Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. International
  3. చెర్నోబిల్‌ రియాక్టర్‌పై రష్యా డ్రోన్‌ దాడి
ADVERTISEMENT 

చెర్నోబిల్‌ రియాక్టర్‌పై రష్యా డ్రోన్‌ దాడి

International Sakshi User Sakshi Sakshi Time Feb 15, 2025 Sakshi Read Time Read Time: 1 min
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
140220251142-RUSSIA-UKRAINE.jpg

ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆరోపణలు

చర్చలు ఇష్టం లేక ఉక్రెయినే చేయించిందన్న రష్యా

కీవ్‌: తమ రాజధాని కీవ్‌ ప్రాంతంలో ఉన్న చెర్నోబిల్‌ అణువిద్యుత్‌ ప్లాంట్‌ రక్షణ కవచంపై రష్యా దాడి చేసిందని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆరోపించారు. శక్తివంతమైన పేలుడు పదార్థాలతో గురువారం రాత్రి జరిపిన ఈ దాడితో ప్రొటెక్టివ్‌ కంటెయిన్‌మెంట్‌ షెల్‌ దెబ్బతిందని, మంటలు చెలరేగాయని ఆయన చెప్పారు. అయితే, ఈ ఘటనతో ఆ ప్రాంతంలో రేడియో ధార్మిక స్థాయిలు సాధారణంగానే ఉన్నాయన్నారు. మంటలను అదుపు చేశామన్నారు. 

పుతిన్‌ చర్చలకు సిద్ధంగా లేరన్న విషయం దీనినిబట్టి అర్థమవుతోందని ఆయన వ్యాఖ్యానించారు. ఘటనకు రష్యాను బాధ్యురాలిగా చేయాలన్నారు. ఉక్రెయిన్‌తో యుద్ధం ముగించేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో సమావేశమవనున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. దాడి సమాచారాన్ని అమెరికాతో పంచుకుంటామని జెలెన్‌స్కీ చెప్పారు.

 ఈ ఘటనను అంతర్జాతీయ అణు శక్తి ఏజెన్సీ(ఐఏఈఏ) ధ్రువీకరించింది. అయితే, దాడిలో రక్షణ కవచం దెబ్బతిన్నట్లుగా ఎటువంటి ఆనవాళ్లు కనిపించలేదని వివరించింది. అణు రియాక్టర్‌కు బయటివైపు రక్షణగా 2016లో అత్యంత భారీ కాంక్రీట్‌ నిర్మాణాన్ని ఏర్పాటు చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద 1986 చెర్నోబిల్‌ దుర్ఘటన జరిగినప్పుడే లోపలి వైపు రక్షణ ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. 


వీటివల్ల ప్రమాదకరమైన రేడియో ధార్మికత బయటకు లీక్‌ అయ్యేందుకు అవకాశం లేదు. కాగా, జెలెన్‌స్కీ ఆరోపణలపై రష్యా తీవ్రంగా స్పందించింది. అణు వ్యవస్థలు, అణు విద్యుత్‌ ప్లాంట్లపై దాడులు జరిగాయంటూ ఉక్రెయిన్‌ చెప్పేదంతా అబద్ధమని కొట్టిపారేసింది. తమ సైన్యం ఇలాంటివి చేయదని రష్యా అధ్యక్ష భవనం ప్రతినిధి దిమిత్రీ పెష్కోవ్‌ స్పష్టం చేశారు. శాంతి ఒప్పందం కోసం అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ జోక్యంతో చర్చలకు అవరోధం కలిగించేందుకు ఉక్రెయినే ఇలాంటివి చేయిస్తోందని ఆరోపించారు. 
 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Chernobyl disaster
nuclear power plant
Russia attacks
ukrain
Volodymyr Zelenskyy
Russian President Putin
IAEA
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

మంటల్లో మాస్కో రష్యాపై అతిపెద్ద డ్రోన్ల దాడి..

మంటల్లో మాస్కో రష్యాపై అతిపెద్ద డ్రోన్ల దాడి..

ట్రంప్‌ రాజీ ప్రతిపాదనలపై శాంతి ఒప్పందానికి సిద్ధం 

ట్రంప్‌ రాజీ ప్రతిపాదనలపై శాంతి ఒప్పందానికి సిద్ధం 

ఉక్రెయిన్‌ యుద్ధంలో కీలక పరిణామం

ఉక్రెయిన్‌ యుద్ధంలో కీలక పరిణామం

"నేను మంచి తండ్రిని కాలేకపోయా"

"నేను మంచి తండ్రిని కాలేకపోయా"

ఇరాన్‌ తీరు ‘అణు’మానాస్పదమే: ఐఏఈఏ 

ఇరాన్‌ తీరు ‘అణు’మానాస్పదమే: ఐఏఈఏ 

ముడవప్రపంచ యుద్ధం.. జెలెన్‌స్కీ ఏమన్నారంటే?

ముడవప్రపంచ యుద్ధం.. జెలెన్‌స్కీ ఏమన్నారంటే?

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.