Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. International
  3. హమ్మయ్యా.. శాస్త్రవేత్తల భయం తప్పింది!
ADVERTISEMENT 

హమ్మయ్యా.. శాస్త్రవేత్తల భయం తప్పింది!

International Sakshi User Sakshi Sakshi Time Jun 19, 2026 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Scientists-Reaffirm-Dark-Energy.jpg

విశ్వంలో ఇంకా ఛేదించాల్సిన రహస్యాలు ఎన్నో ఉన్నాయి. అసలు విశ్వం ఎలా ఏర్పడింది? ఎంత పెద్దది? భవిష్యత్తులో ఎలా మారబోతోంది? వంటి ప్రశ్నలకు ఇప్పటికీ పూర్తి సమాధానాలు లేవు. అలాంటి సమయంలో ఓ అధ్యయనం బాంబును పేల్చింది. విశ్వం విస్తరణ వేగం తగ్గుతోందని.. దాన్ని ముందుకు నడిపిస్తోందని భావిస్తున్న ‘డార్క్ ఎనర్జీ’ సిద్ధాంతంలోనే లోపాలుండొచ్చని పేర్కొంది. దీంతో శాస్త్ర ప్రపంచంలో పెద్ద చర్చ మొదలైంది. అయితే తాజా పరిశోధన ఆ సందేహాలకు చెక్‌ పెట్టి పారేసింది.

మన విశ్వం విస్తరిస్తోందని శాస్త్రవేత్తలకు చాలా కాలంగా తెలుసు. అయితే 1998లో జరిగిన పరిశోధనలు మరో కీలక విషయాన్ని వెల్లడించాయి. విశ్వం కేవలం విస్తరించడం మాత్రమే కాదు.. ఆ విస్తరణ వేగం కూడా క్రమంగా పెరుగుతోందని గుర్తించారు. ఈ ఆవిష్కరణకు గాను 2011లో భౌతిక శాస్త్ర నోబెల్ బహుమతి లభించింది. ఈ వేగవంతమైన విస్తరణ వెనుక పనిచేస్తున్న రహస్య శక్తినే శాస్త్రవేత్తలు "డార్క్ ఎనర్జీ"గా పిలుస్తున్నారు. అయితే అది అసలు ఏమిటో ఇప్పటికీ ఎవరికీ తెలియదు.

విశ్వం ఎంత వేగంగా విస్తరిస్తోందో తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు టైప్-1ఏ సూపర్‌నోవా(Type Ia Supernova) అనే ప్రత్యేక నక్షత్ర పేలుళ్లను పరిశీలిస్తారు. ఇవి దాదాపు ఒకే ప్రకాశంతో పేలుతుండటంతో వాటి దూరాన్ని కచ్చితంగా అంచనా వేయగలుగుతారు. ఈ లెక్కల ఆధారంగానే డార్క్ ఎనర్జీ ఉనికిపై శాస్త్రవేత్తలు నిర్ణయాలకు వస్తుంటారు.

అయితే.. 2025లో దక్షిణ కొరియాకు చెందిన కొందరు పరిశోధకులు చేసిన అధ్యయనం శాస్త్ర ప్రపంచంలో పెద్ద చర్చకు దారితీసింది. ఇప్పటివరకు విశ్వ విస్తరణను కొలవడానికి ఉపయోగిస్తున్న పద్ధతుల్లో లోపాలుండొచ్చని, డార్క్ ఎనర్జీ పాత్రను తప్పుగా అర్థం చేసుకుని ఉండొచ్చని వాళ్లు వాదించారు. అంతేకాదు.. విశ్వ విస్తరణ వేగం పెరగడం లేదని, ఇప్పటివరకు వచ్చిన ఫలితాలు లెక్కల పొరపాట్ల వల్ల కనిపించి ఉండొచ్చని సూచించారు. దీంతో ఇన్నేళ్లుగా అంగీకరిస్తూ వచ్చిన సిద్ధాంతాలపై కొత్త సందేహాలు వ్యక్తమయ్యాయి.

అయితే బ్రిటన్‌లోని సౌతాంప్టన్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు, నోబెల్ విజేతల బృందంతో కలిసి పాత డేటాను మరోసారి పరిశీలించారు. ముఖ్యంగా "టైప్-1ఏ సూపర్‌నోవా"లపై దృష్టి సారించారు. ఆపై కొరియా అధ్యయనంలో కొన్ని పొరపాట్లు ఉన్నాయని గుర్తించారు. 

ఒక గ్రామంలో 80 ఏళ్ల వృద్ధుడు ఉన్నాడనుకోండి. అదే గ్రామంలో 20 ఏళ్ల యువకుడు కూడా ఉంటాడు. గ్రామం 80 ఏళ్ల పాతది కాబట్టి అందరూ 80 ఏళ్లవాళ్లే అని చెప్పలేం కదా!. అలాగే ఒక గెలాక్సీ చాలా పురాతనమైనది కావచ్చు. కానీ అందులో ఉన్న ప్రతి నక్షత్రం కూడా అంతే పాతదని భావించలేం. 2025లో వచ్చిన అధ్యయనం గెలాక్సీ వయస్సునే అందులో పేలిన నక్షత్రం వయస్సుగా పరిగణించిందని, అక్కడే లెక్క తప్పిందని తాజా పరిశోధకులు చెబుతున్నారు. కాబట్టి విశ్వం ఇప్పటికీ వేగంగానే విస్తరిస్తోందని, డార్క్ ఎనర్జీ సిద్ధాంతం ఇప్పటికీ సరైనదేనని తేల్చారు.

డార్క్ ఎనర్జీ అంటే.. 
సాధారణంగా మనకు కనిపించే నక్షత్రాలు, గ్రహాలు, గ్యాస్‌, ధూళి వంటి పదార్థం విశ్వంలో కేవలం 5 శాతం మాత్రమే ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. మిగిలిన భాగంలో డార్క్ మ్యాటర్‌, డార్క్ ఎనర్జీ వంటి రహస్య అంశాలే ఎక్కువగా ఉన్నాయని భావిస్తున్నారు. అందులో డార్క్ ఎనర్జీ విశ్వాన్ని మరింత వేగంగా విస్తరించే శక్తిగా పనిచేస్తోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

తాజా అధ్యయనం డార్క్ ఎనర్జీ లేదన్న వాదనను కొట్టిపారేసినప్పటికీ.. అది అసలు ఏమిటి? ఎలా పనిచేస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? అనే ప్రశ్నలకు మాత్రం ఇప్పటికీ సమాధానం లేదు. అంటే.. డార్క్ ఎనర్జీ ఉనికిపై శాస్త్రవేత్తలకు విశ్వాసం పెరిగింది గానీ, దాని అసలు స్వరూపం గుట్టుమాత్రం ఇంకా వీడాల్సి ఉందన్నమాట.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
universe
accelerate
theory
Scientists
south korea
Britain
southampton
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బ్రిటన్‌కు ఎంతోమంది పీఎంలు వస్తుంటారు.. పోతుంటారు!

బ్రిటన్‌కు ఎంతోమంది పీఎంలు వస్తుంటారు.. పోతుంటారు!

రష్యా నుంచి భారత్‌కు చమురు.. నావికుడు అరెస్టు

రష్యా నుంచి భారత్‌కు చమురు.. నావికుడు అరెస్టు

దక్షిణ కొరియాపై విజయం.. నాకౌట్‌ దశకు మెక్సికో

దక్షిణ కొరియాపై విజయం.. నాకౌట్‌ దశకు మెక్సికో

కొత్త రూల్స్.. పిల్లల భవిష్యత్తు కోసం కఠిన చర్యలు!

కొత్త రూల్స్.. పిల్లల భవిష్యత్తు కోసం కఠిన చర్యలు!

‘డూప్‌’మైన్‌ ఆన్‌లైన్‌ షాపింగ్‌!

‘డూప్‌’మైన్‌ ఆన్‌లైన్‌ షాపింగ్‌!

లండన్‌లో దారుణం.. భారత సంతతి వ్యక్తి హత్య

లండన్‌లో దారుణం.. భారత సంతతి వ్యక్తి హత్య

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.