Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. International
  3. లోపలికి తొంగిచూడొచ్చు
ADVERTISEMENT 

లోపలికి తొంగిచూడొచ్చు

International Sakshi User Sakshi Sakshi Time Sep 7, 2024 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
TRANSPARENT-1.jpg

పారదర్శక ద్రావకంతో చర్మం మాయం 

సైంటిస్టుల తాజా ఘనత 

1897లో వచ్చిన హెచ్‌జీ వేల్స్‌ ప్రసిద్ధ సైన్స్‌ ఫిక్షన్‌ నవల ‘ద ఇన్విజిబుల్‌ మ్యాన్‌’ గుర్తుందా? ఒంట్లో కణాలన్నింటినీ పారదర్శకంగా మార్చేసే ద్రావకాన్ని హీరో కనిపెడతాడు. దాని సాయంతో ఎవరికీ కని్పంచకుండా ఎంచక్కా మాయమైపోతాడు. దీని స్ఫూర్తితో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సినిమాలు కూడా వచ్చాయి. తాజాగా సైంటిస్టులు అలాంటి ఆవిష్కరణే చేశారు! 

అది కూడా సాదాసీదా ఫుడ్‌ కలరింగ్‌ ఏజెంట్‌ సాయంతో!! దాని సాయంతో తయారు చేసిన సరికొత్త ‘ద్రావకం’ చర్మాన్ని పారదర్శకంగా మార్చేస్తోంది. దాంతో ఒంట్లోని అవయవాలన్నింటినీ మామూలు కంటితోనే భేషుగ్గా చూడటం వీలుపడింది. దీన్నిప్పటికే ఎలుకలపై విజయవంతంగా ప్రయోగించి చూశారు. ఈ ప్రయోగం మనుషులపైనా విజయవంతమైతే బయో జీవ రసాయన, వైద్య పరిశోధన రంగాల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టగలదని భావిస్తున్నారు... 

ఇలా సాధించారు... 
టార్ట్రాజైన్‌ అనే మామూలు పసుపు రంగు ఫుడ్‌ కలరింగ్‌ ఏజెంట్‌ను నీళ్లలో కలపడం ద్వారా చర్మాన్ని మాయం చేసే ద్రావకాన్ని సైంటిస్టులు తయారు చేశారు. ఈ మేజిక్‌ను సాధించేందుకు ఆప్టిక్‌ రంగ పరిజ్ఞానాన్ని వాడుకున్నారు. పసుపు రంగు కలరింగ్‌ ఏజెంట్‌లోని అణువులు మామూలుగానైతే కాంతిని విపరీతంగా శోషించుకుంటాయి. ముఖ్యంగా నీలి, అతినీల లోహిత కాంతిని తమగుండా వెళ్లనీయవు. కానీ దాన్ని నీటితో కలిపిన మీదట వచ్చే ద్రావకం పూర్తిగా పారదర్శక ధర్మాలను కలిగి ఉంటుంది.

 దాన్ని చర్మంపై రుద్దితే దాని కణజాలాలకు కాంతి పరావర్తక సామర్థ్యం లోపిస్తుంది. దాంతో ద్రావకం లోపలికి ఇంకుతూనే చర్మం కని్పంచకుండా పోతుంది! మరోలా చెప్పాలంటే ‘మాయమవుతుంది’. ఈ ద్రావకాన్ని తొలుత కోడి మాంసంపై రుద్దారు. ఫలితం సంతృప్తికరంగా అని్పంచాక ప్రయోగాత్మకంగా ఒక ఎలుకపై పరీక్షించి చూశారు. దాని తల, పొట్టపై ఉన్న చర్మం మీద ద్రావకాన్ని పూశారు. దాంతో ఆయా భాగాల్లో చర్మం తాత్కాలికంగా పారదర్శకంగా మారిపోయింది. ఫలితంగా తల, పొట్ట లోపలి అవయవాలు స్పష్టంగా కని్పంచాయి. ద్రావకాన్ని కడిగేసిన మీదట చర్మం ఎప్పట్లాగే కన్పించింది. పైగా ఈ ప్రక్రియలో ఎలుకకు ఎలాంటి హానీ కలగలేదు. 

రక్తనాళాలన్నీ కన్పించాయి 
ఎలుకల తలపై ద్రావకం రుద్దిన మీదట మెదడు ఉపరితలం మీది రక్తనాళాలు మామూలు కంటికే స్పష్టంగా కని్పంచాయి. అలాగే పొట్ట భాగంలోని అవయవాలు కూడా. ‘‘మౌలిక భౌతిక శాస్త్ర నియమాలు తెలిసినవారికి ఇదేమీ పెద్ద ఆశ్చర్యం కలిగించదు. కానీ ఇతరులకు మాత్రం అచ్చం అద్భుతంగానే తోస్తుంది’’ అని అధ్యయన సారథి, యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సాస్‌లో ఫిజిక్స్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ జిహావో యూ అన్నారు. ‘‘పొట్టపై ఈ ద్రావకాన్ని రుద్దితే చాలు. పొద్దుటినుంచీ ఏమేం తిన్నదీ స్పష్టంగా కని్పస్తుంది. చూడటానికి చాలా సింపులే గానీ, ఈ పద్ధతి చాలా ఎఫెక్టివ్‌’’ అని వివరించారు. అయితే దీన్నింకా మనుషులపై ప్రయోగించాల్సి ఉందని ఆయన చెప్పుకొచ్చారు.

లాభాలెన్నో... 
మనుషులపై గనక ఈ ప్రక్రియ విజయవంతమైతే వైద్యపరంగా ఎనలేని లాభాలుంటాయని సైంటిస్టులు చెబుతున్నారు. 
→ రక్తం శాంపిళ్ల సేకరణ, రోగి ఒంట్లోకి అవసరమైన ఫ్లూయిడ్స్‌ ఎక్కించడం వంటివి మరింత సులభతరం అవుతాయి. ముఖ్యంగా రక్తనాళాలు దొరకడం కష్టంగా మారే వృద్ధులకు ఇది వరప్రసాదమే కాగలదు.
→ చర్మ క్యాన్సర్‌ వంటివాటిని తొలి దశలోనే గుర్తించడం సులువవుతుంది. 
→ ఫొటోడైనమిక్, ఫొటోథర్మల్‌ థెరపీల వంటి కణజాల చికిత్సల్లోనూ ఇది దోహదకారిగా మారుతుంది. 
→ లేజర్‌ ఆధారిత టాటూల నిర్మూలన మరింత సులువవుతుంది.

కొన్నిపద్ధతులున్నా
కణజాలాలను పారదర్శకంగా మార్చేందుకు ప్రస్తుతం పలు ద్రావకాలు అందుబాటులో ఉన్నా అవి ఇంత ప్రభావవంతమైనవి కావు. పైగా పలు డీహైడ్రేషన్, వాపులతో పాటు కణజాల నిర్మాణంలోనే మార్పుల వంటి సైడ్‌ ఎఫెక్టులకు దారి తీస్తాయి. టార్ట్రాజైన్‌ ద్రావకంతో ఈ సమస్యలేవీ తలెత్తలేదు. అయితే టార్ట్రాజైన్‌ మనుషులకు హానికరమంటూ తినుబండారాల్లో దీని వాడకాన్ని అమెరికాలో పలువురు కోర్టుల్లో సవాలు చేశారు. దీన్ని చిప్స్, ఐస్‌క్రీముల్లో వాడతారు.
కొసమెరుపు: ఇన్విజిబుల్‌ మ్యాన్‌ నవల్లో మాదిరిగా మనిíÙని పూర్తిగా మాయం చేయడం ఇప్పుడప్పట్లో సాధ్యపడేలా లేదు. ఎందుకంటే టార్ట్రాజైన్‌ ద్రావకం ఎముకలను పారదర్శకంగా మార్చలేదట.  

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Medical
Texas
Mice
Skin
transparent
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

డాక్టర్‌.. ఎక్స్‌రే తిప్పి చూశారా? కళ్లకు ప్లాస్టర్ వేసుకున్నారా?

డాక్టర్‌.. ఎక్స్‌రే తిప్పి చూశారా? కళ్లకు ప్లాస్టర్ వేసుకున్నారా?

జీవీ ప్రకాశ్ గొప్ప మనసు.. వైద్యానికి సాయం

జీవీ ప్రకాశ్ గొప్ప మనసు.. వైద్యానికి సాయం

ట్రంప్ బిగ్ గేమ్‌! అమెరికా రాజకీయాల్లో ఇజ్జత్ కా సవాల్‌

ట్రంప్ బిగ్ గేమ్‌! అమెరికా రాజకీయాల్లో ఇజ్జత్ కా సవాల్‌

అందానికి ఏఐ మాయాజాలం.. పోర్టబుల్‌ స్కిన్‌ కేర్‌ డివైస్‌!

అందానికి ఏఐ మాయాజాలం.. పోర్టబుల్‌ స్కిన్‌ కేర్‌ డివైస్‌!

Beauty Tips: మార్కెట్లో దొరికే.. కెమికల్‌ ప్రొడక్ట్స్‌ కంటే ఇవే మేలు!

Beauty Tips: మార్కెట్లో దొరికే.. కెమికల్‌ ప్రొడక్ట్స్‌ కంటే ఇవే మేలు!

ఈగ.. యముడి మెరుపు తీగ!

ఈగ.. యముడి మెరుపు తీగ!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.