Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. International
  3. Russia-Ukraine war: కిర్గిజ్‌స్తాన్‌లో విదేశీయులపై దాడులు
ADVERTISEMENT 

Russia-Ukraine war: కిర్గిజ్‌స్తాన్‌లో విదేశీయులపై దాడులు

International Sakshi User Sakshi Sakshi Time May 19, 2024 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
KYRGYZ.jpg

రాజధాని బిషె్కక్‌లో స్థానికులు, విదేశీయులకు మధ్య ఘర్షణలు  

భారత్, పాకిస్తాన్‌ విద్యార్థులపై అల్లరిమూకల దాడులు  

భారత విద్యార్థులను అప్రమత్తం చేసిన కేంద్రం  

న్యూఢిల్లీ/బిష్కెక్‌: స్థానికులు, విదేశీయులకు మధ్య ఘర్షణలతో కిర్గిజ్‌స్తాన్‌ రాజధాని బిష్కెక్‌ అట్టుడికిపోతోంది. విదేశీయులను లక్ష్యంగా చేసుకుని కొందరు స్థానికులు దాడులకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా ఇక్కడి మెడికల్‌ యూనివర్సిటీల్లో చదువుకుంటున్న ఇండియా, పాకిస్తాన్‌ విద్యార్థులపై అల్లరి మూకలు దాడులకు దిగుతున్నాయి. 

ఈ నేపథ్యలో బిష్కెక్‌లోని భారతీయ విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని భారత ప్రభుత్వం శనివారం సూచించింది. గొడవలు సద్దుమణిగేదాకా ఎవరూ బయటకు రావొద్దని, హాస్టళ్లు, ఇళ్లల్లో ఉండాలని స్పష్టం చేసింది. భారతీయ విద్యార్థులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని, వారి క్షేమ సమాచారాలు తెలుసుకుంటున్నామని కిర్గిజ్‌స్తాన్‌లోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. 

బిష్కెక్ లో పరిస్థితి ప్రస్తుతం అదుపులోనే ఉందని, అయినప్పటికీ విద్యార్థులు అప్రమత్తంగా వ్యవహరించాలని, హాస్టళ్లు, ఇళ్లల్లో ఉండాలని స్పష్టంచేసింది. ఏదైనా సహాయం కావాలంటే భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని బిషె్కక్‌లోని భారతీయ విద్యార్థులకు భారత విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ సూచించారు. ఈ మేరకు ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. 

మన విద్యార్థుల భద్రత గురించి ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నామని, స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. కిర్గిజ్‌స్తాన్‌లో ప్రస్తుతం దాదాపు 14,500 మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు. వీరిలో ఎంత మంది బిష్కెక్‌లో ఉన్నారన్నది ఇంకా తెలియరాలేదు. అయితే, బిషె్కక్‌లో ప్రశాంతమైన వాతావరణ ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం, పౌరుల భద్రతకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని కిర్గిజ్‌స్తాన్‌ విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో స్పష్టంచేసింది.  

ఎందుకీ ఘర్షణలు?   
కిర్గిజ్‌స్తాన్‌లో అలజడికి మూలాలు ఉక్రెయిన్‌–రష్యా యుద్ధంలో ఉన్నాయి. ఒకప్పటి సోవియట్‌ యూనియన్‌లో భాగమైన కిర్గిజ్‌స్తాన్‌ 1991లో స్వతంత్ర దేశంగా మారింది. ఇక్కడి అధికారిక భాష రష్యన్‌. 2022 ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై రష్యా హఠాత్తుగా దాడి చేయడంతో కిర్గిజ్‌స్తాన్‌కు ఒక్కసారిగా కష్టాలు వచి్చపడ్డాయి. రష్యా నుంచి వచ్చే పెట్టుబడులు ఆగిపోయాయి. 

రష్యాలోని కిర్గిజ్‌స్తాన్‌ కారి్మకులకు వేతనాలు రాక సొంత దేశానికి డబ్బులు పంపడం లేదు. దీనికితోడు కిర్గిజ్‌స్తాన్‌పై పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించాయి. దీంతో ఆర్థిక పరిస్థితి దారుణంగా పడిపోయింది. ఆర్థిక వ్యవస్థ స్తంభించింది. మరోవైపు రష్యా నుంచి లక్షలాది మంది కిర్గిజ్‌స్తాన్‌కు వలస వస్తున్నారు. కుటుంబాలతో సహా ఇక్కడే స్థిరపడుతున్నారు. 

అధికారిక లెక్కల ప్రకారమే 2022 సెపె్టంబర్‌ నుంచి ఇప్పటిదాకా 1,84,000 రష్యన్లు కిర్గిజ్‌స్తాన్‌కు తరలివచ్చారు. ఆర్థిక పరిస్థితి దిగజారడంతో పరిశ్రమలు, దుకాణాలు మూతపడుతున్నాయి. స్థానికులు ఉద్యోగాలు, ఉపాధి కోల్పోతున్నారు. దాంతో వారిలో అసంతృప్తి, అసహనం పెరిగిపోతోంది. విదేశీయులను లక్ష్యంగా చేసుకొని దాడులకు దిగుతున్నారు. 

ప్రధానంగా రాజధాని బిషె్కక్‌లోని వైద్య విశ్వవిద్యాలయాల్లో చదువుకుంటున్న ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఈజిప్టు సహా ఇతర దేశాల విద్యార్థులపై వారి కన్నుపడింది. విద్యార్థులు ఉంటున్న హాస్టళ్లు, ఇళ్లల్లోకి గుంపులు గుంపులుగా చొరబడిమరీ దాడి చేస్తున్నారు. ఇదే అదనుగా అల్లరి మూకలు రెచ్చిపోతున్నాయి. విద్యార్థులు సైతం ప్రతిఘటిస్తుండడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారుతోంది. గత కొన్ని రోజులుగా ఘర్షణలు జరుగుతున్నాయి. ఇరువర్గాల మధ్య దాడుల్లో ఇప్పటికే పలువురు గాయపడ్డారు. ముగ్గురు పాకిస్తాన్‌ విద్యార్థులు మృతి చెందినట్లు వార్తలు వచ్చాయి.
 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Ukraine - Russia
Ukraine Russia War
Kyrgyzstan
Mob Attacks
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

రష్యాపై ఉక్రెయిన్‌ భారీ ప్రతీకార దాడి

రష్యాపై ఉక్రెయిన్‌ భారీ ప్రతీకార దాడి

రష్యాపై డ్రోన్లతో విరుచుకుపడ్డ ఉక్రెయిన్‌

రష్యాపై డ్రోన్లతో విరుచుకుపడ్డ ఉక్రెయిన్‌

ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులు

ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులు

ట్రంప్‌ రాజీ ప్రతిపాదనలపై శాంతి ఒప్పందానికి సిద్ధం 

ట్రంప్‌ రాజీ ప్రతిపాదనలపై శాంతి ఒప్పందానికి సిద్ధం 

ఉక్రెయిన్‌పై మరోసారి భీకర దాడులు

ఉక్రెయిన్‌పై మరోసారి భీకర దాడులు

ప్రజల ఒత్తిడే యుద్ధాల్ని ఆపగలదు!

ప్రజల ఒత్తిడే యుద్ధాల్ని ఆపగలదు!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.