Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. International
  3. వెంటాడే గీతానికి ‘వంద’నం 
ADVERTISEMENT 

వెంటాడే గీతానికి ‘వంద’నం 

International Sakshi User Sakshi Sakshi Time Dec 22, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
BINACA-GEETMALA--AMEEN-SAYA.jpg

రేడియో సిలోన్‌ @ 100

‘భాయో ఔర్‌ బెహనో!’..  ఈ గంభీరమైన స్వరం వినిపించగానే భారతీయుల ఇళ్లలో సమయం స్తంభించిపోయేది. టీవీలు లేని కాలంలో.. ఇంటర్నెట్‌ ఊసే లేని రోజుల్లో.. సరిహద్దులు దాటి వచ్చి మన గుండె తలుపులు తట్టిన ఆ అద్భుతమే ’రేడియో సిలోన్‌’. ఆసియాలోనే మొదటి కమర్షియల్‌ షార్ట్‌–వేవ్‌ స్టేషన్‌గా వెలిగిన ఈ రేడియో, ఈ వారంతో విజయవంతంగా 100 ఏళ్లు పూర్తి చేసుకుంది. 

ఒక చరిత్ర.. ఒక ప్రస్థానం 
డిసెంబర్‌ 16, 1925న అధికారికంగా ప్రారంభమైన ఈ రేడియో సర్వీస్, ఆసియాలోనే అతిపెద్ద రికార్డెడ్‌ సాంగ్స్‌ లైబ్రరీని కలిగి ఉంది. భారత్‌లో కూడా దొరకని అరుదైన హిందీ పాటల రికార్డులు, ప్రపంచ దేశాల నేతల గొంతులు ఇక్కడ భద్రంగా ఉండటం విశేషం. 1949లో ’రేడియో సిలోన్‌’గా మారి, 1967లో ’శ్రీలంక బ్రాడ్‌ కాస్టింగ్‌ కార్పొరేషన్‌ (ఎస్‌ఎల్‌బీసీ)గా రూపాంతరం చెందినా, శ్రోతల మనసుల్లో మాత్రం అది ఎప్పటికీ ’రేడియో సిలోన్‌’ మాత్రమే.. 

అమీన్‌ సయానీ మ్యాజిక్‌..  
ప్రతి బుధవారం రాత్రి 8 గంటలవుతోందంటే చాలు.. రేడియో దగ్గర జనం గుమిగూడేవారు. అమీన్‌ సయానీ తన అద్భుత గళంతో హిందీ సినిమా పాటల ర్యాంకింగ్స్‌ను ప్రకటిస్తుంటే, ఆ ఉత్కంఠే వేరు. 1952 నుండి 1988 వరకు దాదాపు నాలుగు దశాబ్దాల పాటు ’బినాకా గీత్‌మాల’ భారతీయులను ఉర్రూతలూగించింది. నేటికీ శ్రీలంక రేడియోలో ’కోరా కాగజ్‌ థా యే మన్‌ మేరా’ వంటి పాత బాలీవుడ్‌ పాటలు వినిపిస్తుంటే, అదొక మధురమైన కాలయానమే.. 

పీవో బాక్స్‌ 574.. ఉత్తరాల వెల్లువ 
అప్పట్లో రేడియో సిలోన్‌కు వచ్చే ఉత్తరాల సంఖ్య చూసి శ్రీలంక తపాలా శాఖ ఆశ్చర్యపోయేదట. ముఖ్యంగా ’ఆల్‌ ఆసియా 
ఇంగ్లిష్‌ సర్వీస్‌’ కోసం భారత్‌ నుండి వేల సంఖ్యలో ఉత్తరాలు వచ్చేవి. ‘అప్పట్లో ఉత్తరాల వెల్లువను తట్టుకోవడానికి ‘పీవో బాక్స్‌ 574, కొలంబో’ అనే ప్రత్యేక చిరునామాను సృష్టించాల్సి వచ్చింది. చిత్రమేమిటంటే, ఆ ఉత్తరాల్లో అత్యధికం సికింద్రాబాద్‌ నుండే వచ్చేవి. ఆ తర్వాత ముంబై, షిల్లాంగ్‌ నుంచి ఉండేవి’.. అని ప్రస్తుత నిర్వాహకులు గుర్తు చేసుకుంటున్నారు. 

ప్రపంచ పరిణామాలకు సాక్షి 
ప్రస్తుతం ఎల్‌బీసీ సింహళ, తమిళ, ఇంగ్లిష్‌తో పాటు తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా సేవలు అందిస్తోంది. 70,000కు పైగా మ్యూజిక్‌ రికార్డులు, 78 ఆర్‌పీఎం నాటి పాత కాలపు రికార్డుల నుండి నేటి డిజిటల్‌ యుగం వరకు ఈ రేడియో అన్నీ చూసేసింది. ఎవరెస్ట్‌ శిఖరారోహణ వార్త దగ్గర నుండి, మనిషి చంద్రుడిపై అడుగు పెట్టిన విశేషాల వరకు ప్రపంచ పరిణామాలన్నింటికీ సాక్షిగా నిలిచింది. 

తరాలు మారినా.. తరగని మమకారం 
ప్రైవేట్‌ రేడియోలు, మ్యూజిక్‌ యాప్‌లు ఎన్ని వచ్చినా.. రేడియో సిలోన్‌ అందించిన ఆ అనుభూతి సాటిలేనిది. క్లాసికల్‌ నుండి పాప్‌ వరకు, జాజ్‌ నుండి కంట్రీ మ్యూజిక్‌ వరకు శ్రోతలకు షడ్రసోపేతమైన విందు వడ్డించిన ఈ రేడియో సర్వీస్, మరో వందేళ్ల పాటు తన ప్రయాణాన్ని దిగి్వజయంగా కొనసాగించాలని కోరుకుందాం. 
    
– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
radio
Asia
Sri Lanka
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

చారిత్రక విజయం సాధించిన వెస్టిండీస్

చారిత్రక విజయం సాధించిన వెస్టిండీస్

డబుల్‌ సెంచరీ చేజార్చుకున్న గ్రీవ్స్‌.. హోప్‌ శతకం

డబుల్‌ సెంచరీ చేజార్చుకున్న గ్రీవ్స్‌.. హోప్‌ శతకం

దినుషా, మెండిస్ కీలక భాగస్వామ్యం.. శ్రీలంక భారీ స్కోర్‌

దినుషా, మెండిస్ కీలక భాగస్వామ్యం.. శ్రీలంక భారీ స్కోర్‌

శ్రీలంక ఓపెనర్‌ సరికొత్త చరిత్ర

శ్రీలంక ఓపెనర్‌ సరికొత్త చరిత్ర

మాన్‌సూన్‌ మజిలీకి కేరాఫ్‌ అడ్రస్‌..

మాన్‌సూన్‌ మజిలీకి కేరాఫ్‌ అడ్రస్‌..

సూర్యవంశీ విధ్వసం.. 11బంతుల్లో హాఫ్ సెంచరీ

సూర్యవంశీ విధ్వసం.. 11బంతుల్లో హాఫ్ సెంచరీ

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.