కొనకూడదు అనేవి మా సొంత విషయం. దీనికి భారత్‌–అమెరికా అజెండాతో సంబంధం లేదు’అని అమెరికాకు బదులిచి్చనట్లు జై శంకర్‌ నాతో అన్నారు. ఆయనది చాలా సరైన సమాధానం, ఆత్మ గౌరవాన్ని నిలబెట్టే అంశం’అని లావ్‌రోవ్‌ వివరించారు. రెండు దేశాల మధ్య ఉన్నతస్థాయి సంబంధాలు సాధారణంగానే కొనసాగుతున్నాయన్నారు. 

ఈ విషయంలో ఎటువంటి ఇబ్బందీ కలగలేదని తెలిపారు. ఇటీవల చైనాలో జరిగిన షాంఘై సహకార సంస్థ(ఎస్‌సీవో) సమావేశాల సమయంలో తమ అధ్యక్షుడు పుతిన్, ప్రధాని మోదీ సమావేశమైన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అధ్యక్షుడు పుతిన్‌ డిసెంబర్‌లో భారత్‌లో పర్యటించే అవకాశాలున్నాయని లావ్‌రోవ్‌ వెల్లడించారు. వాణిజ్యం, సైనిక, సాంకేతిక సహకారం, ఆర్థిక, మానవీయ అంశాలు, ఆరోగ్యం, హైటెక్, కృత్రిమ మేధ వంటి అంశాల్లో ద్వైపాక్షిక సంబంధాలతోపాటు, ఎస్‌సీవో, బ్రిక్స్‌ వంటి అంతర్జాతీయ వేదికలపై రెండు దేశాల మధ్య సన్నిహిత సహకారం కొనసాగుతోందన్నారు. ఐరాస సమావేశాలకు హాజరైన భారత విదేశాంగ మంత్రి జై శంకర్‌తోనూ లావ్‌రోవ్‌ భేటీ అయ్యారు. బ్రిక్స్‌ దేశాల విదేశాంగ మంత్రులతో భేటీ అయ్యారు.  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Foreign policy
Russia
Sergey Lavrov
India-Russia Relations
strategic partnership
United Nations General Assembly
S Jaishankar
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

పుతిన్‌ తగ్గేదేలే.. మళ్లీ మంటలు రేపే యుద్ధమా?

పుతిన్‌ తగ్గేదేలే.. మళ్లీ మంటలు రేపే యుద్ధమా?

ఉక్రెయిన్ చేతిలో ఓడిపోతున్న రష్యా..!!

ఉక్రెయిన్ చేతిలో ఓడిపోతున్న రష్యా..!!

రష్యా నుంచి భారత్‌కు చమురు.. నావికుడు అరెస్టు

రష్యా నుంచి భారత్‌కు చమురు.. నావికుడు అరెస్టు

2030 కంటే ముందే స్వదేశీ బ్రహ్మోస్‌

2030 కంటే ముందే స్వదేశీ బ్రహ్మోస్‌

'సవాళ్ల నడుమ' సమర్థ దౌత్యం?

'సవాళ్ల నడుమ' సమర్థ దౌత్యం?

రష్యాపై ఉక్రెయిన్‌ భారీ ప్రతీకార దాడి

రష్యాపై ఉక్రెయిన్‌ భారీ ప్రతీకార దాడి

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.